Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Income Tax Return

Income Tax Return : ఆదాయపు పన్ను అందరూ కట్టాల్సిందేనా .? ఎవరెవరు తప్పనసరిగా రిటర్న్స్ ఫైల్ చేయాలంటే .?

Income Tax Return


 ఆదాయ పన్ను(ఐటీ) శాఖ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ రిటర్న్స్ తప్పనిసరిగా దాఖలు చేయాల్సిన వ్యక్తులకు సంబంధించిన జాబితాలో కొన్ని రకాల మినహాయింపులను తొలగించింది.

2021-22 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2022-23) సంబంధించిన ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు జులై 31, 2022గా నిర్ణయించింది. అయితే ఈ సమయానికి ఆదాయ పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయాల్సిన అవసరం ఉందో లేదో చెక్ చేసుకోవాలని సూచించింది. గడువులోపు ఐటీఆర్ దాఖలు చేయని వ్యక్తులపై ఐటీ డిపార్ట్‌మెంట్ అదనపు ఛార్జీలు విధించవచ్చు. లేదా క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.

ఓ నివాసిత వ్యక్తి ఆదాయం సంవత్సరానికి సెట్ చేసిన మినహాయింపు పరిమితి కంటే ఎక్కువగా ఉంటే, ఆ వ్యక్తిని పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయమని అడుగుతారు. కొత్త పన్ను విధానం ప్రకారం.. ఐటీఆర్ ఫైల్ చేయాలనుకుంటున్న వారికి మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా నిర్ణయించారు.

పాత పన్ను విధానం ప్రకారం.. 60 ఏళ్లలోపు వారికి మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా నిర్ణయించారు. 60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు వారికి రూ.3 లక్షలు (సీనియర్ సిటిజన్లు), ఇక 80 ఏళ్లు పైబడిన వారికి(సూపర్ సీనియర్ సిటిజన్లు) రూ.5 లక్షలు పన్నులో మినహాయింపు ఉంటుంది.

ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం TDS (ట్యాక్స్ డిడక్ట్ యట్ సోర్స్) /TCS (ట్యాక్స్ కలెక్ట్ యట్ సోర్స్) రూ.25,000 కంటే ఎక్కువగా ఉన్నవారు, సీనియర్ సిటిజన్‌ అయితే రూ.50,000 కంటే ఎక్కువగా ఉంటే వారు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుందని ఐటీ డిపార్ట్ మెంట్ పేర్కొంది.

ఏదైనా వ్యాపారం చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్న సీనియర్ సిటిజన్స్ ఐటీఆర్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు గత నిబంధనల స్థానంలో కొత్తగా టీడీఎస్, టీసీఎస్ తీసుకొచ్చారు. ఒక సంవత్సర కాలంలో సేవింగ్స్ అకౌంట్‌లో రూ.50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిటిట్ చేసిన వ్యక్తులు కూడా తప్పనిసరిగా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

క్యాపిటల్ గెయిన్స్‌ను ట్యాక్స్ మినహాయింపు నుంచి క్లెయిమ్ చేయడానికి ముందు, ఒక వ్యక్తి గ్రాస్ ఇన్‌కమ్ మినహాయింపు పరిమితిని మించి ఉంటే సదరు వ్యక్తి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాగే విదేశీ ఆదాయ వనరులు లేదా విదేశీ ఆస్తులు ఉన్న వ్యక్తులు, ఒకే బిల్లులో లేదా ఏడాది పొడవునా మొత్తంగా రూ.1 లక్ష కంటే ఎక్కువ విద్యుత్ బిల్లును చెల్లించిన వ్యక్తులు, తనకోసం లేదా ఇతర వ్యక్తిపై విదేశీ ప్రయాణానికి రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసిన వారు కూడా ఐటీ రిటర్న్స్ తప్పనిసరిగా ఫైల్ చేయాల్సి ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Income Tax Return"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0