Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If UPI payments are not successful, please complain on WhatsApp.

యూపీఐ పేమెంట్స్‌ సక్సెస్ కాలేదా.అయితే వాట్సప్ లో ఫిర్యాదు చెయ్యండిలా.

If UPI payments are not successful, please complain on WhatsApp.


యూపీఐ పేమెంట్స్‌ ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. భారత దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వీటిపైన ఆధారపడుతున్నారు. అయితే కొన్నిసార్లు పేమెంట్ ఫెయిల్యూర్ సమస్యలను కస్టమర్లు ఎదుర్కొంటున్నారు.

పేమెంట్ సక్సెస్ కాకపోయినా డబ్బులు కట్ సమస్య కూడా ఎదురవుతోంది. దీనివల్ల కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను ఇకపై చాలా సులభంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఫిర్యాదులు చేసుకునేందుకు వీలుగా డిజీసాథీ (DigiSaathi) పేరుతో ఓ ఆన్‌లైన్ సర్వీస్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. అంతేకాదు ఈ సేవలను వాట్సాప్ లో కూడా అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల మీరు క్షణాల్లోనే మీ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.

ఈ సేవలను పొందేందుకు యూజర్లు చేయాల్సిందల్లా +91 8928 91 3333 నంబర్‌ను కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేసి వాట్సాప్‌లో మెసేజ్ పంపించడమే. మెసేజ్ పంపించిన తర్వాత ఇంగ్లీషు లేదా హిందీ భాషల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని మీకు మరో మెసేజ్ వస్తుంది. ఇంగ్లీష్ అర్థం అవుతుంది అనుకుంటే ఒకటి నొక్కి సెండ్ చేయాలి. తర్వాత మీకు క్రెడిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డు ఇంకా రకరకాల సర్వీసులతో ఒక లిస్ట్ కనిపిస్తుంది. అందులో మీకు 3 నంబర్ గా నొక్కడం ద్వారా యూపీఐ లేదా బీహెచ్ఐఎం యూపీఐ ఆప్షన్ కనిపిస్తుంది. యూపీఐ సంబంధిత ఫిర్యాదుకు లేదా సమాచారం తెలుసుకునేందుకు మీరు 3 టైప్ చేసి సెండ్ బటన్ నొక్కాలి. తర్వాత వచ్చే మెసేజ్ లో రకరకాల నెంబర్లు ఉంటాయి.

అందులో మీరు 6 యూపీఐ సంబంధిత ఫిర్యాదులు కోసం కేటాయించడం జరుగుతుంది. అందుకే మీరు 6 అని టైప్ చేసి సెండ్ బటన్ నొక్కాలి. అనంతరం మీ బ్యాంక్ సంబంధిత వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు క్షణాల్లోనే ఎలాంటి శ్రమ పడకుండా ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చు.ప్రస్తుతం వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీస్ త్వరలో ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ప్రారంభం కానుంది.. డిజీసాథీ సేవలను ఈ https://digisaathi.info/ వెబ్‌సైట్‌లో పొందవచ్చు. ఇంటర్నెట్ ద్వారా సేవలు వద్దనుకుంటే 14431 లేదా 1800 891 3333 టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా కావాల్సిన పరిష్కారాలు పొందొచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If UPI payments are not successful, please complain on WhatsApp."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0