Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APPSC Exam Schedule Released

APPSC పరీక్షల షెడ్యూల్‌ విడుదల

APPSC Exam Schedule Released

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) వివిధ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్లకు పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. ఆన్లైన్లో జరగనును పరీక్షలకు సంబంధించిన పత్రికా ప్రకటనను కమిషన్‌ కార్యదర్శి హెచ్‌ అరుణ్‌కుమార్‌ విడుదల చేశారు. ఫిషరీస్‌ డెవలప్‌మెంటు ఆఫీసర్‌ పోస్టులకు, దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనరు పోస్టులు, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టులకు అక్టోబరు 19న ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా పరీక్షలు జరగనున్నాయి. సెరీకల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులకు, హర్టీకల్చర్‌ అసిస్టెంట్‌ డైరెక్టరు పోస్టులకు అక్టోబరు 20న, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులకు జరగనున్నాయి. పోలీస్‌ సర్వీస్‌లోని టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ సర్వీస్‌ అసిస్టెంట్‌ డైరెక్టరు పోస్టులకు అక్టోబరు 21న జరగనున్నాయి. డివిజనల్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ పోస్టులకు నవంబరు 3న పరీక్ష ఉంటుంది. సమచారశాఖలోని అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌, ఎపి ఎకనామిక్స్‌, స్టాటికల్‌ సబ్‌ సర్వీస్‌లోనిఅసిస్టెంట్‌ స్టాటికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు నవంబరు 4న పరీక్ష ఉంటుంది. హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-4 పోస్టులు, అసెంబ్లీ తెలుగు రిపోర్టర్‌ పోస్టులకు నవంబరు 5న పరీక్ష జరగనుంది. సమాచారశాఖలోని డిపిఆర్‌ఒ పోస్టులకున వంబరు 6న, స్త్రీ, శిశుసంక్షేమలోని ఇఒ గ్రేడ్‌-1 పోస్టులకు7న పరీక్షలు నిర్వహించనుంది. అటవీశాఖ అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ పోస్టులకు నవంబరు 9, 10, 11 తేదీల్లో పరీక్ష జరగనుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APPSC Exam Schedule Released"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0