Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

WhatsApp Edit Message Feature

 వాట్సాప్ మరో అదిరే ఫీచర్ .మెసేజ్లో తప్పులు ఉంటే ఇక ఈజీగా .

WhatsApp Edit Message Feature

WhatsApp Edit Message Feature: ప్రముఖ సోషల్​ మీడియా ప్లాట్​ఫాం వాట్సాప్​లో మరో కొత్త ఫీచర్​ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఒకసారి పంపిన మెసేజ్​లను మళ్లీ ఎడిట్​ చేసుకునే వెసులుబాటును వాట్సాప్ పరీక్షిస్తోంది.

WhatsApp Edit Message Feature: ప్రపంచంలోనే అత్యంత ఆదరణ గల మెసెంజర్​ వాట్సాప్​​. మిగతావాటితో పోలిస్తే వాట్సాప్​ సంభాషణ చాలా సురక్షితం. ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​ ఫీచర్​ వల్ల మన సందేశాలు ఇతరులకు తెలిసే అవకాశం ఉండదు. వాట్సాప్​ తమ వినియోగదారుల కోసం త్వరలో ఎడిట్​ ఆప్షన్​ అనే కొత్త ఫీచర్​ తీసుకురానున్నట్లు తెలిసింది. అంటే ఒకసారి పంపిన మెసేజ్​ను మళ్లీ ఎడిట్​ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. ప్రస్తుతం దీనిని పరీక్షిస్తున్నట్లు తెలిపిన వాట్సాప్‌ బీటా ట్రాకర్ డబ్ల్యూఏబీటాఇన్ఫో.. త్వరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది.

మెసేజ్​ చేసినప్పుడు అందులో అక్షర దోషాలున్నా సరిచేసుకోవడానికి, సరైన సమాచారం పంపలేదని అనిపించినప్పుడు ఇప్పటివరకు మళ్లీ పంపించడం, లేదా పంపిన సందేశం డిలీట్​ చేయడం వంటివి చేస్తుంటారు యూజర్లు. ఇక కొత్త సదుపాయంతో.. ఆ ఇబ్బందులు తప్పుతాయి. మెసేజ్​ డిలీట్​ చేయకుండానే.. పంపిన సందేశాన్నే ఎడిట్​ చేసి పంపొచ్చు. ఇప్పటికే టెలిగ్రామ్​లో ఈ ఫీచర్​ ఉంది. ఇప్పుడు వాట్సాప్​లోకి రానుంది.

వాట్సాప్​లో కొత్త ఫీచర్​నిజానికి వాట్సాప్​ ఐదేళ్ల క్రితమే ఈ ఫీచర్​ను పరీక్షించి, ఆ తర్వాత వెనుకడుగు వేసిందని తెలుస్తోంది. మళ్లీ ఇన్నాళ్లకు అదే ఎడిట్​ మెసేజ్​ బటన్​పై పనిచేస్తోంది. అయితే.. ఎడిట్​ చేసినట్లు అవతలి వ్యక్తికి తెలుస్తుందా అంటే అవకాశమే లేదని చెబుతోంది డబ్ల్యూఏబీటాఇన్ఫో. ప్రస్తుతానికి సాధారణ మెసేజ్​లానే కనిపిస్తుందని పేర్కొంది. అయితే.. ఇందులో ఏమైనా మార్పులు ఉంటాయా లేదా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "WhatsApp Edit Message Feature"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0