Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Are you making payments to phonepe, google pay, paytm? Can remember these tips.

 UPI Payment : ఫోస్పే , గూగుల్ పే , పేటీఎం పేమెంట్స్ చేస్తున్నారా ? ఈ టిప్స్ గుర్తుంచుకోగలరు.

Are you making payments to phosph, google pay, paytm?  Can remember these tips.


టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత పేమెంట్స్ చేసే వేగం కూడా పెరిగిపోయింది. ఒకప్పుడు కరెంట్ బిల్ కట్టాలంటే ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌కి వెళ్లి క్యూ కట్టాల్సి వచ్చేది.

కానీ ఇప్పుడు క్షణాల్లో కరెంట్ బిల్ కట్టేయొచ్చు. ఇదొక్కటేకాదు... అనేక రకాల పేమెంట్స్ క్షణాల్లో చేయొచ్చు. డబ్బులు కూడా నిమిషాల్లో ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ (UPI Payments) ఎక్కువగా చేస్తున్నారు ప్రతీ ఒక్కరు. గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే లాంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే యూపీఐ పేమెంట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోవాల్సి వస్తుంది. యూపీఐ మోసాలను (UPI Frauds) తగ్గించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.

మీ యూపీఐ పిన్ ఎవరికీ చెప్పకూడదు. ఏ బ్యాంకు గానీ, సంస్థ గానీ మీ యూపీఐ పిన్ అడగవు. కాబట్టి ఎవరికీ యూపీఐ పిన్ చెప్పొద్దు. వాట్సప్, ఎస్ఎంఎస్ ద్వారా యూపీఐ పిన్ షేర్ చేయకూడదు. ఎవరైనా మిమ్మల్ని యూపీఐ పిన్ అడుగుతున్నారు అంటే అది మోసమేనని గుర్తించాలి.

మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ యాక్సెస్ ఎవరికీ ఇవ్వకూడదు. మీ బ్యాంకు కేవైసీ వివరాలు అప్‌డేట్ చేస్తామని, మీ గ్యాడ్జెట్‌కు యాక్సెస్ ఇవ్వాలని ఎవరైనా కోరితే పట్టించుకోవద్దు. అలాంటివారు సూచించే యాప్స్ కూడా డౌన్‌లోడ్ చేయొచ్చు

ఆన్‌లైన్‌లో బహుమతుల పేరుతో మోసాలు జరుగుతుంటాయి. ఫలానా బహుమతి గెలుచుకోవాలంటే మీ యూపీఐ యాప్‌లో యూపీఐ పిన్ ఎంటర్ చేయాలని ఎవరైనా అడుగుతున్నారంటే అది మోసమేనని గుర్తించాలి. ఒకవేళ మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మీ అకౌంట్ ఖాళీ అయ్యే అవకాశం ఉంది.

iPhone: రియల్‌మీ, రెడ్‌మీ, సాంసంగ్ ఫోన్ ధరకే ఐఫోన్... ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్

మీరు యూపీఐ యాప్ ద్వారా పేమెంట్ చేస్తున్నా, ఎవరికైనా డబ్బులు పంపిస్తున్నా ట్రాన్సాక్షన్ చేసేముందు ఓసారి వారి వివరాలు సరిచూసుకోవాలి. ఇక మీ యూపీఐ పిన్‌ను తరచూ మారుస్తూ ఉండాలి. కనీసం నెలకు ఒకసారైనా యూపీఐ పిన్ మార్చాలి. లేకపోతే మూడు నెలలకోసారైనా తప్పనిసరిగా యూపీఐ పిన్ మార్చడం ద్వారా మీ అకౌంట్‌ను కాపాడుకోవచ్చు.

మీకు ఎవరైనా డబ్బులు పంపాల్సి ఉంటే యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి. అంటే మీరు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిందే. కానీ మీరు డబ్బులు స్వీకరించడానికి మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.

చాలావరకు యూపీఐ మోసాలు యూజర్లు అప్రమత్తంగా లేకపోవడం వల్లే జరుగుతుంటాయి. ఒకసారి డబ్బులు పోయిన తర్వాత తిరిగిపొందడం అంత సులువు కాదు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా యూపీఐ మోసాలను తగ్గించవచ్చు. మోసగాళ్లకు మీరు టార్గెట్ కాకుండా బయటపడవచ్చు. ఈసారి యూపీఐ పేమెంట్స్ చేసేప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుంచుకోగలరు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Are you making payments to phonepe, google pay, paytm? Can remember these tips."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0