Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The correct answer to your question should you buy electric scooters or petrol scooters?

 ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలా లేక పెట్రోల్ స్కూటర్లు కొనాలా మీ ప్రశ్నకు సరైన సమాధానం.

The correct answer to your question should you buy electric scooters or petrol scooters?

ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించడంలో విజయవంతమవుతున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ స్కూటర్లన విక్రయిస్తూ అనతి కాలంలోనే అతిపెద్ద ఈవీ టూవీలర్ కంపెనీగా అవతరించగా, హీరో ఎలక్ట్రిక్, ఒకినావా, ఏథర్ ఎనర్జీ వంటి పలు ఇతర ఈవీ టూవీలర్ కంపెనీలు కూడా బలమైన మార్కెట్ డిమాండ్ ను కలిగి ఉంటునన్నాయి. మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నప్పటికీ, పెట్రోల్ స్కూటర్ల పట్ల ఆదరణ మాత్రం తగ్గడం లేదు.

అయితే, కొత్తగా స్కూటర్ ను కొనాలనుకునే చాలా మంది కస్టమర్లు ఇప్పుడు గందరగోళానికి గురయ్యే అంశం ఏంటంటే, పెట్రోల్ స్కూటర్ ను కొంటే మంచిదా లేక ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొంటే మంచిదా అని. పెట్రోల్ స్కూటర్ల విషయానికి వస్తే, ఈ విభాగంలో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, యమహా ఫాసినో వంటి మోడళ్లు అత్యధిక విక్రయాలను నమోదు చేస్తూ, పెట్రోల్ మోటార్‌సైకిళ్లతో పోటీ పడుతున్నాయి.

పెట్రోల్ స్కూటర్లు చాలా కాలంగా మార్కెట్లో ఉన్నాయి, ఇప్పటి వరకూ వీటి విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురవ్వలేదు. అయితే, ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రం ఇటీవలే ప్రాచుర్యం లోకి వచ్చాయి. అంతేకాకుండా, గత రెండు మూడు నెలల్లో అనేక అగ్ని ప్రమాద ఘటనలు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ప్రజల్లో అనుమానాలు తలెత్తడం ప్రారంభించింది. ఇవి పెట్రోల్ స్కూటర్ల మాదిరిదా నమ్మదగినవి కావు. అయినప్పటికీ, ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇంధన ఖర్చు ఆదా చేయడంలో పెట్రోల్ స్కూటర్ల కంటే ఎన్నో రెట్లు ముందంజలో ఉన్నాయి. మరియు పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది కొంటే బెస్ట్ అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం 

ధర

సాధారణంగా పెట్రోల్ స్కూటర్ల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్లు కాస్తంత ఖరీదైనవి. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీల కారణంగా వీటి ధరలు చాలా వరకూ తగ్గాయి. పెట్రోల్ స్కూటర్లు తక్కువ ధరను కలిగి ఉన్నప్పటికీ, వాటిని నడిపేందుకు ఉపయోగించే ఇంధనం కోసం అయ్యే ఖర్చు ఈవీలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ స్కూటర్ నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఎలక్ట్రిక్ స్కూటర్లలో పెట్రోల్ స్కూటర్ల మాదిరిగా అనేక రకాల విడిభాగాలు ఉండవు.

అయితే, ఎలక్ట్రిక్ స్కూటర్లను పెట్రోల్ స్కూటర్ల మాదిరిగా ఎక్కువ సమయం మరియు ఎక్కువ దూరం పాటు నడపలేం. పెట్రోల్ వాహనాలను నిరంతరాయంగా, ఇంధనాన్ని నింపుకుంటూ నడపొచ్చు. కానీ, ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో అలా కాదు, వీటిని ఎక్కువ సమయం నడిపేతే మోటార్ లేదా బ్యాటరీ వేడెక్కి మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. అలాగే, ఇవి బ్యాటరీ చార్జింగ్ ఉన్నంత సేపు మాత్రమే పనిచేస్తాయి మరియు తిరిగి బ్యాటరీ చార్జ్ చేసుకోవడానికి కొన్ని గంటల సమయం పడుతుంది.

పెట్రోల్ వాహనాలను రీఫిల్ చేసుకోవడానికి కొన్ని నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. సాధారణంగా ఓ పెట్రోల్ స్కూటర్ సగటు జీవితకాలం 8-10 సంవత్సరాల పాటు ఉంటే, ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సగటు జీవితకాలం 3-4 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలలో బ్యాటరీని మార్చాల్సి వస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యంత ఖరీదైన భాగం దాని బ్యాటరీనే, ఇది మొత్తం స్కూటర్ ఖరీదుల దాదాపు 70 శాతం వరకూ ఉంటుంది. అందుకే, ఈవీలలో బ్యాటరీని మార్చడం చాలా ఖరీదైనదిగా ఉంటుంది. పెట్రోల్ వాహనాల విషయంలో ఈ సమస్య ఉండదు.


పనితీరు

అభివృద్ధి చెందిన ఈవీ టెక్నాలజీ కారణంగా, ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు పనితీరు విషయంలో పెట్రోల్ స్కూటర్లను అధిగమిస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్‌లు నేరుగా బ్యాటరీ నుండి పవర్‌ను ఎక్కడా వృధా చేయకుండా ఎలక్ట్రిక్ మోటార్ కు పంపిణీ చేస్తాయి కాబట్టి, ఇవి పెట్రోల్ స్కూటర్ల కన్నా ఎక్కువ పవర్ మరియు టార్క్‌ని ఉత్పత్తి చేయగలవు. ఫలితంగా, రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాలలో వీటిని నడపడం సులభంగా అనిపిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టార్క్ పెట్రోల్ స్కూటర్ కంటే రెండింతలు ఎక్కువగా ఉంటుంది, దీని కారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ రోడ్డుపై త్వరగా వేగవంతమవుతుంది.

ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో రేంజ్ అని పిలుస్తాము, అదే పెట్రోల్ వాహనాల విషయంలో అయితే దీనిని మైలేజ్ అని పిలుస్తాము. పేరు ఏదైనప్పటికీ, ఈ విషయంలో మాత్రం ఎలక్ట్రిక్ వాహనాల కన్నా పెట్రోల్ వాహనాలు ఎన్నో రెట్లు ముందంజలో ఉంటాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసే కంపెనీలు వాటి బ్యాటరీ రేంజ్ విషయంలో ఎక్కువగానే క్లెయిమ్ చేస్తున్నప్పటికీ, వాస్తవ వినియోగంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ చాలా తక్కువగానే ఉంటోంది. అదే, పెట్రోల్ స్కూటర్‌లో అయితే ఇంధనం నింపిన తర్వాత, దానిని వందల కిలోమీటర్ల దూరం వరకూ నిరంతరాయంగా నడపవచ్చు.

నిత్యం కొద్ది దూరం మాత్రమే ప్రయాణించే వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అనుకూలంగా ఉంటాయి. అలా కాకుండా, వృత్తిరీత్యా రోజూ వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారికి లేదా టూవీలర్ పై లాంగ్ రైడ్ చేయాలనుకునే వారికి పెట్రోల్ స్కూటర్లు మాత్రమే అనువుగా ఉంటాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడు వాటిని తిరిగి ఛార్జ్ చేయడానికి గంటల సమయం పడుతుంది. ఒకవేళ ఫాస్ట్ ఛార్జర్ అందుబాటులో ఉన్నా, దాని ఈవీని ఛార్జ్ చేయడానికి ఒకటి నుండి రెండు గంటల సమయం ఖచ్చితంగా పడుతుంది. అంతే కాకుండా, అన్ని చోట్లా పెట్రోల్ బంకులు ఉన్నట్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉండవు.

మరి ఈ రెండింటిలో ఏ స్కూటర్ కొనాలి?

పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్ల వలన కలిగే లాభాలు మరియు నష్టాలు తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఈ రెండింటిలో ఏ స్కూటర్ కొనాలి అనేది అతిపెద్ద ప్రశ్న. దీనికి సులభమైన మరియు సరైన సమాధానం ఏంటంటే, మీరు స్కూటర్‌ను ఎలా ఉపయోగించాలనుకుంటున్నారనేదే. ఒకవేళ మీరు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉండి, ప్రతిరోజూ కొంత దూరం మాత్రమే స్కూటర్‌ను ఉపయోగించాలనుకుంటే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్తమంగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఈవీ చార్జింగ్ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది కాబట్టి మీరు బ్యాటరీ ఖాలీ అవుతుందనే విషయం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఇంటిలో లేదా కార్యాలయంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పార్క్ చేసే సదుపాయం మరియు దానిని ఛార్జింగ్ చేసే సౌలభ్యం ఉంటే, మీరు ఎంచక్కా ఎలాంటి సందేహం లేకుండా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనేయొచ్చు.

అలా కాకుండా, మీరు వ్యాపారం కోసం లేదా మరేదైనా ప్రయోజనం కోసం స్కూటర్‌ని ఉపయోగించాలనుకుంటే లేదా టూవీలర్ పై సగటున రోజుకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారు అయితే, మీకు పెట్రోల్ స్కూటర్ ఉత్తమమైనది. నేటి ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్లు పూర్తి చార్జ్ పై 80-120 కిలోమీటర్ల రేంజ్ నుఇస్తాయని కంపెనీలు చెప్పినప్పటికీ, వాస్తవ పరిస్థితులలో ఇవి అంత అధిక రేంజ్ ను అందించడంలో విఫలమవుతున్నాయి. వాస్తవానికి, పెట్రోల్ స్కూటర్లు ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే ఎక్కువ మన్నికైనవి మరియు నమ్మదగినవి. ప్రస్తుత వర్షాకాలంలో కూడా ఇవి పాడయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. మరి మీరు ఏ ప్రయోజనం కోసం స్కూటర్ ను వెతుకుతున్నారు..?

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The correct answer to your question should you buy electric scooters or petrol scooters?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0