Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Rs 2000 Notes: Can I find Rs 2,000 notes? What the RBI is saying

Rs 2000 Notes : రూ .2,000 నోట్లు దొరకవా ? ఆర్బీఐ ఏం చెబుతోందో వివరణ.

Rs 2000 Notes: Can I find Rs 2,000 notes?  What the RBI is saying

 1. భారతదేశంలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటు అయిన రూ.2,000 నోట్ల సర్క్యులేషన్ బాగా తగ్గిపోయింది.

గతంతో పోలిస్తే ప్రస్తుతం రూ.2,000 నోట్ల సర్క్యులేషన్ చాలా తక్కువగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2021-22 ఆర్థిక నివేదికలోని వివరాల ప్రకారం ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం రూ.2,000 నోట్ల విలువ 13.8 శాతం మాత్రమే. 

2. గతేడాది రూ.2,000 నోట్లు 17.3 శాతం సర్క్యులేషన్‌లో ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. కరెన్సీ నోట్ల సంఖ్య విషయానికి వస్తే ప్రస్తుతం కేవలం 1.6 శాతం రూ.2,000 నోట్లు మాత్రమే సర్క్యులేషన్‌లో ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో అంటే 2020-21లో ఇది 2 శాతంగా ఉండేది. ఇక 2019-20లో ఇది 2.4 శాతంగా ఉండేది. 

3. ఆర్‌బీఐ రిలీజ్ చేసిన అన్ని కరెన్సీ నోట్లను పరిగణలోకి తీసుకుంటే 2021 మార్చి 31 నాటికి 12,437 నోట్లు చలామణిలో ఉంటే, 2022 మార్చి 31 నాటికి 13,053 నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇక 2020 మార్చి నాటికి 274 crore కోట్ల రూ.2,000 నోట్లు చలామణిలో ఉంటే, 2021 మార్చి నాటికి 245 కోట్లకు తగ్గింది. 2022 మార్చి నాటికి 214 కోట్లకు తగ్గింది. 

4. ఈ లెక్కలు చూస్తుంటే మూడేళ్లుగా రూ.2,000 నోట్ల సర్క్యులేషన్ బాగా తగ్గిపోయినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇలాగే కొనసాగితే రూ.2,000 నోట్లు దొరకడం కూడా కష్టమే. ఇక రూ.500, రూ.2,000 నోట్లు కలిపితే 2022 మార్చి 31 నాటికి మొత్తం సర్క్యులేషన్‌లో ఉన్న కరెన్సీ నోట్లలో ఇవి 87.1 శాతంగా ఉన్నాయి. 2021 మార్చి 31 నాటికి 85.7 శాతంగా ఉన్నాయి. 

5. ఇక కరెన్సీ నోట్ల విలువ, కరెన్సీ నోట్ల సర్క్యులేషన్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.9 శాతం, 5 శాతం చొప్పున పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇది 16.8 శాతం, 7.2 శాతంగా ఉంది. చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల లెక్క చూస్తే రూ.500 నోట్లదే పైచేయి. ప్రస్తుతం 34.9 శాతం రూ.500 కరెన్సీ నోట్లు చలామణి అవుతున్నాయి. రూ.500 తర్వాత స్థానంలో రూ.10 నోటు ఉంది. రూ.10 నోట్లు 21.3 శాతం ఉన్నాయి.

6. ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారి రెండో వేవ్ తర్వాత శుభ్రమైన కరెన్సీ నోట్లను సర్క్యులేషన్‌లో ఉంచడంపై దృష్టి పెట్టినట్టు ఆర్‌బీఐ యాన్యువల్ రిపోర్ట్‌లో వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ నిర్వహణ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేసేందుకు కరెన్సీ నోట్లను ప్రజలు ఎలా వినియోగిస్తున్నారో, ఏఏ నోట్లు ఎక్కువగా మారుస్తున్నారో తెలుసుకున ప్రయత్నం చేసింది.

7. ఆర్‌బీఐ 2016 నవంబర్‌లో నోట్ల రద్దు తర్వాత రూ.2,000 కరెన్సీ నోట్లను పరిచయం చేసింది. కేంద్ర ప్రభుత్వం నల్లధనం, నకిలీ కరెన్సీని నిరోధించడానికి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన తర్వాత మొదట రూ.2,000 కరెన్సీ నోట్లను ఆర్‌బీఐ ముద్రించింది. ఆ తర్వాత కొత్త రూ.500 నోట్లను ప్రింట్ చేసింది.

8. ప్రస్తుతం ఆర్‌బీఐ నివేదిక ప్రకారం సర్క్యులేషన్‌లో కరెన్సీ నోట్ల వివరాలు చూస్తే రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.500, రూ.2,000 విలువ గల కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇక కాయిన్స్ విషయానికి వస్తే 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 డినామినేషన్ గల కాయిన్స్ చలామణిలో ఉన్నాయి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Rs 2000 Notes: Can I find Rs 2,000 notes? What the RBI is saying"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0