Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration

 ఇదొక సాఫ్ట్ వేర్ కుర్రవాడి అద్భుత విజయగాధ.

మైసూరు వెళుతున్నారా? ఈ  మొబైల్ నంబర్  9620212227 గుర్తు పెట్టుకోండి. ఇది ఫుడ్ బాక్స్ అనే రెస్టరాంట్ నెంబర్.  మైసూర్ లో దిగగానే  ఈ నెంబర్ కు ఫోన్ చేయండి. విద్యారణ్యపురిలో ఉండే ఫుడ్ బాక్స్ కు ఎలా వెళ్లాల్లో కనుక్కోండి.  ఎన్ని పనులున్నా సరే, పొద్దున బ్రేక్ ఫాస్టుకో, లంచ్ కో, డిన్నర్ కో  తప్పకుండా  వెళ్లి సౌత్ ఇండియా  మైసూరు భోజనం స్పెషాలిటీ ఏమిటో రుచి చూడండి. అక్కడ  సౌత్ ఇండియన్ భోజనమే చేయండి. లంచ్ ధర రూ.110మాత్రమే.  ఇలాంటి అందమయిన శుచి అయిన రెస్టారెంట్లలో ఎక్కడా  110 రూపాయలకు భోజనం దొరకదు. మరొక్క విషయం, ప్రతి పండక్కి స్పెషల్ ఉంటుంది.  మీరు రుచి చూస్తే అవాక్కవుతారు. నాకయితే బిసిబెలే బాత్ బాగా నచ్చింది.

అక్కడ భోజనం చేయడం ఒక అద్భుతమయిన అనుభవమే కాదు, ఒక విజయగాథ ను తిలకించినట్లుంటుంది. ఆ విజయగాథ ఏంటంటే మైసూర్ ఎన్ ఐటిలో బిటెక్ పూర్తి చేశాడు మురళిగుండన్న. వయసు  23 సంవత్సరాలు. చదువయిపోగానే జెఎస్ డబ్ల్యూలో ఉద్యోగం వచ్చింది. మంచి జీతం. ఇంకా జీతం పెరిగే అవకాశం ఉంది.ఆస్తిపాస్తులు లేని మధ్య తరగతి కుటుంబానికి రెండులక్షల జీతమొచ్చే ఉద్యోగం వస్తే.. ఎలా ఉంటుంది. ఇల్లంతా సంబరం,కలకలలాడతూ ఉంటూంది. ఇంకే ముంది, పెళ్లవుతుంది. జీవితం లాహిరి లాహరిలో... లాగాసాగిపోతుంది. అంతేకదూ.

కాదు, మురళి గుండన్న ఒక రోజు ఆఫీసులో, ఇంట్లో బాంబు పేల్చాడు. ‘నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను.’ అని బాస్ కు చెప్పాడు. ఇంట్లో తల్లిదండ్రుల ముందు ప్రకటించాడు. అంతాషాక్.

ఇంతపెద్ద ఉద్యోగం ఎలా వదిలేస్తావ్, పోనీ ఏదయినా మరొక ఉద్యోగం చూసుకున్నాడా . లేదు. మంచి పద్దతి కాదు, ఉద్యోగం వదులుకోవడం ఏమిటి? అని నచ్చచెప్పేప్రయత్నం చేశాడు. మురళి వినలేదు. ఇంట్లో గగ్గోలు పెట్టారు.  వినలేదు. ఏంచేయాలనుకుంటున్నావ్ అని అంతా నిలదీశారు.

‘వ్యాపారం,’ అన్నాడు. ఏం వ్యాపారం అని  దబాయించారు.  ఫుడ్ బిజినెస్ అని కూల్ గా చెప్పాడు.  పెట్టుబడి ఎట్లాఅని ఆగ్రహంగా అడిగారు.  అవసరంలేదు అన్నాడు. 2015 నాటి మాట. అప్పటికి  మురళీ ఉద్యోగంలో చేరి ఏడాది అయింది. మురళీ తలతిక్క ఆలోచనలు చూసి ఇంట్లో వాళ్లంతా అవాక్కయిపోయారు. లక్షణమయిన ఉద్యోగం వదులుకుని, మెస్ పెడతానంటాడేమిటి? వీడికి పిచ్చపట్టిందా అనుకున్నారు. అతి కష్టమ్మీద, ఆఫీసులో బాస్ ను ఒప్పించాడు. మురళీ ప్లాన్ తెలుసుకున్నాక సరే అన్నాడు. సానుభూతి చూపుతూ మద్దతు ప్రకటించారు. రెండేళ్లు వ్యాపారం  చేసి అది జరక్కపోతే,వెనక్కు వచ్చేయ్ ఉద్యోగం ఇచ్చే పూచి నాది అని భజం తట్టి వీడ్కోలు పలికాడు.

బిజినెస్ ఎలా మొదలయింది?

ఫుడ్ బిజినెస్ ఎలా  చేయాలనుకున్నాడో తెలుసా? మురళి అమ్మమ్మ ఇందిరమ్మ మంచి వంటలు చేస్తుంది. వెజిటేరియన్ వంటలు చేయడంలో ఆమె దిట్ట. ఒక రోజు  ఆమె వంటలతో ఫుడ్ బిజినెస్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందనుకున్నాడు.  ప్లాన్ తయారుచేసుకున్నాడు.  ఇద్దర అత్తలు , ఉషా, సంధ్యలను కలుపుకున్నాడు. బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి ఇదేం వ్యాపారం, పూటకూళ్ల వ్యాప్యారం అని వాళ్లు విస్తుబోయారు. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. ఈ ప్లాన్ మరొక సంచలనం ఇంట్లో. ఎవరికీ ఇష్టంలేకపోయినా  అందరూ దారికి రాక తప్పలేదు. ఇలా అమ్మమ్మ తయారు చేసిన రుచికరమయిన, ఆథెంటిక్, సౌత్ ఇండియన్, హోం మేడ్ వంటకాలను క్యారియర్ తో సప్లయ్ చేయడమే వ్యాపారంగా ప్లాన్ చేస్కున్నాడు ఈ ఎన్ ఐటిలో ఇంజనీరింగ్ చదివిన కుర్రవాడు

2015 డిసెంబర్ 3 నుంచి క్యారియర్ భోజనం సప్లై మొదలుపెట్టాడు. పులావ్, పులిహోర,ఖీర్, పళ్లు... వీటితో మొదలయింది. మొదట నలభై మంది స్నేహితుల జాబితా తయారుచేసుకున్నాడు. వాళ్లలో అవసరమయిన వాళ్లకి సప్లై చేయడం. ఈ క్యారియర్ లను అందించడానికి ఇద్దరు స్నేహితులు సాయం తీసుకున్నాడు.

ఇలా మొదలయిన  ఫుడ్ సప్లై వ్యాపారం ఇపుడు ఫుడ్ బాక్స్ (FOOD BOX) కంపెనీ అయింది. పది క్యారియర్లతో ఫుడ్ బాక్స్ ఫుడ్ క్యారియర్ సర్వీసు ప్రారంభమయింది. ఇంట్లో ఉన్న చిన్న గరాజ్ లో కిచెన్ మొదలయింది.  రెండు స్టవ్ లను అద్దెకు తీసుకున్నారు. అమ్మమ్మ, అత్తలు వంట చేస్తున్నారు.  స్నేహితులు క్యారియర్ లు మోసుకెళ్తున్నారు.

సింపుల్ మార్కెటింగ్.

మొదట స్నేహితులు జాబితా తయారు చేసుకున్నారు. వాళ్లద్వారా మరికొన్ని అడ్రసులు సంపాదించారు. ఇరుగు పొరుగు, తర్వాత, కాలేజీలో జూనియర్లు, సీనియర్లు ... ఆపైన మైసూరులో ఉండే సాఫ్ట్ వేర్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగుల ఇళ్లకి పోవడం, తలుపుతట్టడం, తమ వంటల గురించిచెప్పడం మొదలుపెట్టారు. ఇలా తొలిరోజు పది టిఫిన్ బాక్స్ లతో మొదలయిన వ్యాపారం  చూస్తుండగానే రెండు వేల బాక్స్ లకు పెరిగింది. వంటలకు సర్వత్రా మంచిపేరొచ్చింది.  గ్రాండ్ మదర్ వంట అనేది  మార్కెటింగ్ కు బాగా తోడయింది.

ఇప్పటికీ మురళీ వ్యాపారం మొదలయి ఏడేళ్లయింది. ఫుడ్  బాక్స్ కూడా పెరిగి పెద్దదయింది.  ఇపుడు 25 మంది ఉద్యోగులు, వంటవాళ్లు ఉన్నారు. మైసూరు నుంచి  పుడ్ బాక్స్ కు 40  వేల మంది రిజిస్టర్స్ యూజర్స్ తయారయ్యారు. ఫుడ్ బాక్స్ అభిమానుల్లో ఇన్ఫోసిస్ సంస్ధాపకుడు నారాయణ మూర్తి కూడా ఉన్నారు.

నారాయణమూర్తి చాలా సార్లు తమ దగ్గర నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారని మురళీ గర్వంగా ఫోన్ లో చెప్పాడు. జొమాటో, స్విగ్గితో పోలిస్తే ఫుడ్ బ్యాక్స్  కారు చౌక. జొమాటో,స్విగ్గిలో ఒక పూర్తి భోజనం  రు.400 అయితే, చక్కటి అమ్మమ్మ చేతివంటకం, శుచిగా, శుభ్రంగా ఉండే లంచ్ కేవలం రు. 110 లే.   ఫుడ్ బాక్స్ లో సభ్యుడిగా చేరగానే ప్రతిరోజు రాత్రి మరుసటి రోజు మెన్యూ  మెసేజ్ వస్తుంది.  దానిని బట్టి  బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏం కావాలో ముందుగానే ఆర్డర్ బుక్ చేయవచ్చు.

ఇక్కడే మురళీ సక్సెస్ అయ్యాడు.  క్వాలిటీ  వంటలతో ఫుడ్ బాక్స్ డాక్టర్ల ను కూడా బాగా ఆకట్టుకుంది. తన కస్టమర్లలో 30 శాతం మంది డాక్టర్లుండటమే దీనికి సాక్ష్యం అని మురళీ చెబుతున్నాడు. తనకున్న రిజస్టర్డ్ కస్టమర్లలో చాలా మంది రోజూ ఫుడ్ అర్డర్ చేస్తున్నారు.  కొందరయితే మూడుపూటలా ఫుడ్ బాక్స్ క్యారియర్ తెప్పించుకుంటున్నారు.

ప్రతి శుక్రవారం, బుధవారం ఫుడ్ బాక్స్ ట్రెడిషనల్ ఫుడ్ మాత్రమే అందిస్తుంది. మిగతా రోజుల్లో కస్టమర్ల కోరికలను బట్టి మారుతూ ఉంటుంది.  కస్టమర్ బేస్ పెరగడంతో సౌత్ ఇండియన్ వంటకాలతో పాటు నార్త్ ఇండియన్ వంటకాలు మొదలయ్యాయి. మెల్లిగా చైనీస్ వంటకాలకు పాపులారిటీ పెరిగింది.

ఫుడ్ బాక్స్ దాదాపు జీరో ఇన్వెస్ట్ మెంటుతో మొదలయింది,సరుకులు కొనడం  మినహా మరొక పెట్టుబడి లేదు. మొదట్లో ప్రాఫిట్ గురించి ఆలోచించలేదు. మొదటి ఆరునెలలు పాటు లాభం లేదు. ఇపుడు బిజినెస్ సంవత్సరానికి రు. 2 కోట్లకు చేరినట్లు సమాచారం.

“ మా సక్సెస్ కు కారణం క్వాలిటీకి  ప్రాముఖ్యం ఇవ్వడమే.మేం దేన్నీ నిల్వచేయడం.   సరుకులు కూరగాయలు ఎప్పటికప్పుడొస్తాయి. వంట మసాలు ఏ రోజువి ఆరోజు తయారు చేస్తారు. పాత మసాలాలు వాడటం జరగదు,’ అని మురళీ చెప్పాడు.

బిజినెస్ మొదలయ్యాక ఒక ఏడాది పాటు కేవలం కుటుంబ సభ్యులే వంట చేశారు. ఇపుడు బిజినెస్ పెరగడంతో వంటవాళ్లను, ఇతర ప్రొఫెషనల్స్ ను పెంచాల్సి వచ్చింది. కుటుంబ సభ్యుల కఠిన పర్యవేక్షణలోనే వంటలు తయారువుతాయి.

దురదృష్టమేమిటంటే,అమ్మమ్మ చనిపోయింది.  అయితే, ఆమెకు తెలిసిన వంటలన్నీ డాక్యుమెంట్ చేశారు. అదే పద్దతిలో వంటలను చేస్తున్నారు. ఇప్పటికీ అమ్మమ్మ వంటనే ఫుడ్ బాక్స్ ను నడిపిస్తున్నది, ఇక ముందు కూడా నడిపిస్తాయని మురళీ చెప్పాడు.  2019 మార్చిలో మొట్టమొదటి క్యాంటిన్ ప్రారంభించారు. అయితే, దీనికి కొద్దిగా కోవిడ్ దెబ్బతిగిలింది. ఇపుడు పూర్తిగా కోలుకుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inspiration"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0