Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

With these tips you can increase your eligibility for a home loan.

 ఈ టిప్స్‌తో హోంలోన్‌ పొందే అర్హతను పెంచుకోగలరు.

With these tips you can increase your eligibility for a home loan.

మీరు ఇల్లు కొనాలనుకుంటున్నట్లయితే.. చేతి నుంచి ఎంత ఖర్చు పెట్టాలి? బ్యాంకు నుంచి రుణం (Home Loan) ఎంత తీసుకోవాలో ముందే తెలుసుకోవాలి. మీరు కొనే ఇంటిని బట్టి బ్యాంకు కొంత మొత్తం వరకు మాత్రమే రుణంగా ఇస్తుంది. అయితే, మీకు ఎంత రుణం ఇవ్వాలన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మరి మీ అర్హతను పెంచుకునే ఐదు కీలకాంశాలను ఇక్కడ చర్చిద్దాం...

మీ క్రెడిట్‌ స్కోరును పెంచుకోగలరు.

క్రెడిట్‌ స్కోరు (Credit Score) మీరు తిరిగి రుణం చెల్లించే స్తోమతను తెలియజేస్తుంది. ఈ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే.. మీరు సకాలంలో రుణం చెల్లించగలరని బ్యాంకు విశ్వసిస్తుంది. లేదంటే మీరు నెలవారీ వాయిదాలు సరిగా చెల్లించలేరేమోనని మదింపు చేస్తుంది. కాబట్టి తక్కువ క్రెడిట్‌ స్కోరు (Credit Score) ఉన్నవారు రుణం పొందడం కొంత కష్టమైన పని. క్రెడిట్‌ కార్డు (Credit Card) బిల్లులను సకాలంలో చెల్లించడం, ఎక్కువ క్రెడిట్‌ కార్డులను వాడకుండా ఉండడం, క్రెడిట్‌ యుటిలైజేషన్ రేషియో (Credit Utilization ratio)ను 20-30% మధ్య ఉంచడం ద్వారా క్రెడిట్‌ స్కోరు (Credit Score)ను మెరుగుపరచుకోవచ్చు. 

కాలపరిమితిని ఎంచుకోగలరు.

మీకు గృహరుణం (Home Loan) తీసుకోవడం తప్పనిసరైతే.. దీర్ఘకాల కాలపరిమితికైనా ఒప్పుకోవాల్సిందే. అప్పుడు మీరు నెలానెలా చెల్లించే వాయిదాల మొత్తం తగ్గుతుంది. ఫలితంగా క్రమం తప్పకుండా రుణాన్ని చెల్లించే స్తోమత ఉంటుంది. ఈఎంఐ మొత్తం పెరిగితే.. భారం పెరిగి వాయిదాలు చెల్లించలేకపోవచ్చు. ఫలితంగా ఆలస్య రుసుములు, అపరాధ వడ్డీ పెరిగిపోయి పెద్ద గుదిబండగా మారుతుంది. పైగా క్రెడిట్‌ స్కోరు సైతం దెబ్బతింటుంది.

జాయింట్‌ గృహరుణాలు.

భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, స్నేహితులు.. ఇలా ఎవరో ఒకరు మీ సన్నిహితులతో కలిసి రుణానికి దరఖాస్తు చేసుకుంటే మంజూరు ఖాయం. పైగా పెద్ద మొత్తంలో లోన్‌ అందే అవకాశం ఉంటుంది. జాయింట్‌ గృహరుణంలో సంస్థలు ఇద్దరి ఆదాయాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఫలితంగా రుణం పొందే అర్హత పెరుగుతుంది.

మునుపటి రుణాలు చెల్లించగలరు

హోంలోన్ (Home Loan) దీర్ఘకాల రుణం. వాహన, వ్యక్తిగత రుణాలకు సగటున 4-5 ఏళ్ల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. కాబట్టి హోంలోన్‌ తీసుకునే ముందు స్వల్పకాల రుణాలేమైనా ఉంటే చెల్లించేసేయండి. ఫలితంగా మీరు నెలానెలా చెల్లించడానికి మీ చేతిలో సరిపడా డబ్బు ఉంటుంది. పైగా మన ఆదాయంలో 40-50 శాతానికి మించి ఈఎంఐలకు చెల్లించొద్దు. బ్యాంకులు సైతం మీ అన్ని రుణాల ఈఎంఐల మొత్తం ఆ పరిధిలోపే ఉండేలా చూస్తాయి. లేదంటే రుణ మంజూరుకు నిరాకరించే అవకాశమూ లేకపోలేదు.

అదనపు ఆదాయ వనరులను కలపండి.

మీకు అద్దె, బిజినెస్‌ వంటి అదనపు ఆదాయ మార్గాలు ఉంటే.. మీ గృహరుణ అర్హత పెరుగుతుంది. మీ నెలవారీ లావాదేవీలను బ్యాంకులు గమనిస్తాయి. పెద్ద మొత్తంలో డబ్బు మీ ఖాతా నుంచి చేతులు మారితే.. మీకు రుణం తిరిగి చెల్లించే స్తోమత ఉందని అర్థం. అందుకే మీ ఖాతా ద్వారా ఎంత ఎక్కువ లావాదేవీలు జరిగితే.. మీ రుణ మంజూరుకు అంత మంచిది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "With these tips you can increase your eligibility for a home loan."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0