Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Monkeypox scare in India .. Medical alert!

 భారత్ లో మంకీపాక్స్ కలకలం . వైద్యశాఖ అలర్ట్ !

Monkeypox scare in India .. Medical alert!

దేశంలో మంకీపాక్స్‌ వైరస్ కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో మంకీపాక్స్‌ లక్షణాలు బయటకు వచ్చాయి. వివరాల ప్రకారం.. యూపీలోని ఘజియాబాద్‌లో ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్‌ లక్షణాలు బయటపడ్డాయి.

కాగా, బాధితురాలి శరీరంపై దద్దర్లు రాగా, దురద ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో, శాంపిల్స్‌ సేకరించి పూణేలోని ల్యాబ్‌కు టెస్ట్‌ కోసం పంపినట్టు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. ఇక, చిన్నారి కుటుంబానికి ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేదని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్‌ నెలకొంది. ఈ నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు అలర్ట్‌ అయ్యారు.

ఇదిలా ఉండగా.ఫ్రాన్స్‌లో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది. కాగా, ఫ్రాన్స్‌లో మొదటి మంకీపాక్స్‌ కేసు మే నెలలో నమోదు అయింది. ఇక, జూన్‌ నాటికి ఈ కేసుల సంఖ్య 100ను దాటింది.

కరోనా వేరియంట్లతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మంకీపాక్స్‌ రూపంలో మరో ఉపద్రవం తోడైంది. ఈ కొత్త వైరస్‌ మంకీపాక్స్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది.

మంకీపాక్స్‌ను సీరియస్‌గా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది.

ఇదిలా ఉండగా.. ఫ్రాన్స్‌ను మంకీపాక్స్‌ వైరస్‌ ఆందోళనకు గురి చేస్తోంది. ఫ్రాన్స్‌లో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది. కాగా, ఫ్రాన్స్‌లో మొదటి మంకీపాక్స్‌ కేసు మే నెలలో నమోదు అయింది. ఇక, జూన్‌ నాటికి ఈ కేసుల సంఖ్య 100ను దాటింది.

మరోవైపు.. మంకీపాక్స్‌ సోకిన వారందరూ పురుషులే కావడం గమనార్హం. ఇక వీరి వయస్సు 22 నుంచి 63 ఏళ్ల మధ్యే ఉందని ఫ్రెంచ్‌ నేషనల్ పబ్లిక్‌ హెల్త్‌ ఏజెన్సీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. మంకీపాక్స్‌ సోకిన వారిలో ఒక్కరే మాత్రమే చికిత్స పొంది కోలుకున్నారని సదరు ఏజెన్సీ తెలిపింది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 700 మంది మంకీపాక్స్‌ బారిన పడ్డారని అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తెలిపింది. అమెరికాలో ఇప్పటి వరకు 21 మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. కాగా, కొత్త వైరస్‌ మంకీపాక్స్‌పై ప‍్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. మంకీపాక్స్ బారినపడిన వారు రెండు నుండి నాలుగు వారాలలో కోలుకుంటారని స్పష్టం చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Monkeypox scare in India .. Medical alert!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0