Study abroad.. measure there!
విదేశీ చదువు.. అక్కడే కొలువు!
- నిబంధనలను సడలించిన పలు దేశాలు
- పోస్ట్ స్టడీ వర్క్ వీసాల గడువు పొడిగింపు.. బ్రిటన్‌లో రెండేండ్లు, ఆస్ట్రేలియాలో ఐదేండ్లు
విదేశాల్లో విద్యనభ్యసించే భారతీయుల్లో ఎక్కువ మంది ఆలోచించేది అక్కడ ఉద్యోగాన్ని సంపాదించడం గురించే. చదువుతున్నప్పుడు, చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగాలు చేసుకోవాలన్న ఆకాంక్షతోనే చాలా మంది విదేశాల బాటపడుతుంటారు. అలాంటివారికి పలు దేశాలు పోస్ట్ స్టడీ వర్క్ వీసాలను మంజూరు చేస్తున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇటీవల పలు దేశాలు ఈ వీసా నిబంధనలను సడలించాయి. బ్రిటన్ గతేడాది పోస్ట్ స్టడీ వీసా గడువును రెండేండ్లకు పొడిగించగా.. ఆస్ట్రేలియాలో ఐదేండ్లకు పొడిగించారు. మరికొన్ని దేశాల్లో పోస్ట్ స్టడీ వర్క్ వీసాల వివరాలు ఇలా ఉన్నాయి..
స్వీడన్‌లో ఏడాది పాటు ఉద్యోగాలు
చదువుకు, నివాసానికి అత్యంత అనుకూలమైన దేశాల్లో స్వీడన్ ఒకటి. ఉన్నత ర్యాంకింగ్‌లు గల ఎన్నో విశ్వవిద్యాలయాలు అక్కడ ఉన్నాయి. ఇటీవల అంతర్జాతీయ విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తున్న దేశాల జాబితాలో స్వీడన్ కూడా ఉన్నది. ఆ దేశ వీసా దొరికితే చదువుతోపాటు ఉద్యోగం చేసుకోవచ్చు. ఎన్ని గంటలు పనిచేయాలన్న దానిపై స్వీడన్‌లో ఎలాంటి పరిమితులు లేవు. చదువుతున్నవారు పార్ట్‌టైమ్ జాబ్స్, ఇంటర్న్‌షిప్స్ రూపంలో కొలువులు సంపాదించుకోవచ్చు. చదువు పూర్తయిన తర్వాత అనుమతి పొంది అదనంగా ఏడాది పాటు స్వీడన్‌లో ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో విద్య కోసం అత్యధికులు క్యూ కడుతున్న దేశం బ్రిటన్ (యూకే). ప్రపంచంలోని పలు అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు అక్కడ ఉన్నాయి. చదువుతూనే పనిచేసుకొనేవారికి బ్రిటన్‌లో నిబంధనలు కాస్త కఠినంగానే ఉంటాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ), యూరోపియన్ ఎకనమిక్ ఏరియా (ఈఈఏ), స్విట్జర్లాండ్ పౌరులు వారానికి ఎన్ని గంటలైనా పనిచేసుకోవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితి లేదు. దరఖాస్తు చేయాల్సి అవసరం కూడా లేదు. కానీ, ఈయూ వెలుపలి దేశాలవారికి మాత్రం టైర్-4 (జనరల్) స్టూడెంట్ వీసా అవసరం. డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారు వారానికి 20 గంటలు పనిచేసుకోవచ్చు. చదువు పూర్తయినవారికి రెండేండ్లపాటు పోస్ట్ స్టడీ వర్క్ వీసాను ఇస్తున్నారు. ఈ గడువు ముగిసేలోగా ఏదైనా కంపెనీలో శాశ్వత ఉద్యోగం పొందితే లాంగ్ టర్మ్ వర్క్ వీసా ఇవ్వడంతోపాటు అక్కడే శాశ్వతంగా నివసించేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
ఆస్ట్రేలియాలో కుటుంబ సభ్యులకూ అవకాశం
స్టూడెంట్ ఫ్రెండ్లీ విధానాలను అనుసరిస్తున్న దేశాల్లో ఆస్త్రేలియా ఒకటి. అక్కడ చదువుకొనేందుకు స్టూడెంట్ వీసా పొందిన విద్యార్థులతోపాటు వారి కుటుంబ సభ్యులు (వీసా పర్మిట్ పొందినవారు) సైతం ఉద్యోగాలు చేసుకోవచ్చు. పనిదినాల్లో వారానికి 20 గంటలు, సెలవుల్లో పూర్తి సమయం పనిచేసుకోవచ్చు. పీజీ, పరిశోధక విద్యార్థులకు పూర్తి సమయంపాటు ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇవే హక్కులు వారి కుటుంబ సభ్యులకూ వర్తిస్తాయి. కరోనా సంక్షోభానికి ముందు కేవలం రెండేండ్లకే పరిమితమైన పోస్ట్ వర్క్ వీసా గడువును ఇటీవల 3 నుంచి 5 ఏండ్ల వరకు పెంచారు. ప్రధాన నగరాల్లో మూడేండ్లు, రీజినల్ ఏరియాల్లో నాలుగేండ్లు, బ్యాక్‌వర్డ్ ఏరియాల్లో ఐదేండ్ల కాలపరిమితితో పోస్ట్ స్టడీ వర్క్ వీసాలు ఇస్తున్నారు.
ఫ్రాన్స్‌లో వారానికి 19 గంటలే
అంతర్జాతీయ విద్యార్థులు చదువుకొంటూనే ఉద్యోగాలు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్న దేశాల్లో ఫ్రాన్స్ ముందు వరుసలో ఉన్నది. విదేశీ విద్యార్థులంతా అక్కడ పార్ట్ టైం, ఫుల్‌టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇలా సంవత్సరంలో 60% లేదా వారానికి 19 గంటలపాటు పనిచేసుకోవచ్చు. కానీ, అక్కడ పనిచేసేందుకు డిగ్రీ విద్యార్థులను అనుమతించరు. పీజీ పూర్తిచేసిన విద్యార్థులకు మాత్రం 24 నెలల గడువుతో పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లు ఇస్తున్నారు.
ఫ్రాన్స్‌లో వారానికి 19 గంటలే
అంతర్జాతీయ విద్యార్థులు చదువుకొంటూనే ఉద్యోగాలు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్న దేశాల్లో ఫ్రాన్స్ ముందు వరుసలో ఉన్నది. విదేశీ విద్యార్థులంతా అక్కడ పార్ట్ టైం, ఫుల్‌టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇలా సంవత్సరంలో 60% లేదా వారానికి 19 గంటలపాటు పనిచేసుకోవచ్చు. కానీ, అక్కడ పనిచేసేందుకు డిగ్రీ విద్యార్థులను అనుమతించరు. పీజీ పూర్తిచేసిన విద్యార్థులకు మాత్రం 24 నెలల గడువుతో పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లు ఇస్తున్నారు.
న్యూజిలాండ్‌లో పీహెచ్‌డీ విద్యార్థులకు నో లిమిట్స్
అత్యున్నత జీవన ప్రమాణాలు గల దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. ఆ దేశం నుంచి స్టూడెంట్ వీసా పొందడం చాలా సులభం. రెండేండ్ల స్టూడెంట్ వీసా గలవారు వారానికి 20 గంటలు, సెలవు రోజుల్లో పూర్తి సమయం ఉద్యోగాలు చేసుకోవచ్చు. పీహెచ్‌డీ విద్యార్థులైతే ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తి సమయం ఉద్యోగాలు చేసుకొంటూనే చదువుకోవచ్చు. చదువు పూర్తయిన తర్వాత వర్క్ వీసా కోసం దరఖాస్తు చేస్తే.. మూడేండ్ల వరకు అనుమతిస్తారు.
కెనడాలో ఫుల్‌టైం జాబ్స్
చదువుల తర్వాత స్థిరపడాలనుకునే వారికి కెనడాలో పుష్కలమైన అవకాశాలున్నాయి. అలాంటి వారికి కెనడా ఎర్ర తివాచీ పరుస్తున్నది. అంతర్జాతీయ విద్యార్థులు పూర్తి సమయంపాటు ఆన్ క్యాంపస్ ఉద్యోగాలు చేయవచ్చు. కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులు వర్క్ పర్మిట్ లేకుండానే వారానికి 20 గంటలు ఉద్యోగం చేసుకోవచ్చు. కనిష్ఠంగా 8 మాసాల నుంచి గరిష్ఠంగా మూడేండ్ల వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ వీసాలను మంజూరు చేస్తారు.
0 Response to "Study abroad.. measure there!"
Post a Comment