Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to Do Surya Namasker .

 సూర్య నమస్కారాలు  చేయడం వల్ల ఇన్ని లాభాలు 

How to Do Surya Namasker .

యోగా అనేది భారతీయ పురాతన సంస్కృతిలో భాగంగా ఉంటూ, మీ మనస్సును - శరీరాన్ని ఆహ్లాదపరిచే అభ్యాసంగా ఉంటూ, మిమ్మల్ని చైతన్యవంతుల్ని చేస్తూ, శరీర బరువును తగ్గించడంలో సహాయం చేస్తూ, భౌతిక గాయాలను నయం చేస్తూ, మానసికంగా మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతూ, మీలో ఉన్న ఒత్తిడిని & ఆందోళనలను తగ్గించడం వంటి అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంటుంది. 

రోజు ఉదయం ప్రసరించే సూర్య కిరణాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను తీరుస్తాయి.ఉదయాన్నే సూర్య కిరణాలు మన శరీరం మీద పడితే చాలా ఉత్సాహంగాను,ఉల్లాసంగాను ఉంటుంది.

అంతేకాక ఉదయం పూట సూర్య కిరణాల్లో విటమిన్ D, A లు సమృద్ధిగా ఉండుట వలన చర్మ సమస్యలు రావు.అలాగే విటమిన్ D ఆహార పదార్ధాలలో కన్నా సూర్య కిరణాల్లో ఎక్కువగా లభిస్తుంది. అలాగే ఆయుర్వేదంలో సూర్య కిరణాలను ఉపయోగించుకొని వైద్యం చేస్తారు.

సూర్యోదయం సమయంలో చేసే నదీ స్నానాలకు కూడా ఒక ప్రత్యేకమైన విశేషమైన స్థానం ఉంది.ఈ సమయంలో చేసే స్నానం మంచిదని మన పెద్దవారు చెప్పుతూ ఉంటారు.ఆ సమయంలో పడే కిరణాలు శరీరంలోని అనేక రుగ్మతలను నయం చేస్తుంది.

అందుకే ప్రకృతి చికిత్సలో తప్పనిసరిగా ఉదయం ఎండలో కొంతసేపు నిలబెడతారు.

సూర్య కిరణాలు శరీరంపై పడటం వలన చర్మ,నరాల,గుండెకు సంబందించిన వ్యాధులు తగ్గుతాయి.

అలాగే ఉదయం సమయంలో రాగి పాత్రలోని నీటితో తర్పణం వదలటం వలన రాగి పాత్రలోని నీటి గుండా కిరణాలు ప్రసరించి మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది.సూర్య నమస్కారం చేసే సమయంలో ఓంః గ్లీమ్ సూర్య ఆదిత్యాయః,ఓంః సూర్య‌య న‌మః అనే శ్లోకాల‌ను ప‌ఠించ‌డం మంచిది.

ప్రార్థన ఆసనము

How to Do Surya Namasker .

యోగా మెట్ కి చివరన నిలబడి, పాదాలు రెండు దగ్గరగా ఉంచి మీ బరువును రెండు పాదాల మీద సమానంగా ఉంచండి. ఛాతీని ముందుకు చాచి భుజాలను విశ్రాంతిగా ఉంచండి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులను ప్రక్కలనుండి ఎత్తి, శ్వాస వదులుతూ రెండు చేతులను కలుపుతూ ఛాతి ముందుకు తీసుకురండి నమస్కారముద్రలో.

హస్త ఉత్తానాసనము (చేతులు పైకి ఎత్తే ముద్ర)

How to Do Surya Namasker .

శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకి ఎత్తి వెనుకకు తీసుకురండి. భుజాలను చెవులకు దగ్గరగా తీసుకురండి. ఈ ఆసనంలో నీ మడమలనుండి చేతి వేళ్ళవరకు మొత్తం శరీరాన్ని సాగతీయాలి. ఈ యోగాసనాన్ని లోతుగా ఎలా చేయాలి? తుంటి భాగాన్ని కొంచము ముందుకు తోయాలి.

హస్తపాదాసనము (చేతి నుండి పాదాలవరకు):

How to Do Surya Namasker .

శ్వాస వదిలి, వెన్నుపూసనునిటారుగా ఉంచి నడుము నుండి ముందుకు వంగాలి. శ్వాసను పూర్తిగా వదిలేసి మీ చేతులను పాదాల ప్రక్కకు భూమి మీదకు తీసుకురండి. ఈ యోగాసనాన్ని లోతుగా ఎలా చేయాలి? అవసరమైతే మోకాళ్లను వంచచ్చు మీ చేతులను క్రిందకు తీసుకు రావడానికి. ఇప్పుడు చిన్నపాటి ప్రయత్నముతో మోకాళ్ళను నిటారుగా చేయండి. ఈ ఆసనం పూర్తయ్యేవరకు చేతులనుఒక్కచోటే కదపకుండా ఉంచడం మంచిది.

అశ్వసంచలనాసనము:శ్వాస తీసుకుంటూ కుడి కాలుని వెనకకు తోయండి. ఎంతవరకు సాగాతీయగలిగితే అంతవరకు కుడి మోకాలు భూమికి దగ్గరగా ఉంచి పైకి చూడండి. ఈ యోగాసనాన్ని లోతుగా ఎలా చేయాలి? గమనించవలసిన విషయము ఎడమ పాదము సరిగ్గా రెండు అరచేతులకు మధ్యలో ఉండాలి.

దండాసనము (కర్ర లాగ):

How to Do Surya Namasker .

శ్వాస తీసుకుంటూ ఎడమ కాలుని కూడా వెనుకకు చాచి మొత్తం శరీరాన్ని భూమికి సమాంతరంగా ఒక లైనులా ఉంచండి.

అష్టాంగాసనము( 8 శరీర భాగాలను తగిలించి నమస్కారం)

How to Do Surya Namasker .

నెమ్మదిగా మోకాళ్ళను భూమి మీదకు తీసుకువచ్చి శ్వాసను వదలండి. మీ సిరుదులను కొంచెము వెనుకకు త్రోసి, ముందుకు వచ్చి, మీ చాతిని, గడ్డాన్ని భూమి మీద ఉంచండి. తుంటే భాగాన్ని కొంచెము పైకి లేపండి. (రెండు చేతులు, రెండు పాదాలు, రెడ్ను మోకాళ్ళు, ఛాతి, మరియు గడ్డము. ఈ ఎనిమిది శరీర భాగాలు భూమిని తాకుతాయి)

భుజంగాసనము (త్రాచుపాము):

How to Do Surya Namasker .


ముందుకు సాగి చాతిని పైకి లేపి, త్రాచుపాము ఆకారంలోకి తీసుకురండి. ఈ ఆకారంలో మీ మోచేతులను వంచచ్చు. భుజాలు మాత్రము చెవులకు దూరంగా ఉంచాలి, పైకి చూడాలి. ఈ యోగాసనాన్ని లోతుగా ఎలా చేయాలి? శ్వాస తీసుకుంటూ కొద్దిపాటి ప్రయత్నముతో ముందుకు తోయాలి, శ్వాస వదులుతూ కొద్దిపాటి ప్రయత్నముతో నాభి భాగాన్ని నేలకు తగిలించాలి. కాలివేళ్ళు భూమి మీదకు వంగి ఉండాలి. గమనించాలి ఇక్కడ ఎంత మీ శరీరం సహకరిస్తుందో అంతే సాగదీయాలి, బలవంతంగా చేయకూడదు.

పర్వతాసనము:

How to Do Surya Namasker .

శ్వాసను వదులుతూ పిరుదులను, తుంటి ఎముకలను పైకి లేపాలి చాతీ కిందకు ‘V’ (^) ఆకారములో. ఈ యోగాసనాన్ని లోతుగా ఎలా చేయాలి? వీలైతే ప్రయత్నముతో మదమలను భూమిమీద ఉంచి కొద్దిపాటి ప్రయత్నముతో తుంటి యముకను పైకి లేపాలి. అప్పుడు ఈ ఆసనంలో లోతుగా వెళ్ళగలుగుతాము.

అశ్వసంచలనాసనము:

How to Do Surya Namasker .

శ్వాస తీసుకుంటూ కుడి పాదాన్ని రెండు చేతుల మద్యలోకి తీసుకురావాలి. ఎడమ మోకాలు నేల మీద ఉంచి, తుంటి భాగాన్ని కిందకు నొక్కుతూ పైకి చూడాలి. ఈ యోగాసనాన్ని లోతుగా ఎలా చేయాలి? కుడి పాదము సరిగ్గా రెండు చేతులకు మధ్యలో ఉంచాలి. ఈ ఆసనంలో కొద్ది ప్రయత్నముతో పిరుదులని నేలకు తగిలేలా చేయడం వలన లోతుగా వేళ్ళగలము.

హస్తపాదాసనము (చేతి నుండి పాదాలవరకు):

How to Do Surya Namasker .

శ్వాస వదులుతూ ఎడమ పాదాన్ని ముందుకు తేవాలి. అరచేతులు భూమి మీదే ఉంచాలి. అవసరమైతే మోకాళ్ళు వంచచ్చు. ఈ యోగాసనాన్ని లోతుగా ఎలా చేయాలి? నెమ్మదిగా మోకాళ్ళను నిటారుగా చేసి, ప్రయత్నముతో చేయగలిగితే ముక్కుతో మోకాళ్లను ముట్టుకోండి. శ్వాస తీసుకుంటూనే ఉండాలి.

హస్త ఉత్తానాసనము (చేతులను పైకి లేపడం):

How to Do Surya Namasker .

శ్వాస తీసుకుంటూ ఉన్నప్పుడు వెన్నుపూసను నిటారుగా చేసి, చేతులు పైకి లేపి కొంచెం వెనుకకు వంగి తుంటి భాగాన్ని కొద్దిగా బయటకు తోయాలి. ఈ యోగాసనాన్ని లోతుగా ఎలా చేయాలి?

గమనించవలసిన విషయమేమిటంటే భుజాల క్రింద భాగము చెవులకు వెనకాలే ఉంచాలి. ఎందుకంటే చేతులను వెనుకకు వంచడం కన్నా పైకి లాగడం ముఖ్యము.

తాడాసనము:

How to Do Surya Namasker .


శ్వాస వదులుతూ మొట్టమొదలు శరీరాన్ని నిటారుగా తీసుకురండి. అప్పుడు చేతులు క్రిందకు తీసుకురండి. ఈ విధంగా విశ్రాంతి తీసుకుంటూ శరీరములో కలిగే స్పందనలను గమనించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to Do Surya Namasker ."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0