Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Are you suddenly sweating .. if neglected .. life is in danger .

 Health Tips : అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం .

Are you suddenly sweating .. if neglected .. life is in danger .

వేడిగా ఉన్నప్పుడు లేదా ఎంతో కష్టమైన పని చేసిన తర్వాత చెమటలు పట్టడం సాధారణ విషయమే. అయితే, కొంతమందికి మాత్రం ప్రతి సీజన్‌లో చెమటలు పడుతుంటాయి.

ఇంకొందరికి మాత్రం చాలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చెమట పడుతుంది. ఇలా కాకుండా ఎవరికైనా అకస్మాత్తుగా చెమటలు పడుతుంటే మాత్రం, నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అకస్మాత్తుగా చెమటలు పట్టడం అంటే తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధి లక్షణం కావొచ్చని నిపుణులు అంటున్నారు. వెంటనే జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంట. అయితే ఈ విషయాన్ని డాక్టర్లకు సరైన సమయంలో చెబితే ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చంట.

గుండెపోటు లక్షణాలు.

దిమిర్రర్ నివేదిక ప్రకారం ఆకస్మికంగా చెమటలు పట్టడం గుండెపోటుకు సంకేతమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఎవరికైనా గుండెపోటు వచ్చేప్పుడు, ఆ సమయంలో కొరోనరీ ధమనులు గుండెకు రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేవు. కానీ, గుండెపోటు సమయంలో గుండెకు ఎక్కువ రక్తం అవసరమవుతుంది. ఆపై రక్తాన్ని తీసుకువెళ్లడానికి ధమనులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంచడానికి ఎక్కువ చెమట మొదలవుతుంది.

గుండెపోటు అనేది చాలా తీవ్రమైన వైద్య పరిస్థితి. ఇందులో ఒక వ్యక్తి కోలుకునే అవకాశం కూడా లభించదు. అతని ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది. కొరోనరీ ధమనులు గుండెకు రక్తాన్ని తీసుకువెళతాయి. శక్తి, ఆక్సిజన్ ద్వారా దానిని సజీవంగా ఉంచుతాయి. కరోనరీ ఆర్టరీ వ్యాధిలో గుండె కండరాలకు రక్తాన్ని సరిగ్గా తీసుకెళ్లలేదు. దీని కారణంగా గుండెపోటు వస్తుంది. గుండెపోటు వల్ల గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. దీనిని కార్డియాక్ అరెస్ట్ అని కూడా అంటారు.

రాత్రిపూట చెమటలు.

స్త్రీలకు రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టినట్లు అనిపిస్తే, అది గుండెపోటు లక్షణం కావచ్చు. మెనోపాజ్ సమయంలో రాత్రిపూట చెమటలు పట్టడంపై జాగ్రత్తగా ఉండాలి.

డ్రగ్స్.కామ్ ప్రకారం, చెమటలు పట్టడం అనేది అథెరోస్క్లెరోసిస్‌తో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు. ఈ పరిస్థితిలో ప్లేక్ అని పిలిచే కొవ్వు పేరుకుపోవడం వల్ల ధమనులు ఇరుకుగా మారుతాయి. అథెరోస్క్లెరోసిస్ గుండెపోటుతోపాటు గుండె వైఫల్యానికి దారితీస్తుంది.

గుండెపోటు ఇతర సంకేతాలు.

  • ఛాతీ నొప్పి
  • చేతుల్లో నొప్పి
  • మెడ, దవడ లేదా వీపుపై ఒత్తిడి
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • తలతిరగడం
  • వికారం లేదా అజీర్ణం
  • అలసట

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Are you suddenly sweating .. if neglected .. life is in danger ."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0