Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Instructions for Administering Oral Test in Baseline Test

బేస్లైన్ టెస్ట్ నందు మౌఖిక పరీక్ష నిర్వహణకు సూచనలు.

Instructions for Administering Oral Test in Baseline Test

తెలుగు

  • ఒక్కొక్క విద్యార్థిని పిలిచి  మొదటగా ఇచ్చిన ప్రశ్నా పత్రం లోని రెండు పేరాలలో ఏదైనా ఒక చదవమని కోరాలి. 
  • పేరాను మూడు కంటే తక్కువ తప్పులతో చదివితే ఆ విద్యార్థి పేరా స్థాయి లో ఉన్నట్లుగా గుర్తించాలి. 
  • అప్పుడు ఆ విద్యార్థిని కథ చదవమని కోరాలి. కథను మూడు కంటే తక్కువ తప్పులతో  చదివితే ఆ విద్యార్థి కథా స్థాయి లో ఉన్నట్లుగా గుర్తించాలి. 
  • పేరాను మూడు కంటే ఎక్కువ తప్పులతో చదివిన విద్యార్థులను ప్రశ్నా పత్రం లోని ఏవైనా ఐదు పదాలను చదవమని కోరాలి. 
  • ఐదు పదాలలో కనీసం నాలుగు పదాలు స్పష్టంగా చదవగలిగిన విద్యార్థిని పదాల స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 
  • ఐదు పదాలలో నాలుగు పదాలు సరిగ్గా చదవక పొతే ఆ విద్యార్థిని ప్రశ్నా పత్రం నుంచి  ఏవైనా ఐదు అక్షరాలు చదవమని కోరాలి.  
  • ఐదు అక్షరాలలో కనీసం నాలుగు అక్షరాలు సరిగ్గా గుర్తించినట్లైతే ఆ విద్యార్థి అక్షరాల స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 
  • ఐదు అక్షరాలలో నాలుగు అక్షరాలు గుర్తించకపోతే ఆ విద్యార్థి ప్రారంభ స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 

గణితం 

  • ప్రశ్నా పత్రంలో ఇచ్చిన ఆరు అంకెలలో నాలుగు కంటే తక్కువ అంకెలను విద్యార్థి గుర్తించినట్లయితే ఆ విద్యార్థి ప్రారంభ స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 
  • ఇచ్చిన  ఆరు అంకెలలో నాలుగు కంటే ఎక్కువ అంకెలను గుర్తించిన విద్యార్థిని రెండు అంకెల సంఖ్యలను గుర్తించమని అడగాలి. 
  • ఇచ్చిన రెండు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే తక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థి ఒక అంకె సంఖ్యల స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 
  • ఇచ్చిన రెండు  అంకెల సంఖ్యలలో నాలుగు కంటే ఎక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థిని మూడు అంకెల సంఖ్యలను గుర్తించామని అడగాలి. 
  • ఇచ్చిన మూడు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే తక్కువ సంఖ్యలను గుర్తించిన  విద్యార్థి రెండు అంకెల స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 
  • ఇచ్చిన మూడు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే ఎక్కువ సంఖ్యలను గుర్తించిన  విద్యార్థిని చతుర్విధ ప్రక్రియలోని కూడిక తీసివేత గుణకారం భాగాహారంలకు సంబందించిన ప్రశ్నలు అడగాలి.  
  • చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలకు రెండు ప్రశ్నలకు సరైన సమాధానం చేయని విద్యార్థులను మూడంకెల స్థాయిలో ఉన్నట్లు గుర్తించాలి. 
  • చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలకు రెండు ప్రశ్నలను సరిగ్గా చేయని విద్యార్థులను మూడంకెల స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 
  • చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలకు రెండు ప్రశ్నలను  సరిగ్గా చేసిన  విద్యార్థులను గణిత ప్రక్రియల స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 

ఇంగ్లీష్ 

  • ఇచ్చిన ప్రశ్నా పత్రంలోని ఏవైనా ఐదు కాపిటల్  లెటర్స్ ను  చదవమని విద్యార్థిని కోరాలి. 
  • ఐదు  కాపిటల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదవకపోతే ఆ విద్యార్థి ప్రారంభ స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 
  • ఐదు కాపిటల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని ఐదు స్మాల్ లెటర్స్ చదవమని కోరాలి. 
  • ఐదు స్మాల్  లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదవకపోతే ఆ విద్యార్థి కాపిటల్ లెటర్స్ స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి.
  • ఐదు స్మాల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని ఐదు సులభ పదాలు చదవమని కోరాలి. 
  • ఐదు  సులభ పదాలలో నాలుగు పోతే చదవకపొతే ఆ విద్యార్థి స్మాల్ లెటర్స్ స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 
  • ఐదు సులభ పదాలలో నాలుగు పదాలు చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని నాలుగు  సులభ వాక్యాలు చదవమని కోరాలి.  
  • నాలుగు సులభ వాక్యాలలో రెండు వాక్యాలు అర్థవంతంగా చదవని విద్యార్థిని పదాల స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 
  • నాలుగు సులభ వాక్యాలలో రెండు వాక్యాలు అర్థవంతంగా చదవగలిగిన విద్యార్థి వాక్యాలు స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 

ముఖ్య  గమనిక 

  • ఇంగ్లీష్ టూల్ రెండు విభాగాలుగా ఉంటుంది. 1. చదవడం 2. అర్థంచేసుకోవడం 
  • కనుక ఐదు  పదాలలో నాలుగు   పదాలు చదవగలిగిన విద్యార్థిని ఆ పదాలకు అర్ధాలను వారి వాడుక భాషలో చెప్పమని కోరాలి. 
  • అదేవిధంగా నాలుగు వాక్యాలలో రెండు వాక్యాల యొక్క అర్ధాన్ని వారు మాట్లాడే వాడుక భాషలో చెప్పమని కోరాలి. 

రాత పరీక్ష కు సంబంధించి అతి ముఖ్య గమనిక

మౌఖిక పరీక్షలలో నాలుగు, ఐదు  స్థాయిలలో ఉన్న బాలలకు మాత్రమే రాత పరీక్ష నిర్వహించాలి.

ముఖ్య గమనిక:

మౌఖిక పరీక్ష నిర్వహించగానే పిల్లల స్థాయిని రిజిస్టర్ నందు నమోదు చేయాలి. ఆన్లైన్ లో ఎంటర్ చేయాలి.

మౌఖిక పరీక్షలో నాలుగు, ఐదు స్థాయిలలో ఉన్న బాలలకు మాత్రమే రాత పరీక్ష నిర్వహించాలి.

రెండు నుండి ఐదు తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ లలో మాత్రమే రాత పరీక్ష ఉంటుంది.

గణితంలో మాత్రం మౌఖిక పరీక్షలో ఉన్న చతుర్విధ ప్రక్రియలు చేయగలిగిన విద్యార్థులు రాత పరీక్ష రాసినట్లు పరిగణించాలి.

ఆరు నుండి పదవ తరగతుల విద్యార్థులకు తెలుగు, గణితం, ఇంగ్లీష్ లలో రాత పరీక్ష నిర్వహించాలి.

రాత పరీక్షలో మొత్తం నాలుగు స్థాయిలు "అ అన్నీ తప్పు.

  • 1. అసలు ఏమీ రాయని / చేయని వారు
  • 2. ప్రయత్నించారు కానీ
  • 3. రెండు మాత్రమే సరిగా రాశారు.
  • 4. అన్నీ సరిగ్గా రాశారు.

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ పైన పేర్కొన్న అంశాలన్నింటినీ క్షుణ్ణంగా అవగాహన చేసుకుని విద్యార్థులకు ఇప్పటినుండే తగిన తర్ఫీదు ఇవ్వాలి.

తేదీ 22.07.22 న విద్యార్థులందరూ హాజరగుటకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు వారి పరిధి లోని అన్ని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ యాజమాన్యాల పాఠశాలల వారికి ఈ విషయాలు తెలియజేయడంతో పాటు, నిర్వహణ తీరును పర్యవేక్షించవలసిందిగా కోరడమైనది.

ఈనెల 22 నాడు అన్ని తరగతులకు నిర్వహించబోయే బేస్ లైన్ టెస్ట్ శాంపిల్ పేపర్లను విడుదల చేశారు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్షల్లో టెస్ట్ నిర్వహించబడుతుంది.

Click Here To Download format

 Click Here To Blank Proforma

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Instructions for Administering Oral Test in Baseline Test"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0