Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A must-see Sri Dakshinamoorthy photo in every home

ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండవలసిన  శ్రీ దక్షిణామూర్తి చిత్రం.

A must-see Sri Dakshinamoorthy photo in every home
      

ఇంట్లో ఒక్క దక్షిణామూర్తి చిత్ర పటము పెట్టి, ప్రతీ రోజూ 10 నిమిషాలు ఆయన ముందు కూర్చుని, ఆయన స్తోత్రమును కానీ, మంత్రమును కానీ చేస్తే వచ్చే ఫలితము ఇంత అని చెప్పలేము.

అపమృత్యువు తొలగిపోతుంది, మేధా శక్తి పెంపొందుతుంది, ధారణ, స్పష్టత కలుగుతాయి. కేవలము విద్యార్ధులకు మాత్రమే కాదు, అన్ని వయసుల వారికీ ఇది వర్తిస్తుంది.

మంచి ఆలోచనలు కలుగుతాయి, సత్వ గుణం వృద్ధి చెందుతుంది, ప్రారబ్ధ కర్మలు, దుష్కర్మల ఫలితం క్షీణిస్తుంది, ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి.

ఇది ఎంతో మంది జీవితాలలో జరిగింది. మీకోసం దక్షిణామూర్తి మంత్రమును, దక్షిణామూర్తి స్తోత్రమును పెడుతున్నాము.

స్తోత్రము లేదా మంత్రము కూడా చదవలేని వారు ఉంటే, కేవలము శ్రీ దక్షిణామూర్తి చిత్రపటాన్ని అలా చూస్తూ కూర్చున్నా విశేష ఫలితము ఉంటుంది.

రాబోవు జన్మలలో కూడా దక్షిణామూర్తి అనుగ్రహం వలన మంచి విద్య వస్తుంది.

ఒక్కసారి దక్షిణామూర్తిని శరణంటే జన్మజన్మల వరకూ ఆయన మనల్ని వదిలిపెట్టడు, ఇది సత్యం సత్యం సత్యం.

మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు కానీ, నడవలేని స్థితిలో ఉన్నవారు కానీ ఉంటే వారికి కనిపించేలా శ్రీ దక్షిణామూర్తి చిత్రపటాన్ని పెట్టండి. ఆ చిత్రపటాన్ని చూస్తూ ఉండమని చెప్పండి, అపమృత్యువు కలగదు.

ఈ స్తోత్రం ఎటువంటి ఉపదేశమూ పొందకుండా కూడా జపం చేసుకోవచ్చు.

మీకున్న సమయాన్ని బట్టి 108 సార్లు లేదా 1008 సార్లు జపం చేయవచ్చు.

ఎంత కాలం ఇలా చేయాలి అని చాలా మందికి వెంటనే వచ్చే అనుమానం కదా, మనం ఎంత కాలం సుఖ సంతోషాలతో జీవించాలి అనుకుంటామో అంత కాలము చేయవచ్చు.

ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసినది                   ఏ మంత్రం లేదా స్తోత్రము లేదా పూజ లేదా అనుష్టానము లేదా ఏ కార్యమైనా శ్రద్ధ, భక్తి, విశ్వాసంతో చేయాలి అంతేకానీ యాంత్రికంగా చేయకూడదు.

స్త్రీలు కూడా నిత్యమూ ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. వారికి ఇబ్బంది దినములలో చిత్రపటాన్ని చూస్తూ ఉన్నా చాలు.ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః

సర్వోజనా సుఖినోభావంతు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A must-see Sri Dakshinamoorthy photo in every home"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0