Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Fixed Deposits

Fixed Deposits : ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ !

Fixed Deposits

 దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. పెంచిన వడ్డీ రేట్లు నేటి (ఆగష్టు 13, 2022) నుంచి అమలవనున్నాయి.

ఎస్‌బీఐ ప్రస్తుతం 7 రోజుల నుంచి మొదలుకుని 10 ఏళ్లు వరకు వివిధ కాలపరిమితుల గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.90 శాతం నుంచి 5.65 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు మరో 0.50 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది.

ఎస్‌బీఐ తాజా వడ్డీ రేట్లు.

  • 7 రోజుల నుంచి 45 రోజుల వరకు 2.90%
  • 46 రోజుల నుంచి 179 రోజుల వరకు 3.90%
  • 180 రోజుల నుంచి 210 రోజుల వరకు 4.55% (ఇంతకు ముందు ఇది 4.40 శాతంగా ఉండేది)
  • 211 రోజుల నుంచి ఏడాది లోపు 4.60%
  • ఏడాది నుంచి రెండేళ్ల లోపు 5.45% (ఇంతకు ముందు ఇది 5.30 శాతంగా ఉండేది)
  • రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు 5.50% ( ఇంతకు ముందు ఇది 5.35 శాతంగా ఉండేది)
  • మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు 5.60% ( ఇంతకు ముందు ఇది 5.45 శాతంగా ఉండేది)
  • ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు 5.65% ( ఇంతకు ముందు ఇది 5.50 శాతంగా ఉండేది)

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 
ప్రభుత్వ రంగ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఆగష్టు 10, 2022 నుంచి వర్తిస్తాయి. బ్యాంకు వివిధ కాలవ్యవధి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లను 2.75 శాతం నుంచి 5.60 శాతం వడ్డీ రేటుతో అందిస్తుంది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఎఫ్‌డీ వడ్డీ రేట్లు

  • 7 రోజుల నుంచి 14 రోజులు గల డిపాజిట్లపై 2.75%
  • 15 రోజుల నుంచి 30 రోజుల గల డిపాజిట్లపై 2.90%
  • 31 రోజుల నుంచి 45 రోజుల గల డిపాజిట్లపై 3.00%
  • 46 రోజుల నుంచి 90 రోజుల గల డిపాజిట్లపై 3.35%
  • 91 రోజుల నుంచి 179 రోజుల గల డిపాజిట్లపై 3.85%
  • 180 రోజుల నుంచి 364 రోజుల గల డిపాజిట్లపై 4.50% ( ఇంతకు ముందు ఇది 4.40 శాతంగా ఉండేది.)
  • ఏడాది నుంచి రెండేళ్ల లోపు డిపాజిట్లపై 5.35% (ఇంతకు ముందు ఇది 5.25 శాతంగా ఉండేది)
  • రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు డిపాజిట్లపై 5.40% (ఇంతకు ముందు ఇది 5.30 శాతంగా ఉండేది)
  • మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు డిపాజిట్లపై 5.40% (ఇంతకు ముందు ఇది 5.35 శాతంగా ఉండేది)
  • ఐదేళ్ల నుంచి 10 లోపు డిపాజిట్లపై 5.60%
  • 555 రోజుల ఎఫ్‌డీ డిపాజిట్లపై బ్యాంక్ 5.55% వడ్డీని ఆఫర్ చేస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Fixed Deposits"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0