Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The rules to be folowed in temples.

 దేవాలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు... ఎందుకో తెలుసా? The rules to be folowed in temples.

The rules to be folowed in temples.

పంచమ రకాలు.

దేవాలయాలు పంచ(ఐదు) రకాలుగా ఉంటాయి. వాటిలో ఒకటి స్వయంవ్యక్త స్థలాలు - భగవంతుడే స్వయంగా వెలసినవి.. దివ్య స్థలాలు - దేవతలచే ప్రతిష్టింపబడినవి.. సిద్ధ స్థలాలు - మహర్షులు, తపస్సు చేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్టించినవి. పౌరాణ స్థలాలు - పురాణాలలో చెప్పబడి ప్రసిద్ధిగాంచినవి.. మానుష స్థలాలు - రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ట చేయబడి ఉంటాయి.

దేవాలయ గోపురాలు.

హిందూ దేవాలయాల్లో ఎక్కువగా గాలి గోపురాలు ఉంటాయి. గాలిగోపురం, ప్రధాన ద్వారం, వైకుంఠ ద్వారం, ధ్వజ స్తంభం, గర్భగుడి, ద్వారపాలకులు, వంటశాల తదితర విభాగాలు ఉంటాయి.

ఈ పనులు చేయకండి.

దేవాలయాల్లో ఆగమశాస్త్రం ప్రకారం పూజారులు, భక్తులు, అధికారులు ఏ విధంగా వ్యవహరించకూడదంటే.. ముఖ్యంగా ఆలయం లోపలికి ఎవ్వరూ కూడా వాహనాలలో రావడం.. చెప్పులు, బూట్లతో వంటి వాటితో తిరగడం చేయరాదు.

అప్పుడే లోపలికి ప్రవేశించాలి.

ఆలయాల్లో ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాతే గుడి లోపలికి ప్రవేశించాలి. ఆలయంలో లోపలికి తలపాగా ధరించి వెళ్లకూడదు. అలాగే చేతుల్లో ఏవైనా ఆయుధాలను పెట్టుకుని అస్సలు ప్రవేశించకూడదు.

తినుబండారాలను తీసుకుని.

ఆలయంలోకి ఒట్టి చేతులతోగాని, కుంకుమ పెట్టుకోకుండా గాని, తాంబూల చర్వణం చేస్తూ గాని, తినుబండారాలేవైనా తింటూ గాని దేవాలయంలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరాదు.

నిద్రపోరాదు.

దేవాలయంలో అడుగుపెట్టిన తర్వాత నిద్రపోవడం, కాళ్లు చాపుకుని కూర్చోవడం వంటి పనులను కూడా చేయరాదు. అలాగే ఆలయ ప్రాంగణంలో మల, మూత్ర విసర్జన వంటి పనులు చేయకూడదు.

వివాదాలు పెట్టుకోరాదు.

ఆలయాల్లో ఎవ్వరితోనూ.. ఎప్పటికీ వివాదం అనేదే పెట్టుకోరాదు. అలాగే దేవాలయ ప్రాంగణంలో ఏ జీవికీ హాని కలిగించడం లేదా హింసించడం వంటివి అస్సలు చేయరాదు.

పరనింద చేయకూడదు.

దేవాలయ ప్రాంగణంలో అహంకారం, గర్వంతో, అధికార దర్పంతో అస్సలు ఉండకూడదు. దేవుని ఎదుట పరస్తుతిని, పరనింద వంటి పనులను చేయరాదు. ఒకే చేతితో నమస్కారం చేయరాదు. అధికార గర్వంతో దేవాలయ ప్రాకారంలో ప్రవేశించి అకాల సేవలను చేయరాదు. అలాగే, దేవుని ఎదుట ప్రుష్ఠభాగం చూపిస్తూ కూర్చోకూడదు. ఆలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు. ఎందుకంటే భగవంతుని ముందు అందరూ సమానులే అని భావించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The rules to be folowed in temples."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0