Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Buying Land: Are you buying a house with street flood? What does Vastu Shastra mean?

 Buying Land : వీధిపోటు ఉన్న ఇంటి స్థలం కొంటున్నారా ? వాస్తు శాస్త్రం ఏంచెబుతుంది ?

Buying Land: Are you buying a house with street flood?  What does Vastu Shastra mean?

Buying Land : వాస్తు శాస్త్రంలో వీధిపోట్ల గురించి ప్రత్యేకంగా వివరించ బడింది. ఏరైనా స్ధలం కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా చూసుకునేది. ఆ స్ధలానికి రోడ్డు పోటు ఏమైనా ఉందా అనే.

ఎలాంటి వీధిపోటు లేకుండా ఉండే స్థలాలను కొనుగోలు చేయాలని చాలా మంది కోరుకుంటారు. అయితే కొందరు మాత్రం కొన్ని రకాల వీధిపోట్లతో ఉన్న స్ధలాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. కొన్ని దిక్కుల్లో ఉండే వీధిపోట్లు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని నమ్మితే, మరికొన్ని వీధిపోట్ల వల్ల దురదృష్టం వెన్నాడుతుందని నమ్ముతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి స్ధలం కొనాలనుకునే వారు ముందుగా వీధిపోట్లు వాటి ప్రభావాలు, పర్యవసానాల గురించి ముందుగా తెలుసుకోవటం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వీధిపోట్ల గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

తూర్పు ఆగ్నేయం వీధి పోటు ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ వీధిపోటు వల్ల అనే దోషాలు కలుగుతాయి. ఇలాంటి స్ధలాన్ని కొనుగోలు చేసేవారు వ్యాపారం చేస్తుంటే వారికి నష్టాలు కలుగుతాయి. ఆస్తి చిక్కులు, వివాహం తరువాత విడాకులు, పోలీసు కేసులతో మనశ్శాంతి ఉండదు. తూర్పు ఆగ్నేయాన్ని తాకుతూ పడమర వైపు సాగే వీధి పోటు వల్ల ఖర్చులకు తగిన సంపాదన ఉండదు. స్త్రీలు అనారోగ్యంతో ఆందోళన చెందుతారు. అయితే పాల వ్యాపారం చేసేవారికి ఈ వీధి పోటు కలిసొస్తుంది. తూర్పు ఈశాన్యం వీధి పోటు చాలా శుభ ఫలితాలు పొందుతారు. సంతానం అభివృద్ధి చెందుతుంది. తూర్పు ఈశాన్యాన్ని తాకుతూ ఉత్తర వాయువ్యం వైపు సాగే వీధి పోటు వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. అయితే రాజకీయాల్లో రాణించేందుకు ఈశాన్యం రోడ్డు పోటు అనుకూలంగా ఉంటుంది. అయితే వరుస విజయాలు ఉన్న రాజకీయ నేతలు చివరకు మాత్రం అపజయం చవిచూడకతప్పదు.

పడమర నైరుతిని తాకుతూ ముందుకు సాగే వీధి పోటు వల్ల అభివృద్ధి కుంటుపడి, పొరుగు వారితో  సమస్యలు వస్తుంటాయి. కానీ నాలుగు వైపులా వీధి ఉంటే రాజకీయ నాయకులకు మంచి అభివృద్ధి ఉంటుంది. సంతానం కూడా రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. పడమర వాయువ్యం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. పడమర వాయువ్యాన్ని తాకుతూ ఉత్తర ఈశాన్యం వైపు సాగె వీధిలో కీర్తిప్రతిష్ఠలు, విదేశీయానం, ప్రేమ వివాహాలు వంటివి చోటు చేసుకుంటాయి.

ఉత్తర ఈశాన్యం వీధి పోటు వల్ల స్త్రీలు అభివృద్ధి చెంది రాజకీయ, వ్యాపార ఉద్యోగ రంగాలలో ఉన్నతస్ధాయిలో ఉంటారు. వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తారు. ఉత్తర ఈశాన్యం తాకుతూ తూర్పు ఆగ్నేయం వైపు సాగే వీధి వలన ఆస్తులు పరాయి వ్యక్తులపాలు కావడం, ద్వితీయ వివాహాల్లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఉత్తర వాయువ్య వీధిపోటు వల్ల మానసిక అశాంతి, రెండో సంతానానికి మానసిక వ్యాధి, తల్లిదండ్రులను దూరంగా ఉంచడం లాంటివి ఎదురు కావచ్చు. ఉత్తర వాయువ్యాన్ని తాకుతూ దక్షిణ నైరుతి వైపు సాగే వీధి పోటు వల్ల కోర్టు కేసులు, మోసపోవడం, ఏకాగ్రత లేకపోవటం జరుగుతుంది. ఏకైక స్త్రీ సంతానం ఉన్నవారు చాలా అభివృద్ధి పొందుతారు.

దక్షిణ నైరుతిలో వీధి పోటు తీవ్ర ఆర్థిక సమస్యలు కారణం అవుతుంది. పుత్ర సంతానం అనారోగ్యం అవుతారు. అనారోగ్య ఖర్చుల నిమిత్తం అప్పు చేస్తారు. దక్షిణ నైరుతి తాకుతూ ఉత్తరం వైపు సాగే వీధి పోటు కొంత వరకు మేలు చేస్తుంది. ఆస్తులు స్త్రీల పేరుతో, మనవల పేరుతో ఉంటే అభివృద్ధి చెందుతారు. ఇటువంటి గృహంలో ప్రతి రోజు గోపూజ జరగాలి. దక్షిణ ఆగ్నేయం వీధి పోటు వల్ల ధనం చేతిలో నిలవదు. అప్పుల్లో కూరుకుపోవటం వంటి పరిస్ధితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దక్షిణ ఆగ్నేయాన్ని తాకుతూ తూర్పు ఈశాన్యం వైపు వీధి సాగితే స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. వారి వల్ల గృహం అభివృద్ధి చెందుతుంది. కుమార్తెను మంచి ఇంటికి ఇచ్చి వివాహం చేస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Buying Land: Are you buying a house with street flood? What does Vastu Shastra mean?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0