Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Statue Of Unity

 పటేల్ విగ్రహం: ప్రపంచంలోనే ఎత్తైన స్టాట్యూ.. విశేషాలివే!

Statue Of Unity

నర్మదా నది మధ్య భాగంలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహంగా గుర్తింపు పొందిన స్టాట్యూ ఆఫ్ యూనిటీని ప్రధాని నరేంద్ర మోదీ నేడు (అక్టోబర్ 31) జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా.. పటేల్ విగ్రహ విశేషాలు

నర్మదా నది మధ్యలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని మోదీ నేడు జాతికి అంకితం చేశారు. పటేల్ జయంతి రోజున విగహ్రాన్ని ఆవిష్కరించడం విశేషం. 182 మీటర్ల ఎత్తయిన ఈ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహం కావడం గమనార్హం. ఇప్పటి వరకూ ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహంగా చైనాలోని బుద్ధ స్ప్రింగ్ టెంపుల్ గుర్తింపు పొందింది. దీని స్థానాన్ని పటేల్ విగ్రహం వెనక్కి నెట్టింది.

ఈ విగ్రహాన్ని సర్దార్ సరోవర్ డ్యాంకు 3.5 కి.మీ. దిగువన సాధు బెట్ వద్ద నర్మదా నది మధ్యనున్న దీవిలో నిర్మించారు. ఈ విగ్రహ నిర్మాణానికి 2,12,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉపయోగించారు. 18 వేల టన్నుల రీయిన్‌ఫోర్స్‌డ్ స్టీల్, 3550 టన్నుల కాంస్యం, 6 వేల టన్నుల స్ట్రక్చర్డ్ స్టీల్‌ను వాడారు. 180 కి.మీ. వేగంతో గాలులు వీచినా.. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేలా విగ్రహాన్ని నిర్మించారు. ప్రాజెక్ట్‌కు గత వందేళ్లలో గరిష్టంగా వచ్చిన వరద ముప్పును అంచనా వేసి.. దాన్ని తట్టుకునేలా పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణానికి 3 ఏళ్ల 9 నెలల సమయం పట్టగా.. రూ.2,979 కోట్లు ఖర్చయ్యాయి. ఈ విగ్రహ నిర్మాణానికి 3 వేల మంది కార్మికులు, 300 మంది ఇంజినీర్లు శ్రమించారు. ఈ విగ్రహం ఆరడుగుల ఎత్తయిన మనిషి కంటే వంద రెట్లు ఎత్తు ఉంటుంది.

విగ్రహం గ్రౌండ్ లెవల్‌లో మ్యూజియం, మెమోరియల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. లిఫ్ట్‌ల ద్వారా సందర్శకులు విగ్రహం లోపలి భాగం నుంచి 157 మీటర్ల ఎత్తు వరకు వెళ్లొచ్చు. పటేల్ విగ్రహ ఛాతి భాగం నుంచి నర్మదానది పరిసర ప్రాంతాల అందాలను వీక్షించొచ్చు.

ఈ విగ్రహాన్ని రామ్ సుతార్ (93) అనే శిల్పి చెక్కారు. మహాత్మా గాంధీ విగ్రహాలను చెక్కడం ద్వారా ఆయన దేశవిదేశాల్లో పేరు సంపాదించారు. ఆయన రూపొందించిన మహాత్ముడి విగ్రహాలను మన దేశంతోపాటు రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌లలో ఏర్పాటు చేశారు.

Statue Of Unity

గుజరాత్‌లో జన్మించిన సర్దార్ పటేల్ ఖ్యాతిని అంతర్జాతీయంగా చిరస్థాయిగా నిలపాలని నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంకల్పించి శ్రీకారం చుట్టారు. గుజరాత్‌లో 182 నియోజక వర్గాలున్న నేపథ్యంలో పటేల్ విగ్రహం ఎత్తు 182 మీటర్లు ఉండేట్లుగా నిర్మిస్తున్నారు. అంటే ఈ విగ్రహం ఎత్తు 597 అడుగుల ఎత్తు ఉండేలా దీనిని నిర్మిస్తున్నారు. 19వేల చదరపు కిలోమీటర్ల వ్యాసార్ధంలో 2989 కోట్ల భారీ ఖర్చుతో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు[2]. ఈ విగ్రహం నిర్మాణం అక్టోబర్ 2014లో ప్రారంభించి అక్టోబర్ 2018 లో అనగా 4 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేశారు. దీని కోసం 75వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 5వేల 700 టన్నుల ఉక్కు, 18వేల 500 టన్నుల స్టీలు రాడ్లు, 22వేల 500 టన్నుల రాగి షీట్లు వినియోగించారు. ఈ భారీ విగ్రహాన్ని నిర్ణీత గడువులోపు తయారీ పనులు ముగించేందుకు 2500 మందికి పైగా కార్మికులు పనిచేశారు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతలు పెద్దదిగా నిర్మిస్తున్న సర్ధార్ పటేల్ ఐక్యత స్మారక చిహ్నం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Statue Of Unity"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0