Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The post Cell Phone

 The post Cell Phone: ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోగలరు.

The post Cell Phone

ప్రస్తుత సమాజంలో రోజురోజుకూ సెల్ ఫోన్ ల వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే ఫోన్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనేక రకాలుగా సమస్యలు తలెత్తుతాయి అని శాస్త్రవేత్తలు నిపుణులు చెబుతున్నప్పటికీ వారి మాటలను పెడచెవిన పెట్టేస్తున్నారు.

ఈ సెల్ ఫోన్ ల వల్ల రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని తెలిసి కూడా వాటి వినియోగం తగ్గించడం లేదు. సెల్ ఫోన్ లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే ఎంతో మంది వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇదే విషయంపై పలువురు సైంటిస్టుల పరిశోధనల్లో కూడా జరపగా అవును అనే వెల్లడయింది. అయితే సెల్ ఫోన్ ల వాడటం వల్ల మరొక సమస్య రావచ్చు అని సైంటిస్టులు తెలిపారు. మరి ఆ సమస్య ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారం అధికంగా సెల్ ఫోన్ లో మాట్లాడటం వల్ల మనకు కొమ్ములు వస్తాయట. ఈ వార్త విన్న చాలామంది అవునా అని అంటే అవుననే సైంటిస్టులు అంటున్నారు. సాధారణంగా మనం బైక్ డ్రైవ్ చేసినప్పుడు లేదంటే ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు మన తలను వెనక్కి లేదా పక్కకు ఉంచుతాను దీనివల్ల బరువు అంతా తలపై పడితే వెనుక భాగంలో ఉండే లిగ్మెంట్ వద్ద ఎముక మొలుస్తుందట.

అయితే ఈ ఎముక సుమారుగా దాదాపు పక్షి ముక్క అంత సైజు ఉంటుందట. ఇదే విషయాన్ని చిరో ప్రాక్టర్ డేవిడ్ సహాహర్ అనే సైంటిస్టు ఓ ప్రముఖ విదేశీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఈ విధంగా తల వెనుక భాగంలో కొమ్ములా ఎముక మొలవడానికి కారణం అతిగా సెల్‌ఫోన్లలో మాట్లాడడమే అని సైంటిస్టులు తేల్చారు.స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్ లను ఎక్కువగ ఉపయోగిస్తూ వాటి ద్వారా ఎక్కువగా కాల్స్ మాట్లాడే వారికీ ఇలా తల వెనుక ఎముక మొలుస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ కొమ్ము వల్ల ప్రస్తుతం వారికి వచ్చే ప్రమాదం ఏమీ లేకపోయినప్పటికీ రాను రాను వారి తల ఆకృతి మారుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం దాదాపుగా 41 శాతం మంది యువతలో ఈ సమస్య ఉందని వారు తేల్చారు. కాబట్టి ఫోన్ ఉపయోగించేటప్పుడు తలను అటూ ఇటూ కాకుండా స్ట్రైట్ గా పెట్టి ఉపయోగించడంతో పాటుగా సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవచ్చు చెబుతున్నారు నిపుణులు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The post Cell Phone"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0