Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Baseline Test

22న విద్యార్థులకు పునాది పరీక్ష


  •  పైతరగతులకు వెళ్లే పిల్లలసామర్థ్యాలపై అంచనా
  •  2 నుంచి 10వ తరగతి వరకు పిల్లలకు పరీక్ష
  • ఫలితాల ఆధారంగాలోపాలను సవరించే ప్రక్రియ
  • ఇతర విద్యార్థులతో సమంగాతీర్చిదిద్దనున్న పాఠశాల విద్యాశాఖ

రాష్ట్రంలోని పాఠశాలల్లో పైతరగతులకు వెళ్లే ప్రతి విద్యార్థి సామ ర్ధ్యాలను పరిశీలించేందుకు పాఠశాల విద్యా శాఖ ఈనెల 22వ తేదీన పునాది పరీక్ష (బేస్.. లైన్ టెస్టు) నిర్వహించనుంది. 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పైతరగతులకు వెళ్లేవారికి ఈ పరీక్ష నిర్వహించనున్నారు. 2022-23 విద్యాసంవత్సరం జులై 5వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత ఏడాది ఒకటో తరగతి విద్యార్థులు ఈ ఏడాది రెండో తరగతిలోకి ప్రవేశించారు. అలా వరు సగా 9వ తరగతి విద్యార్థులు పదో తరగతి లోకి వచ్చారు. ఈ విద్యార్థులు గత ఏడాది పాఠ్యాంశాలను అనుసరించి నిర్ణీత సామర్ధ్యా లను సాధించారా? లేదా? పైతరగతిలోని పాఠ్యాంశాలను అభ్యసించేందుకు వారి సంసిద్దత ఏమేరకు ఉంది? అనే అంశాలను పరీక్షించడానికి ఈ బేస్లైన్ టెస్టును పాఠశాల విద్యాశాఖ నిర్వహించనుంది. ముఖ్యంగా పాఠశాల స్థాయి పిల్లల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (పునాది అక్షరాస్యత, సం ఖ్యా పరిజ్ఞానం)ని ఈ పరీక్ష ద్వారా అంచనా వేయనున్నారు. ఆయా కిందిస్థాయి తరగతు ల్లో నేర్చుకోవలసిన సామర్థ్యాలు విద్యార్థు ల్లోలేకపోతే వారు పైతరగతుల్లో మరింత వెనుకబడే అవకాశం ఉంటుంది. ఇతర విద్యా ర్థులతో సమానంగా వారు పైతరగతుల్లో ముందుకు సాగలేదు. ఈ ఉద్దేశంతోనే పాఠ శాలలు తెరిచిన తొలినాళ్లలోనే అన్ని తరగతు ల విద్యార్థులకు ఈ బేస్లైన్ టెస్టును పాఠ శాల విద్యాశాఖ గతంలో నుంచి నిర్వహిస్తోం ది. లోపాలున్న విద్యార్థులను ముందే గుర్తిం చడం ద్వారా వారికి తగిన తర్ఫీదునిచ్చి ఆ యా సామర్ధ్యాలను పెంపొందించనున్నారు.

మార్గదర్శకాలు విడుదల

ఈ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి పరీక్షల నిర్వహణ విధివిధానాలతో మార్గదర్శ కాలు విడుదల చేసింది. విద్యార్థుల ఆన్సర్ స్క్రిప్టులను, ఇతర మెటీరియల్ను ఈనెల 26వ తేదీలోపు రాష్ట్ర కార్యాలయానికి చేర్చాల ని సూచించింది. ఏటా ఈ పరీక్షల్లో ఆయా విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించి కేంద్ర విద్యాశాఖ పాఠశాల విద్యార్థుల సామర్థ్యా లపై నివేదికలను రూపొందిస్తుంది. యాన్యు వల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు (అసర్) పేరిట ఈ నివేదికలను విడుదల చేస్తున్నారు. ఈ పరీక్షల కోసం ప్రత్యేక మూల్యాంకన మెటీరియల్ను ఆయా స్కూళ్లకు అందిస్తు న్నారు. పరీక్షల నిర్వహణ సూచనలతో మార్గదర్శక బుక్లెట్, టెస్టింగ్ టూల్స్ (పేపర్ పెన్నుతోటి పరీక్షకు) ఓరల్ టెస్టింగ్ టూల్స్ను పంపిణీ చేశారు. ఈ పరీక్షల నిర్వహణకు ఖర్చును కూడా పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష భరించనున్నాయి. ఈ పరీక్ష నిర్వహణకు రూ.2.87 కోట్లు విడుదల చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

బేస్ లైన్ పరీక్షకు సంబంధించిన మెటీరియల్ పాఠశాలలకు పంపిణీ చేయడానికి సంబంధించి మండల విద్యాశాఖ అధికారులకు సూచనలు:

 ఈ నెల 21-07-2022 వ తేదీ న  అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు(మాత్రమే) పంపిణీ చేయాలి.

 1) ఉపాధ్యాయులకు సూచనలు:

  • ఇవి  4 పేజీలు ఉంటాయి. వీటిని మండలములోని ప్రతి  ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి ఒక కాపీ  చొప్పున పంపిణీ చేయవలెను. 
  • (తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు ఉన్నత పాఠశాలలకు ఉపాధ్యాయుల సంఖ్యను అనుసరించి % లెక్కించి పంపిణీ చేయాలి). 
  • 2) మౌఖిక పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రములు(2-10 తరగతులు):* 
  •  ఇవి రెండు శాంపిల్స్ కలవు. ఒక్కొక్క శాంపిల్ 5 పేజీలు ఉంటుంది (తెలుగు ఆంగ్లము మరియు గణితం).
  • ఈ రెండు శాంపిల్స్ మండలంలోని అందరు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు  ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ చొప్పున పంపిణీ చేయాలి 
  • ( తక్కువ సంఖ్యలో ఉంటే ఉన్నత పాఠశాలలకు ఉపాధ్యాయుల సంఖ్యను అనుసరించి % లెక్కించి పంపిణీ చేయాలి).
  • 3) 2-5 తరగతులకు రాత ప్రశ్నపత్రములు (తెలుగు మరియు ఆంగ్లము):
  • ఇవి 10 శాంపిల్స్ కలవు ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్కటి చొప్పున ఇవ్వవలెను. (ఉదాహరణకు ఒక పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉంటే ఒక్కొక్క  శాంపిల్  4 చొప్పున 10 శాంపిల్స్ ఇవ్వవలెను 4×10=40)
  • గమనిక: మౌఖిక పరీక్షలోనే గణిత రాత పరీక్ష కలదు.
  • 4) 6-10 తరగతులకు వ్రాత పరీక్ష ప్రశ్పత్రములు:
  • ఇవి పాఠశాలల వారీగా ప్యాక్ చేయబడ్డాయి .
  • ఏ పాఠశాల ప్యాకెట్ ఆ పాఠశాలకు పంపిణీ చేయాలి.

జిల్లా విద్యాశాఖ అధికారి

ప్రకాశం జిల్లా

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Baseline Test"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0