Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Digital Driving License: Download able in Minutes.

 డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్: నిమిషాల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Digital Driving License: Download able in Minutes.

డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇక మనం ఎక్కడికి వెళ్ళిన కూడా మన వెంట ఉండాల్సిందే. ఒక్కోసారి డ్రైవింగ్ లైసెన్స్ ఇంట్లో మర్చిపోయి అనేక రకాల నానా ఇబ్బందులు పడుతూ ఉంటాము.అయితే ఇక మీదట అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ కాపీ ఫోన్లో పెట్టుకోవడం చాలా సురక్షితం. పైగా ఇది సౌకర్యం కూడా. అయితే ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ను ఫొటో తీసి ఫోన్లో పెట్టుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారా? మీరు అలా కూడా చేసుకోవచ్చు.కాకపోతే అది కేవలం ఫొటో కాపీ మాత్రమే. అదే డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అసలైన కాపీ అనేది అవుతుంది. ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్ లాగానే ఈ-డ్రైవింగ్ లైసెన్స్ కూడా చెల్లుబాటు అవుతుంది. ఇక ఆన్ లైన్ లో డిజిటల్ లైనెన్స్ ను పరివాహన్ సేవా వెబ్ సైట్ లేదా డిజీలాకర్ వెబ్ సైట్ లేదా డిజీలాకర్ మొబైల్ యాప్ ను ఉపయోగించుకుని ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ముందుగా మీరు 'పరివాహన్ సేవా' (https://parivahan.gov.in/) వెబ్ పేజీకి వెళ్లాలి.తరువాత ఆన్ లైన్ సర్వీసెస్ సెక్షన్ లో 'డ్రైవర్స్ లైసెన్స్ రిలైటెడ్ సర్వీసెస్' ఆప్షన్ ని మీరు ఎంపిక చేసుకోవాలి. తరువాత రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. డ్రైవింగ్ లైనెస్స్ సెక్షన్ లో 'ప్రింట్ డ్రైవింగ్ లైసెన్స్' ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.

ఆ తరువాత దరఖాస్తును పూర్తి చేయాలి. దీన్ని ప్రింట్ తీసుకోవడం లేదంటే పీడీఎఫ్ డాక్యు మెంట్ రూపంలో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా డీజీలాకర్ పోర్టల్ పై (https://digilocker.gov.in/) లాగిన్ అవ్వాలి. 'సెర్చ్ డాక్యుమెంట్స్'ను మీరు క్లిక్ చేయాలి.ఆ పేజీ పై భాగంలో ఎడమ చేతివైపు ఇది ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాలి. 'మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్' పైన ట్యాప్ చేయాలి.ఇక అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ నమోదు చేసి..'గెట్ ద డాక్యుమెంట్' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. డ్రైవర్స్ లైసెన్స్ డౌన్ లోడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ పై మీరు ట్యాప్ చేయాలి. ఇక ఫోన్లో డిజీలాకర్ యాప్ ను మీరు తెరవాలి.'డాక్యుమెంట్స్ యూ మైట్ నీడ్' సెక్షన్ పైన క్లిక్ చేయాలి. అలాగే అక్కడ 'డ్రైవింగ్ లైసెన్స్' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ని మీరు నమోదు చేసి.. గెట్ ద డాక్యుమెంట్ పై మీరు క్లిక్ చేయాలి. డ్రైవర్స్ లైసెన్స్ డౌన్ లోడ్ ఆప్షన్ కూడామీకు కనిపిస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Digital Driving License: Download able in Minutes."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0