Mother Teresa
Mother Teresa (మదర్ థెరీసా)
మదర్ థెరీసా పేరు మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఎక్కడో వేరేదేశంలో పుట్టి మన భారత దేశానికి విచ్చేసి ఇక్కడ ఎందరో అభాగ్యులను తన అక్కున చేర్చుకుని గొప్ప మనసున్న తల్లిగా వారిని ఆదరించి, ఆఖరికి తన జీవితాన్ని వారి సేవ కోసం పణంగా పెట్టి ఒకానొక సమయంలో యాచన కూడా చేసిన మహోన్నత వ్యక్తి మదర్ థెరీసా. మంచి, మానవత్వం, దయాగుణం, సహాయ తత్వం అనేవి ప్రతిఒక్క మనిషి అలవర్చుకోవాలని భగవంతుడు మనకు ఇంతటి గొప్ప జీవితాన్ని ఇచ్చింది ఎంతో కొంత పరులకు సహాయపడడానికే అని చెప్తుంటారు థెరిస్సా.
ఇక ఆమె జీవితం, బయోగ్రఫీ గురించి ఇప్పుడు చూద్దాం.
మదర్ థెరీసా అసలు పేరు ఆగ్నీస్ గోక్షా బొజాకు. అల్బేనియా దేశంలో జన్మించిన థెరీసా రోమన్ క్యాథలిక్ తెగకు చెందినవారు. ఆమె 1910, ఆగష్టు 26వ తేదీన ఉస్కుబ్ ప్రాంతంలోని (స్కోబ్జే) ఒట్టోమన్ సామ్రాజ్యంలో జన్మించారు. ఆమె తల్లితండ్రులు నికొల్లే, డ్రానా బ్రోజాక్షిహ్యూ. వారు అల్బేనియా ప్రాంతానికి చెందిన వారు, అక్కడే జీవనం కొనసాగించారు.
ఇక థెరీసా కు సరిగ్గా ఎనిమిదేళ్ల వయసులో అనగా 1919లో స్కోబ్జే ని అల్బెనియా ప్రాంతం నుండి తొలగించాలని అప్పటి రాజకీయ పాలకులు నిర్ణయం తీసుకున్న సమావేశం అనంతరం థెరీసా తండ్రి జబ్బుతో మరణించారు. ఆపై థెరీసా ను తల్లి ఒక రోమన్ క్యాథలిక్ గా పెంచారు.
అయితే బాల్యంలో జోన్ గ్రాఫ్ఫ్ క్లూకాస్ చేత రాయబడిన ఆమె జీవిత చరిత్ర ప్రకారం థెరీసా ఎక్కువగా మతప్రబోధనలకు అలానే జీవిత చరిత్ర కథల కు ఎక్కువగా ఆకర్షితులయ్యేవారట. 12 ఏళ్ళ వయసులోనే జీవితాన్ని మతానికి అంకితం చేయాలని భావించిన థెరీసా, ఆపై 18 ఏళ్ళ వయసు వచ్చే సరికి తన ఇంటిని వదిలి సిస్టర్స్ ఆఫ్ లోరెటో అనే మాత ప్రచారకులు సంఘంలో చేరి అక్కడి నుండి పూర్తిగా తన జీవితాన్ని సేవకే అంకితం చేసారు.
అనంతరం మన భారత దేశంలోని డార్జిలింగ్, ఆపై 1931 మే 24న సన్యాసినిగా మారారు. మాత ప్రచారకులు సంఘం సెయింట్ అయిన తెరేసే డి లిసే పేరు ఆచరించేలా తన పేరును థెరీసా గా మార్చుకున్నారు. ఆ తరువాత 1937లో కోల్కతా లోని లోరెటో కాన్వెంట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. అయితే ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పేద వారిని, అన్నార్తులను చూసి ఆమె మనసు ఎంతో చలించిపోయింది.
తన జీవితాన్ని సేవకే అంకితం చేసారు.
1943లో ఏర్పడిన కరువు పరిస్థితులు కలకత్తా ప్రజల్లో ఎందరినో మరింత పేదవారిని చేసాయి. ఇక 1946లో కేవలం కాన్వెంట్ లో ఉపాద్యురాలిగానే కాక తనవంతుగా ప్రజలకు సేవ చేయాలనీ తలచి తన సాంప్రదాయ లోరెటో అలవాటును వదిలి ఎంతో నిరాడంరమైన నీలపు అంచుగల తెల్ల చీరను ధరించి, అనంతరం భారతదేశ పౌరసత్వం స్వీకరించి అక్కడి నుండి మురికివాడల్లోకి ప్రవేశించి పేద వారికి సేవ చేయడం ఆరంభించారు.
ఆపై మోతిజిల్ ల ఒక పాఠశాలను ప్రారంభించి అన్నార్తులను ఆదుకోవోడం మొదలెట్టారు. అయితే ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు అప్పటి అధికారులను ఎంతో ఆకర్షించాయి. 1950 అక్టోబర్ లో వాటికన్ అనుమతితో మతగురువుల సంఘం ఆవిర్భవించింది, అయితే అదే తదనంతరం మిషినరి ఆఫ్ చారిటీస్ గా రూపాంతరం చెందింది. 1952 లో కోల్కతా లోని పాడుబడిన హిందువుల దేవాలయాన్ని అధికారుల అనుమతితో పేదల ధర్మశాల గా ఆమె మార్చారు.
ఇక అక్కడి నుండి ఎందరో అనాధలను తమ సంస్థ ద్వారా అక్కున చేర్చుకుని ఎందరికో నూతన జీవితాన్నిచ్చారు థెరీసా. అంతేకాక భయంకరమైన కుష్టువ్యాధి గ్రస్తులను సైతం ఆమె ఆదరించి వారిని అక్కున చేర్చుకున్నారు. అయితే రాను రాను ఆమె చారిటీస్ సంస్థ ఎందరినో ఆకర్షించి విరాళాలను అందుకుంది.
ఆపై 1968లో రోమ్, టాన్జానియా, ఆస్ట్రియా, అలానే 1970లో ఆసియా, ఆఫ్రికా, యూరోప్ లోని పలు దేశాలు అలానే యునైటెడ్ స్టేట్స్ లోని పలు ప్రాంతాలకు ఆమె సంస్థ సేవలు విస్తరించాయి. మధ్యలో ఆమెపై పలువురు విమర్శలు గుప్పించినప్పటికీ అవేవి లక్ష్య పెట్టకుండా తనకు ఆ యేసు బోధనలే రక్ష అని, సేవే తన మార్గం అని ఆమె ముందుకు సాగారు.
ఆపై ఇథియోపియా లో ఆకలి బాధలతో అల్లడుతున్న అన్నార్తులను ఆదుకోవడం, ఇజ్రాయిల్ సైన్యానికి పాలస్తీనా గెరిల్లాలు మధ్య కాల్పులు జరిగిన సమయంలో ఒక వైద్యశాలలో చిక్కుకుపోయిన దాదాపుగా 37 మంది పిల్లలను ఆమె కాపాడారు.
1962 లో పద్మశ్రీ బహూకరించడం ద్వారా శతాబ్ద మూడో భాగంలో అందరికంటే ముందుగా భారత ప్రభుత్వం ఆమెను గుర్తించింది. తరువాతి దశాబ్దాలలో వరుసగా ఆమె అంతర్జాతీయ అవగాహనకు గాను జవహర్లాల్ నెహ్రూ పురస్కారాన్ని 1972 లోను, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను 1980 లోను అందుకున్నారు.ఆమె జీవిత చరిత్రను ఇండియన్ సివిల్ సర్వీసు అధికారి ఐన నవీన్ చావ్లా రచించి, 1992 లో ప్రచురించారు
దక్షిణ లేదా తూర్పు ఆసియా దేశాల వారికి ఇచ్చే ఫిలిప్పీన్స్ కు చెందిన రామన్ మాగ్సేసే (Ramon Magsaysay) పురస్కారాన్ని 1962 లో మదర్ థెరీసా అంతర్జాతీయ అవగాహనకు గాను అందుకున్నారు
శాంతికి విఘాతం కలిగించే పేదరికాన్ని, దుఃఖాన్ని తొలగించేందుకు ఆమె చేసిన కృషికి 1979 లో మదర్ థెరీసాకు నోబెల్ శాంతి బహుమతి అందచేసారు. బహుమతి గ్రహీతలకు మర్యాద పూర్వకంగా ఇచ్చే సాంప్రదాయ విందును నిరాకరించి $192,000 నిధులను భారత దేశం లోని పేద ప్రజలకు ఇవ్వవలసినదిగా కోరుతూ, భౌతికపరమైన బహుమతులు ప్రపంచంలోని అవసరార్థులకు ఉపయోగపడినపుడే వాటికి ప్రాముఖ్యత వుంటుందని ఆమె అన్నారు.
0 Response to "Mother Teresa "
Post a Comment