Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

KA Paul .. Why did he go from Hero to Zero?

 కేఏ పాల్ . హీరో నుండి జీరోకు ఎందుకు వచ్చాడు ?

KA Paul .. Why did he go from Hero to Zero?

కేఏ పాల్‌.. ఈ పేరు తెలియని తెలుగు వాడు ఉండడు అనడంలో సందేహం లేదు. ఒక మత ప్రచారకుడిగా ఆయన్ను దేశం మొత్తం గుర్తిస్తారు. వందల దేశాల్లో తన మత ప్రచారం చేసిన వ్యక్తి కేఏ పాల్‌. కొన్ని సంవత్సరాల క్రితం కేఏ పాల్‌ అమెరికా వంటి అగ్రరాజ్యం అధ్యక్షుడిని కలవడానికి అపాయింట్‌మెంట్ లేకుండా వెళ్లగలిగిన సత్తా ఉన్న వ్యక్తి కేఏ పాల్‌. భారత దేశ రాజకీయ చక్రం తిప్పిన ఎంతో మంది యోధులు.. ఉద్దండులు కూడా కేఏ పాల్‌ తో మీటింగ్ కోసంఎదురు చూసిన రోజులు అవి.

అలాంటి గొప్ప చరిత్ర కలిగిన కేఏ పాల్‌ ఇప్పుడు ఒక జోకర్ మాదిరిగా మారిపోయాడు. జనాలు ఆయన్ను ఒక జోకర్ మాదిరిగా చూస్తున్నారు అంటే ఎవరో కావాలని ఆయన్ను అలా చేసింది కాదు.

తనకు తానే అలా జనాల్లో ప్రొజెక్ట్‌ అయ్యాడు. తనను జనాలు హీరోగా చూసేలా చేసుకుంది ఆయనే... ఇప్పుడు జనాలు జీరోలా చూసేలా చేసుకుంది కూడా ఆయనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాల్ గత చరిత్రకు.. ఇప్పటి పరిస్థితికి పూర్తిగా ఆయనే కారణం.. ఆయనే కారణం.. ఆయనే కారణం. 

ముఖ్యంగా రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుండి కేఏ పాల్‌ ను ఒక జోకర్‌ కన్నా హీనంగా చూస్తున్న వారు ఉన్నారు. ఆయన మాటలు అలా ఉన్నాయి మరి. పిట్టల దొర మాటల మాదిరిగా ఆయన మాటలు ఉంటున్నాయి. నిన్ననే అమెరికా అధ్యక్షుడిని కలిశాను.. రష్యా అధ్యక్షుడితో ఫోన్ లో మాట్లాడి వార్నింగ్‌ ఇచ్చాను.. పదుల కొద్ది యుద్దాలు ఆపాను... దేశంలో రాజకీయ నాయకులు సహకరిస్తే లక్షల కోట్ల నిధులు తీసుకు వస్తాను అంటూ నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటంతో జోకర్ గా మారిపోయాడు.

ఇటీవలే దెబ్బలు కూడా తినే పరిస్థితికి వచ్చాడు. ఆయన్ను అభిమానించే వారు ఇప్పటికి కూడా ఉన్నారు. వారు పాల్‌ రాజకీయం వదిలేసి తన పని తాను చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాల్‌ మళ్లీ హీరో స్థాయికి వెళ్లలేక పోయినా జీరో కంటే ఇంకా తక్కువ స్థాయికి పోవద్దని జనాలు కోరుకుంటున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "KA Paul .. Why did he go from Hero to Zero?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0