Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Indian Students: Indians run towards Canada. The reasons for this are detailed.

 Indian Students : కెనడావైపు భారతీయుల పరుగులు . దీనికి కారణాలు వివరాలు.

Indian Students: Indians run towards Canada.  The reasons for this are detailed.


న్నారై డెస్క్: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారత విద్యార్థులు సాధారణంగా తమ మొదటి ప్రాధాన్యత అగ్రరాజ్యం అమెరికాకే ఇచ్చేవారు.

ఆ తర్వాతే యూకే, కెనడా, ఆస్ట్రేలియా.. వైపు చేసేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు భారత విద్యార్థులు America వైపు అంతగా ఆసక్తి చూపడం లేదు. కెనడా వైపు పరుగులు తీస్తున్నారు. ఈ విషయాన్ని గణాంకాలను చూస్తేనే అర్థం అవుతుంది.

భారతీయ విద్యార్థులు Canadaలో వర్క్‌ పర్మిట్‌తో కూడిన పోస్ట్ గ్రాడ్యూయేషన్ ప్రొగ్రామ్‌లను ఎంచుకుంటున్నారు. ఈ ప్రొగ్రామ్‌లను భారత్‌తోపాటు ఇతర దేశ విద్యార్థులు ఎంపిక చేసుకోవడానికి పెద్ద కారణమే ఉంది. గ్రాడ్యూయేషన్ పూర్తైన తర్వాత కూడా విద్యార్థులు కెనడాలోనే ఉండేందుకు, ఉద్యోగాలు వెతుక్కోవడానికి వీలు కల్పిస్తున్నాయి. అంతేకాకుండా శాశ్వత నివాసం పొందేందుకూ ఉపకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ విద్యార్థులు భారీ మొత్తంలో కెనడాలోనే ఉన్నత విద్యను పూర్తి చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. 2021లో మొత్తం 4.50లక్షల మంది విదేశీ విద్యార్థులు కెనడాలో అడుగుపెట్టగా.. అందులో దాదాపు 50శాతం మంది భారత విద్యార్థులే ఉన్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 2022లో కూడా స్టడీ పర్మిట్‌ల కోసం ఇండియా నుంచి భారీ మొత్తంలో అప్టికేషన్లు అందాయని కాన్సులేట్ జనరల్ ఆఫ్ కెనడా ఓ ప్రకటనలో చెప్పింది.

అమెరికాతో పోల్చినప్పుడు కెనడాలోని విద్యా సంస్థల్లో ప్రవేశం పొందడం చాలా సులభం. GRE, GMAT వంటి కఠిన పరీక్షలను ఎదుర్కొన్న తర్వాతే యూఎస్ యూనివర్సిటీలు విద్యార్థులకు అడ్మిషన్ ఇస్తాయి. కానీ కెనడా ఇన్‌స్టిట్యూషన్‌లు వేరొక పద్ధతి పాటిస్తాయి. విద్యార్థి మార్కులు, స్టాండర్డ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిసియెన్సీ టెస్ట్ లేదా IELTSలో సాధించిన స్కోర్‌ను బేస్ చేసుకుని విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తాయి. కెనడా, అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందడానికి కావాల్సిన కనీస IELTS స్కోరు 6.5 మాత్రమే.. అయినా అమెరికాను కాదని కెనడా వైపు చూడటానికి మరొక ముఖ్య కారణం.. వీసా. అమెరికా స్టూడెంట్ వీసాతో పోల్చితే.. కెనడా వీసా పొందడం సులభం.

ఇదిలా ఉంటే.. కరోనా తర్వాత కెనడాలో ఉద్యోగుల కొరత ఏర్పడింది. ఈ కొరతను విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా అదిగమించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కెనడాలోకి పెద్ద మొత్తంలో వలసలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. దాదాపు 15లక్షల మందికిపైగా విదేశీ ఉద్యోగులకు పర్మినెంట్ రెసిడెన్సీ ఇచ్చేందుకు సిద్ధం అయింది. ఈ క్రమంలోనే 2021 ఏడాదికి సంబంధించి మొత్తం 4.05లక్షల మంది విదేశీయులకు పర్మినెంట్ రెసిడెన్సీ హోదా ఇచ్చింది. దీంతో లక్ష మందికిపైగా భారతీయులకు అక్కడ శాశ్వత నివాస హోదా లభించింది. ఇలా పలు రకాల కారణాలు భారతీయ విద్యార్థులను కెనడా వైపు పరుగులు తీసేలా చేస్తున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Indian Students: Indians run towards Canada. The reasons for this are detailed."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0