Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

శ్రీ పోలేరమ్మ దేవి , అభయ ఆంజనేయ స్వామి మరియు నామ , శంఖు చక్రముల ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వాన పత్రిక.

 శ్రీరస్తు   శుభమస్తు     అవిఘ్నమస్తు

శ్రీ పోలేరమ్మ తల్లి, అభయ ఆంజనేయ స్వామి మరియు నామ , శంఖు చక్రముల ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వాన పత్రిక.

శ్రీ మహాగణాధిపతయేనమః ఓం నమశ్శివాయనమః శ్రీ మాత్రేనమః

శ్లో॥ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ॥

నాగన్నపాలెం గ్రామము, మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా.

శ్రీ పోలేరమ్మ దేవి , అభయ ఆంజనేయ స్వామి నామ , శంఖు చక్రముల ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వాన పత్రిక

శ్లో॥ మాతా మరకత శ్యామ మాతంగి మధుశ్యాలిని కుర్వాత కటాక్షం కళ్యాణి కరంబ వనవాసిని॥

 ఆగస్టు : 18-08-2022 గురువారం  నుండి   20-08-2022  శనివారం వరకు

ప్రియమైన భగవత్ బంధువులారా...

మానవుల జీవితంలో జాతకరీత్యా గానీ, గోచార రిత్యా గానీ గ్రహములు చెడు స్థానములలో ఉన్నప్పుడు అనేక కష్టనష్టములు కలుగుచుండును. ఆ కష్టముల, సమస్యల నివృత్తి కొరకై కొన్ని సులభమైన, ఆచరింపగలిగిన నివారణోపాయములను మన మహర్షులు మనకు సూచించారు. వాటిలో కొన్ని... దేవాలయము సందర్శనము, అర్చన, అభిషేకము, దానములు, గోసేవ మొదలైనవి సూచించారు.

ఈ మహాయజ్ఞములో ప్రతి భక్తుడు పాల్గొని మీకు తోచిన ధన, వస్తు రూపేణా మీవంతు సహాయ, సహకారములను విరాళముల రూపంలో అందించి ఆయా దేవీ దేవతల పరిపూర్ణ అనుఘ్రహ, ఆశీస్సులను పొంది... సుఖవంతమైన సౌఖ్యవంతమైన జీవనమును పొందగలరు.

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సర శ్రావణ మాస బహుళ నవమిలు శనివారం తేది : 20-08-2022న ఉదయం గం ॥ 8-15ని ॥ నుంచి గం ॥ 9-15 ని॥లలోపు గ్రామ ప్రజల సహకారంతో పునఃనిర్మిచబడిన దివ్య ఆలయములో శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహము పోతురాజు శిఖర మరియు అభయ ఆంజనేయస్వామి , నామ శంఖు చక్రయములు ప్రతిష్ఠా కార్యక్రమము త్రయాహ్నిక దీక్షతో అనగా తేది . 18-08-2022 గురువారం నుండి తేది . 20-08-2022 శనివారం వరకు జరుగును 

కావున యావన్మంది భక్త మహాశయులు శ్రీ స్వామి అమ్మవార్ల కార్యఖ్రమాలలో పాల్గొని తీర్ధ ప్రసాదములు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కావల్సిందిగా కోరుచున్నాము.

ప్రతిష్టా ప్రధాన ఆచార్యులు 

వైఖానస ఆగమప్రవర - ఆగమ ఎగ్జామినర్                                       శ్రీమాన్ దీవి వేంకట శేషా చార్యులు గారు                                  నరసాయపాలెం గ్రామం .

కార్యక్రమ వివరములు

18-08-2022 గురువారం 

 ఉదయం గం  10-50 ని॥లకు మంగళవాయిద్యములు , వేద పారాయణం , విష్వక్సేన ఆరాధన , పుణ్యాహవాచన , పంచగవ్యప్రాసన , యాగశాల వాస్తు శుద్ధి , అకల్మష హోమము , తీర్ధ ప్రసాద వినియోగము జరుగును.

 రాత్రి గం 6-30 లకు మంగళవాయిద్యములు , ప్రార్ధన సూక్తుయు . విష్వక్సేన ఆరాధన , పుణ్యాహవాచన , అజస్రదీపారాధన , ఆచార్య , యజమాన దీక్షాధారణ , మేదిని పూజ , మృత్సంగ్రహణము , అంకురారోపణ , అగ్నిప్రతిష్టాపన , ఉత్తహోమములు పూర్వ ఆలయంలోని దేవతల కళ అపకర్షణ , హారతి తీర్ధ ప్రసాద వినియోగము జరుగును.

19-08-2022 శుక్రవారం 

 ఉదయం గం  7-30 ని॥లకు మంగళవాయిద్యములు , వేదపారాయణ , విష్వక్సేన ఆరాధన , పుణ్యాహవాచన , ఉత్త హోమములు , నయనోన్మీలనం , పంచగవ్వాధివాసము , చతుర్ధశ కలశ స్నాపన , క్షీరాధివాసము , జలాధివాసము , అదివాస హోమములు , విశేష హోమములు , హారతి తీర్ధ ప్రసాద వినియోగము జరుగును

సాయంత్రం గం 3-00 లకు . 

అమ్మవారు స్వామివార్ల గ్రామోత్సవము , ప్రభూత బలి రాత్రి 7 గంటలకు మంగళ వాయిద్యములు , వేదపారాయణం , విష్వక్సేనప్రార్ధన , నవగ్రహ ఆరాధన , ప్రధాన , శాంతికుంభ స్థాపన , నవగ్రహ మఘం , మూర్తి హోమము , మహాశాంతి హోమము , శయనాధివాసము , సర్వదేవార్చన , పారమాత్మిక ప్రవచనములు , హారతి తీర్ధ ప్రసాద వినియోగము జరుగును.

20-08-2022 శనివారం

 ఉదయం గం  6-00 లకు 

మంగళ వాయిద్యములు , వేద పారాయణం , విష్వక్సేన ఆరాధన , పుణ్యాహవాచనం , ఉత్తహోమములు , కుంభపూజ , స్థాపిత పీఠములో రత్న , ధాతున్యాసము , శిఖరస్థాపన , అమ్మవారి , స్వామివార్ల బింబముల స్థాపన వాస్తుశుద్ధి . అంత హోమము , పూర్ణాహుతి , అవాహన , కుంభాభిషేకము , ఉత్తదర్శనములు , భక్తుల దర్శనము , ఆశీర్వచనము జరుగును.

మధ్యాహ్నం గం.12-00 లకు  అన్న సంతర్పణ జరుగును.

కావున ఈ కార్యక్రమములో భక్తులందరూ విరివిగా పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కొరడమైనది.

అందరూ ఆహ్వానితులే 

                                     ఇట్లు

నాగన్నపాలెం గ్రామ భక్త ప్రజానీకం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "శ్రీ పోలేరమ్మ దేవి , అభయ ఆంజనేయ స్వామి మరియు నామ , శంఖు చక్రముల ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వాన పత్రిక."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0