Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Paytm Phone Pay char6

Paytm ,Phone Pay వాడతున్నారా ? ఈ చార్జీల గురించి మీకు తెలుసా ?

Phone Pay


 Paytm Charges: ఫోన్‌ పే, పేటీఎం వంటి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లోనూ ఈ యాప్స్ ఉండే ఉంటాయి. చాలా మంది పేటీఎం లేదా ఫోన్ పే ద్వారా మొబైల్ రీచార్జ్ చేస్తుంటారు. ఇలా మీరు కూడా రీచార్జ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటే మాత్రం ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఫోన్‌ పే, పేటీఎం వంటివి యూజర్ల నుంచి సర్ చార్జీ/ ప్లాట్‌ఫామ్ ఫీజు/ కన్వీనియన్స్ ఫీజు వంటి వాటిని వసూలు చేస్తున్నాయి. మొబైల్ రీచార్జ్ లేదా బిల్ పేమెంట్స్‌ వంటి వాటిపై ఈ చార్జీలు తీసుకుంటున్నాయి. అందువల్ల మీరు రీచార్జ్ చేసుకునే ముందు ఈ విషయాన్ని గమనించండి.

మీరు ఈ విషయం తెలియకపోవచ్చు. మీరు మొబైల్ రీచార్జ్ లేదంటే బిల్లు చెల్లింపు చేసిన తర్వాత మీరు ఈ విషయాన్ని గమనించకపోవచ్చు. అయితే ఈసారి మాత్రం బిల్లు పేమెంట్ లేదంటే రీచార్జ్ చేసినప్పుడు ఈ విషయాన్ని గమనించండి. అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయి. రూ. 2 వరకు చార్జీలు పడుతున్నాయి.


ఫోన్‌పే ద్వారా మీరు మొబైల్ రీచార్జ్ చేస్తే.. ప్లాట్‌ఫామ్ చార్జీల రూపంలో రూ.1 నుంచి రూ. 2 వరకు చెల్లించుకోవాలి. మీరు ఏ పేమెంట్ మోడ్ ద్వారా అయినా లావాదేవీ నిర్వహించినా ఈ ఫీజు పడుతుంది. అంటే యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, ఫోన్ వాలెట్ ఇలా మీరు ఎలా డబ్బులు చెల్లించినా ఈ ప్లాట్‌ఫామ్ ఫీజు పడుతుంది. రూ. 100 మొబైల్ రీచార్జ్‌ చేసుకుంటే రూ. 101 చెల్లించుకోవాలి.

అదే పేటీఎం విషయానికి వస్తే.. ఏకంగా రూ. 1 నుంచి రూ. 6 వరకు చార్జీలు వసూలు చేస్తోంది. మొబైల్ రీచార్జ్‌పై సర్‌చార్జ్ రూపంలో పేటీఎం ఈ అదనపు చార్జీలు తీసుకుంటోంది. రూ.6 వరకు ఈ భారం పడుతుంది. పేటీఎం వాలెట్, పేటీఎం పోస్ట్‌పెయిడ్, యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ ఇలా మీరు ఏ మార్గంలో రీచార్జ్ చేసుకున్నా ఈ చార్జీలు చెల్లించాల్సిందే. అయితే అందరి యూజర్ల దగ్గరి నుంచి పేటీఎం ఈ చార్జీలను వసూలు చేయడం లేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Paytm Phone Pay char6"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0