Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Prepare the field for teacher transfers

 ఉపాద్యాయ బదిలీలకు రంగం సిద్ధం

Prepare the field for teacher transfers


ప్రాధమిక సమాచారం ప్రకారం జూన్ 6 నుండి ఉపాద్యాయ బదిలీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దానికి ముందు గా మే 28 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ గా ఉన్న School Asst పదవులకు ప్రమోషన్ లు ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 వేల పోష్టులు ఖాళీ లు ఉన్నా కూడా ఆర్థిక భారం మేరకు ఆర్థిక శాఖ 11,500 పోష్టులకు మాత్రమే అనుమతి ఇవ్వనుంది. దీని తరువాత జూన్ 6 నుండి ఉపాధ్యాయ బదిలీలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 2020 లో జరిగిన విధంగానే ఉపాద్యాయుల బదిలీలు web councelling ద్వారా జరుపుతారు. 2015 లో ఉపాద్యాయులకు web councelling నష్టం జరిగింది అనే కోరిక మేరక అప్పటి ప్రభుత్వం 2017 లో సాధారణ బదిలీలు manual గానే జరిపింది. ఇటీవల 2020 లో web ను దసరా కు ప్రారంభించి అనేక మార్పులు అనేక ఇబ్బందులతో సంక్రాంతి కి పూర్తి చేసిన ప్రభుత్వం మరో మారు web కు శ్రీ కారం చుట్టనుంది. 2020 లో బదిలీ ల ప్రస్థానం కొంత ఆలస్యం అయినా 98% మంది కి పూర్తిగా అనుకూలమైనది గానే భావించారు. 

అప్పుడు జరిగిన councelling లో web options MEO లాగిన్ లో డిస్ ప్లే కాక రాష్ట్రం లో 13 మంది ఇబ్బంది పడినట్టు గా తెలిసింది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా 312 మంది ఉపాధ్యాయులు తమరు మునిసిపల్ ప్రాంతం కు చెందిన వారుగా కోర్టు ను ఆశ్రయించడం తో ప్రభుత్వానికి కొంత మేర ఇబ్బంది వచ్చింది. ఇటువంటివి మరల పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. 

Merging పాఠశాలల విషయంలో ఒక అడుగు ముందుకు వేసిన విద్యాశాఖ 1 కిలో మీటర్ దూరం లో గల పాఠశాల విద్యార్ధుల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసి ఉంది. 8 సం॥ సర్వీసు పూర్తి చేసుకున్న సమీప ప్రాధమిక పాఠశాల లోని ఉపాధ్యాయుల వివరాలను TIS ద్వారా  వారిని బదిలీ కోసం ఉత్తర్వులు ఇవ్వనున్నారు. మిగిలిన 8 సం లు పూర్తి కాని వారిని క్వలిఫికేషన్ అనుగుణం గా జూనియర్ ను Merging ప్రాధమిక  పాఠశాల లోని 1, 2 తరగతుల కోసం ఉంచనున్నారు. దీని మూలాన్న SGT ఉపాద్యాయుల కొరత ఏర్పడ నుంది. 1 కిలో మీటర్ పరిధి లో గల చాలా ఉన్నత పాఠశాలలో తరగతి గదుల కొరత ఉంది. ఏది ఏమైన బదిలీ ల ప్రక్రియ ను జూలై 3 లోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు. సెప్టెంబర్ లో  DSC-2022 ని విడుదల చేస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Prepare the field for teacher transfers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0