Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

All presidents are sworn in on 25th July. Do you know why?

రాష్ట్రపతులందరి ప్రమాణ స్వీకారం జులై 25నే. ఎందుకో తెలుసా?

All presidents are sworn in on 25th July.  Do you know why?

జులై 25కు దేశ చరిత్రలో ఓ ప్రత్యేకత ఉంది.

భారత ఆరో రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన నీలం సంజీవరెడ్డి నుంచి.. 14వ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ వరకు అందరూ అదే తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.

ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకార తేదీ కూడా జులై 25గానే నిర్ణయించారు.

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకార తేదీ జులై 25. అయితే.. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి జులై 25వ తేదీని ఖరారు చేయడం ఇదే తొలిసారి కాదు. 

గడిచిన 45 ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతుండటం విశేషం. 

తొలిసారిగా దేశ ఆరో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 1977 జులై 25న ఆ పదవిని అలంకరించారు. 

అనంతరం ఆ బాధ్యతలు చేపట్టిన జ్ఞాని జైల్‌సింగ్‌ నుంచి.. తాజాగా పదవీ విరమణ చేసిన రామ్‌నాథ్‌ కోవింద్‌ వరకు అందరూ ఇదే తేదీన రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు.

ఈ తేదీ వెనుక ఉన్న కథేంటో చూద్దాం.

1950 జనవరి 26న డా.రాజేంద్రప్రసాద్‌ దేశ ప్రథమ పౌరుడిగా ప్రమాణం చేశారు. 

1952 రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మళ్లీ 1957లోనూ ఎన్నికయ్యారు. 

అనంతరం 1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ రాష్ట్రపతి అయ్యారు. అయితే ఆ తర్వాత పదవి చేపట్టిన కొందరు పూర్తి కాలంపాటు కొనసాగలేకపోయారు. 

1967 మే 13న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన డా.జాకీర్ హుస్సేన్‌ మే 3 1969లో మృతిచెందారు. 

వీవీ గిరి తర్వాత ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ సైతం పదవీకాలాన్ని పూర్తిచేయలేకపోయారు.

అనంతరం నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా 1977 జులై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తికాలంపాటు అత్యున్నత పదవిలో కొనసాగారు. 

ఆ తర్వాత బాధ్యతలు తీసుకున్నవారంతా విజయవంతంగా తమ పదవీ కాలాన్ని ముగించారు. 

జులై 25న బాధ్యతలు స్వీకరించడం.. ఐదేళ్ల తర్వాత జులై 24న పదవీ విమరణ చేయడం ఆనవాయితీగా మారింది. 

గత 45 ఏళ్లుగా ఇదే కొనసాగుతోంది. 

ఇప్పటివరకు తొమ్మిది మంది రాష్ట్రపతులు ఇదే తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. 

ఇప్పుడు ముర్ము పదో వ్యక్తి కావడం విశేషం.

జులై 25న ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్రపతులు

★ నీలం సంజీవరెడ్డి

★ జ్ఞాని జైల్​ సింగ్

★ ఆర్​. వెంకట్రామన్​

★ శంకర్​ దయాళ్​ శర్మ

★ కేఆర్​. నారాయణన్​

★ ఏపీజే. అబ్దుల్​ కలాం

★ ప్రతిభా దేవి సింగ్​ పాటిల్​

★ ప్రణబ్​ ముఖర్జీ

★ రామ్​నాథ్​ కోవింద్​

★ ద్రౌపదీ ముర్ము


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "All presidents are sworn in on 25th July. Do you know why?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0