Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Is there a pooja room in the kitchen?

 కిచెన్ లోనే పూజ గది ఉందా? దేవుడి ఫొటోల పక్కన చనిపోయిన వారి ఫోటోలుండొచ్చా? పూజ గదిలోకి బొద్దింక వస్తే.

చాలామంది వారి ఇంటి నిర్మాణం అప్పుడు అన్ని గదులు విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ పూజగది గురించి మాత్రం అంత ఎక్కువగా పట్టించుకోరు. కొంతమంది పూజ కోసం ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తే, ఇంకొంతమంది కిచెన్ రూములో ఓ పక్కగా చిన్న అల్మరాను కేటాయిస్తారు.

మరికొంతమంది హాల్‌లోనే ఓ అల్మరాను కేటాయిస్తారు. ఇకపోతే, చాలామంది ఇళ్లల్లో అసలు పూజగది అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అలాంటి వారు పూజామందిరాన్ని వాస్తు ప్రకారం ఈశాన్య దిశగా పెట్టుకోవడం చాలా మంచిది.

బాల్కనీలో పూజగది 

వంటగది లేదా బాల్కనీలో పూజగదిని ఏర్పాటు చేయడం వల్ల చెడు ఫలితాలు ఉంటాయని కూడా వాస్తుశాస్త్రం చెబుతోంది కాబట్టి, అలా చేయకపోవడం మంచిది. లివింగ్‌ రూమ్‌‌లో లేదా ప్రత్యేకంగా ఓ గదిలో పూజమందిరాన్ని ఏర్పాటు చేసున్నట్లయితే.. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.

పాలరాతితో తయారైన పూజామందిరాలు పాలరాతితో తయారైన పూజామందిరాలు చూసేందుకు ఎంతో బాగుంటాయి. వాటి వల్ల గదికే కొత్త అందం వస్తుంది. ఫైబర్‌తో తయారైన పూజామందిరాలు కూడా బాగానే ఉంటాయి. వీటి ఖరీదు కూడా కొంచెం తక్కువే. పూజ గదిలో ఇటాలియన్‌ వైట్‌ మార్బుల్స్ లేదా సిరామిక్‌ టైల్స్ వేసినట్లయితే చాలా బాగుంటాయి.

చిన్న చిన్న చాపలు పూజ గదిలో.

ఈశాన్య దిశగా నాలుగు అంగుళాల ఎత్తులో ప్లాట్‌ఫామ్‌లాగా కట్టి దాని మీద దేవుని పటాలు పెట్టుకోవచ్చు. కూర్చునేందుకు అక్కడ చిన్న చిన్న చాపలు కూడా పెట్టుకోవచ్చు. ఇక, గోడలకు వినాయకుడు, రాధాకృష్ణ చిత్రపటాలు అలంకరించవచ్చు. టెర్రకోట, బ్రాస్‌ దీపాలను పై కప్పు నుంచి వేలాడదీయవచ్చు. గదిలో ఓమూలగా దీపాల స్టాండ్‌ను అమర్చినట్లయితే.. పూజగది చాలా అందంగా ఉంటుంది

పీట వేసి ఇంటిలో 

ఎక్కడ వీలు దొరికితే అక్కడ దేవుడి గదిని ఏర్పాటు చేసుకోకూడదు. దేవుడి గది కోసం కూడా వాస్తును పాటించాల్సిందే. దేవుడికి ప్రత్యేకించి ఒక గదిని ఏర్పాటు చేయలనుకుంటే, ఈశాన్యం గదిని అందుకు వాడుకోవటం మంచిది. అయితే ఈశాన్యం గదిలో ఎత్తుగా అరుగుగాని మందిరం మాదిరి కట్టడంగాని నిర్మించకూడదు. దేవుడి పటాలను ఈశాన్యం గదిలో దక్షణ, పశ్చిమ నైరుతిలలో పీట వేసిగాని, ఏదైనా మంచి వస్ర్తము వేసి దానిపై పటాలు, ప్రతిమలు వుంచి పూజించాలి.

గోడలకు వేలాడదీయాలి 

పటాలను గోడకు వులాడదీయదలిస్తే దక్షిణ, పశ్చిమ గోడలకు వేలాడదీయాలి. ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమగోడలలో గల అలమారలో కూడా దేవుణ్ణి వుంచవచ్చు. ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయడం వీలుకాని పక్షంలో తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, వాయవ్యాలలో దేవుడిగదిని ఏర్పాటు చేసుకోవచ్చు.

తూర్పు, ఉత్తరాలకు అభిముఖంగా దేవుడి పటాలు, ప్రతిమలు ఎటువైపు(ఏ దిక్కుకు) అభిముఖంగా వుండాలి? అనేది అనేకమంది ప్రశ్న కొందరు తూర్పు, ఉత్తరాలకు దేవుడు అభిముఖంగా వుండాలని, మరికొందరు పూజించేవారి ముఖము తూర్పు, ఉత్తరాలకు అభిముఖంగా వుండాలని చెబుతున్నారు

టాయిలెట్సు ఉండకూడదు 

పూజ గదికి ఎటువైపు కూడా అనుకుని బాత్ రూమ్ లేదా టాయిలెట్సు ఉండకూడదు. ఇదే విధంగా పూజ గది పైనగాని, కింద గాని టాయిలెట్సు, వుండకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి పొరపాటు చేయకూడదు. చాలా వరకు అపార్ట్ మెంట్స్ లో ఒకరి పూజ గది పైన ఇతరుల టాయిలెట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.

బొద్దింక దరిద్ర దేవత వాహనం 

అలాగే పూజ గది మీద 'లో-రూఫ్' వేసి అనవసరమైన సామాను వేయడం చాలా మంది చేస్తుంటారు. ఇలా చేయకూడదు. ఇక చాలా మంది తమ పెద్దల ఫోటోలను పూజగది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. పూజ గదిలో బొద్దింక దూరింది అంటే మనం శుభ్రంగా ఉంచలేదని అర్ధం. బొద్దింక దరిద్ర దేవత వాహనం అని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఇంట్లో మృతి చెందిన వారి ఫోటోలు 

ఇక పూజగదిలో సాధారణంగా ఇష్టదేవతల ఫోటోలను ఉంచుకోవడం సంప్రదాయం. పూజ కోసం ఏర్పాటు చేసిన గదిలో దేవుడు ఫోటోలతో పాటు ఇంట్లో మృతి చెందిన వారి ఫోటోలను కూడా ఉంచుతారు. దేవుళ్ళతో పాటు వారిని కూడా స్మరిస్తూ.. పూజలు చేస్తుంటారు. అయితే మరణించిన వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం వారిని పూజించడం, స్మరించడం తప్పుకాదు. కానీ దేవుడి దగ్గర చనిపోయిన వారి ఫోటోలను ఉంచకూడదు.

దేవుని రూంకు తాళం 

ఇక సాధారణంగా మన ఇళ్లలో ఓ పెద్ద తప్పు చేస్తుంటారు. సెలవులకు ఊరెళుతున్నాం కదా అని దేవుని రూంకు తాళం వేస్తారు. అలా చేయడం వల్ల దేవుడిని మనం ఇంట్లోకి రాకుండా ఆపినట్లు అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. దేవుడి ఫోటోల్లో ఎప్పుడు దంపతులు ఫోటోలు ఉంచాలట అలా చేయడం వల్ల జీవితంలో అపశృతులు చోటు చేసుకోకుండా ఉంటాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Is there a pooja room in the kitchen?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0