Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The post Gods Photos

 The post Gods Photos: ఇంట్లో ఏ దేవుళ్ల ఫోటోలు ఉండాలి.ఏవి ఉండకూడదు.? వివరణ.

The post Gods Photos

దేవళ్లకు సంబంధించి చిన్న చిన్న విషయాల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా దేవుడిరూములో, ఇంట్లో, దిష్టికోసం పెట్టే ఫొటోలు, విగ్రహాలకు సంబంధించి ఎన్నో డౌట్స్ ఉంటాయి.

ఇంట్లో ఏ ఫొటోలు ఉండాలి…ఏవి ఉండకూడదు…!!

  • 1. సూర్యభగవానుడి ఫొటోను ఇంట్లో పెట్టకూడదు. ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి నేరుగా నమస్కరించాలి.
  • 2. పూజగది విడిగా లేనట్లయితే…పంచముఖ ఆంజనేయుడి ఫొటోను ఇంట్లో పెట్టకూడదు.
  • 3.ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫొటో, విగ్రహం ఇంట్లో ఉంచకూడదు. లక్ష్మీ నరిసింహ, యోగనరసింహ, ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫొటో పెట్టుకుని పూజ చేయవచ్చు.
  • 4. చేతిలో పిల్లనగ్రోవి ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో ఉన్న విగ్రహం కానీ ఇంట్లో ఉండవచ్చు
  • 5. లక్ష్మీ దేవి విగ్రహం ముందు లేదా ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో (వెండి గిన్నె అయితే ఇంకా మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచడం మంచిది.
  • 6. కాళికా దేవి , ప్రత్యంగిరా దేవి ఫోటోలు అస్సలు ఇంట్లో పెట్టుకోవద్దని పురాణాలు చెబుతున్నాయి.
  • 7. ఇంట్లో విగ్రహాలు పెట్టేవారు విగ్రహాలు చిన్నసైజులో ఉండేలా చూడాలి. పెద్దగా ఉంటే మహానివేదన తప్పనిసరి. అభిషేకం, పూజలేకుండా ఉండవద్దు.
  • 8. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహానికి పెట్టుకోకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండటంలో తప్పులేదు.
  • 9. ఇంటి గుమ్మానికి దిష్టి కోసం రాక్షసుల ఫోటోలు పెట్టవద్దు. ఇలాంటి ఫొటోలు పెడితే ఇంటి యజమానికి తరచూ అనారోగ్యానికి గురవుతారు. వినాయకుడి ఫొటో లేదా దిష్టి యంత్రం ఫొటో పెట్టాలి.
  • 10. నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుంచి తీసివేయాలనుకుంటే గుడిలో పెట్టడం మంచిది.
  • 11. ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమ వైపున ఉండాలి. విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహానికి తొండం కుడి వైపున ఉండాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉంటే మంచిది.
  • 12 ఇక ఇంట్లో ఉంటే ఫొటోల్లోలక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు. లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతో అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటోకి గృహస్థులు పూజించడం మంచిది.
  • 13. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజైన వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించడం మంచిది. మీరు చేసిన పూజకు దేవుడు అనుగ్రహాన్ని ప్రసాదం రూపంలో స్వీకరించారని అర్థం.
  • 14. పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా., పూజ గదిలో గోడకు పసుపు రాసి పసుపు మధ్యలో గౌరీ కుంకుమ పెట్టడం మర్చి పోవద్దు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The post Gods Photos"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0