Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

This Ganesha idol is unique in the world.

 ఈ వినాయక విగ్రహం ప్రపంచం లొనే ప్రత్యేకమైనది.వివరాలు

This Ganesha idol is unique in the world.

ఇదొక ఇస్లామిక్ దేశంలో  వెయ్యేళ్ల పైబడి భూమిలో పూడుకుపోయి చెక్కుచెదరకుండా ఇపుడు బయటపడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నది.

ఇది 2010, ఫిబ్రవరి రెండో వారంలో లో ఇండోనేషియా, యోగ్యకర్తా లోని ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ ఇండోనేషియా (ప్రైవేటు యూనివర్శిటీ) లో ఒక భవన నిర్మాణానికి తవ్వకాలు జరుగుతున్నపుడు బయటపడింది.

ఇది క్రీ.శ 9వ శతాబ్దానికి చెందిందని చరిత్రకారులు చెప్పారు.  అంతకంటే విశేషం  అక్కడి భూమిలో పూడుకు పోయి చెక్కుచెదరకుండా నక్కి ఉన్న ఒక ఆలయంలో ఈ విగ్రహం  కనిపించింది. ఈ ఆలయం బయటపడగానే, దీన్ని చూసేందుకు  బౌద్ధ బిక్షువులు, ప్రజలు తరలివచ్చారు. విగ్రహం ఏ మాత్రం దెబ్బతినలేదు. ఎవరూ ద్వంసం చేసిన ఆనవాళ్లు లేవు.

ఇండోనేషియా భూమ్మీద ఒక చిత్రమయిన దేశం.  హిందూ, బౌద్దం, ఇస్లాం- మూడు మతాలు కలివిడిగా ఒకపుడు వర్థిల్లిన దేశం. ఆదేశంలో క్రీ.శ అయిదో శతాబ్దం నుంచి 15 వ శతాబ్దం దాకా హిందూ, బౌద్ధమతాలుండేవి. తర్వాత ఇస్లాం విస్తరించింది.  ఇది  ఒక రోజులో జరిగిందేమీ  కాదు.  ఒక సుదీర్ఘమయిన పరిణామం.  ఇపుడు ఆదేశంలో 90 శాతం మంది ముస్లింలు. అయితే,  హిందూ సింబల్స్  ముస్లిం అలవాట్లలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. హిందూ సింబాలిజం ఆదేశ సంస్కతిలో విడదీయ రానిభాగం. వాళ్ల కరెన్సీ రుపయా. దాని మీద గణేశుడి బొమ్మ ఉంటుంది. పూర్వం నుంచి ఇక్కడ వినాయకుడు విశిష్ట దైవంగా ఉండేవాడేమో ఇండోనేషియాలోని అనేక తవ్వకాలలో వినాయకుడి విగ్రహాలు బయటపడుతున్నాయి.

ఒకపుడు ఇండోనేషియా ప్రాంతంలో హిందూ సంస్కృతి  వర్ధిల్లిందనేకు ఇస్లామిక్ యూనివర్శిటీలో బయల్పడిన విగ్రహం, గుడి నిదర్శనంగా చరిత్రకారులు చెబుతున్నారు.

 ఉద్రికత్త, వైషమ్యాలు లేకుండా ఇలా మతాల సహజీవనం ప్రపంచంలో అరుదు. ఉదాహరణకు జావాలో ముస్లిం, హిందూ, బౌద్ధం సహజీవనం చేయడం చూడవచ్చు. యోగ్య కర్త నగర నడిబొడ్డున యోగ్యకర్త  సుల్తాన్ ప్యాలస్ ఉంటుంది. పట్టణ శివార్లలో ప్రపంచంలోనే పెద్దదని పేరున్న భౌద్ద నిర్మాణం ‘బొరొబుదూర్’ (Borobudur), ఇండోనేషియాలోనే పెద్ద దయిన హిందూ  శివాలయం ‘ప్రంబనన్’ ఉంటాయి. ( విగ్రహాన్ని పురాతత్వనిపుణులు శుభ్రం చేస్తున్న ఫోటో)

ఇస్లామిక్ యూనివర్శిటీ క్యాంపస్ తవ్వకాలలో బయటపడిన రెండు చిన్న ఆలయాలు  1100 సంవత్సాల కిందటివి. అయినా ఏ చెక్కు చెదరకుండా ఉన్నాయి.

“This temple is a quite significant and very valuable because we have never found a temple as whole and intact as this one,”  అని ఈ తవ్వకాల నుంచి జాగ్రత్త ఆలయాన్ని వెలికి తీస్తున్న పురాతత్వ వేత్త డా. బుధీ శాంకొయో చెప్పారు. ఈ ఆలయంలో దొరికిన విగ్రహాలు, సహాజంగా ఆలయాలలో ఎక్కడ  ఏర్పాటు చేస్తారో అక్కడే చెక్కు చెదరకుండా ఉండటం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది మా పూర్వీకుల సంస్కృతిని అర్థం చేసుకునేందుకు పనికొస్తుందని డా. శాంకొయో అన్నారు. ఇండోనేషియన్ సాంప్రదాయిక ఇస్లాం ను అరబిక్ స్టైల్ ఇస్లాంగా  మార్చేందుకు కొంతమంది చేసిన ప్రయత్నాలు  ఇప్పటికయితే ఫలించలేదు. భవిష్యత్తులో ఏమవుతుందోతెలియదు.

ఈ విగ్రహం ఇపుడు అంతర్జాతీయ మార్కెట్లో $2,50,000 డాలర్ల దాకా చేస్తుందని, అందువల్ల దొంగలనుంచి దీన్ని కాపాడాల్సిన అవసరం ఎంతయినా ఉందని అయన అన్నారు.

అయితే, ఈ విగ్రహాన్ని, ఆలయాన్ని ఇస్లామిక్ యూనివర్శిటీ అధికారులు మాత్రం చాలా అమూల్యమయిన ప్రాచీన సంపదగా గుర్తిస్తున్నారు. “ మా ఇండోనిషియాకు  గొప్ప చరిత్ర ఉంది.  విభిన్న మతాలు సఖ్యంగా సహజీవనం చేయవచ్చని ఇండోనేసియా సుదీర్గమయిన చరిత్ర రుజువు చేసింది,” ఇస్లామిక్ విశ్వ విద్యాలయానికి చెందిన అధికారి సువర్సనో ముహమ్మద్ చెప్పారు.

అదే చైతన్య స్ఫూర్తితో ఈ ఆలయ శకలాలను విశ్వవిద్యాలయం భద్రపరచాలనుకుంటున్నది. “ ఇక్కడ ఒక పెద్ద లైబ్రరి కడుతున్నాం. లైబ్రరి ముందు  ప్రముఖంగా కనిపించేలా ఇక్కడ తవ్వకాలలో బయల్పడిన ఆలయాన్ని అర్ధచంద్రాకారంలో నిలబెట్టాలనుకుంటున్నాం,” అని ఆయన చెప్పారు.

ఈ తవ్వకాలు ఎలా మొదలయ్యాయంటే. ఆయేడాది ఆగస్టులో  ఇక్కడ ఒక లైబ్రరీ కట్టాలనుకున్నారు. విశ్వవిద్యాలయం  79 ఎకరాల్లో యోగ్యకర్త నగరం పక్కనే వెలుస్తున్నది. ఈ ప్రాంతంలో గతంలో ఎపుడూ ఎలాంటి ఆలయం కనిపించలేదు. డిసెంబర్ లో  నిర్మాణం కోసం ఏడడుగుల గుంత తవ్వారు. అక్కడ మట్టి చాలా వదులుగా ఉంది. దానితో మరికొంత లోతు తవ్వాల్సి వచ్చింది. అపుడు పలుగుపారలకు ఏదో గట్టిగా తగిలింది. తీరాచూస్తే అది ఒక గోడ. ఈ విషయం తెలియగానే ఆర్కియాలజీ శాఖ నిపుణులు వచ్చి తవ్వకాలు మొదలుపెట్టారు. 35 రోజులు చాలా జాగ్రత్తగా తవ్కాక చూస్తే రెండు చిన్న ఆలయాలు కనిపించాయి. ఇవి 1100 సంవత్సరాల కిందటివని వారు లెక్క గట్టారు.

ఇందులో ప్రధానాలయం 20X20 అడుగుల పరిమాణంలో ఉంది. సంపూర్ణంగా భధ్రంగా ఉన్న గణేశుడి విగ్ర హం కనిపించింది ఇందులోనే. ఈ గణేశుడు  శివలింగం పక్కనే కూర్చుని ఉన్నాడు. రెండో ఆలయం 20X13 అడుగుల పరిమాణంలో ఉంది. ఇక్కడి నుంచి కూడా ఒక శివలింగం, శిల్పాలను వెలికితీశారు. రెండు వేదికలు, నంది విగ్రహం కూడా ఇక్కడ బయల్పడ్దాయి. “ The temples are not so big, but they have features that we haven’t found in Indonesia before,”  అని అక్కడి పురాతత్వ కార్యాలయ అధికారి హెర్ని ప్రమస్తుతి (Herni Pramastuti) చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ రాసింది.

ఈ రెండు ఆలయాలు చాలా  భద్రంగా ఉన్నాయి.  శతాబ్దాలుగా ఏ మాత్రం దెబ్బతినకుండా ఇలా భూమిలో భద్రంగా దాగి ఉండటం పట్ల పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణమేమయి ఉంటుంది?

ఇక్కడికి సమీపంలో మేరపి పర్వతం (Mount Merapi) అగ్ని పర్వతం ఉంది. దీని  నుంచి పెల్లుబికిన  లావా ఉత్తర దిశగా 7.5మైళ్లు ప్రవహించి అక్కడి నదిని ముంచేసి ఉంటుందని, అపుడు నదిలోని నీరు ఈ గుళ్ల మీదకు ప్రవహించి పూడ్చేసి ఉండాలని, అందుకే ఈ ఆలయాలు ఏమాత్రం దెబ్బతినకుండా  ఇంతభద్రంగా ఉన్నాయని పరిశోధకులు బావిస్తున్నారు.

 ఇండోనేషియాలో అక్కడక్కడ కనిపించిన హిందూ, బౌద్ధ ఆలయాలలో ఎక్కడా కనిపించనంతటి మెరుగ్గా ఈ ఆలయాల కుడ్య చిత్రాలు కనబడుతున్నాయని పురాతత్వ కార్యాలయంలోని పరిశోధకుడు ఇండుంగ్ పంచ పుత్ర చెప్పారు.

ఇండోనేసియాలో హిందూమతం దాదాపు వెయ్యేళ్లు ప్రధాన మతంగా ఉండింది. అందుకే దాని ప్రభావం ఈ రోజు బలంగా కనిపిస్తుంది, అని గడ్జా మాదా యూనివర్శిటీ (Gadja Mada University) పురాతత్వ శాఖ ప్రొఫెసర్ తింబుల్ హర్యోనో చెప్పారు.

జావా ద్వీపానికి హిందూమతం అయిదో శతాబ్దంలో వ్యాపించింది. 15 శ శతాబ్దంనాటికి ఈ ప్రాంతం ఇస్లాం ప్రభాంలోకి వచ్చింది. ఇది అకస్మాత్తుగా వచ్చింది కాదు. నిదానంగా సాంస్కతిక సంపర్కంతో విస్తరించి చివరకు ప్రధానమతమయింది. అందుకే ఇండోనేషియాలోని తొలినాళ్ల మసీదులన్నీ మక్కా వైపు ముఖం చేసి ఉండవు. హిందూ గుళ్లలాగా తూర్పుముఖంగా ఉంటాయి. హిందూ ప్రభావం లో పెరిగినందునే, ఇక్కడి ఇస్లాం సంప్రదాయాలలో హిందూ, బౌద్ధాచారాల కోకోల్లని ప్రొఫెసర్ హర్యోనో చెప్పారు.

“ఇవన్నీ మా పూర్వీకులవి.అంటే మాది అని చెప్పుకునే చరిత్ర మాకూ ఉంది,” అని బౌద్ధ బిక్షువు ధమ్మికో అన్నారు. చరిత్ర కారులు చెబుతున్న దాని ప్రకారం, జావా ద్వీపంలోకి హిందూమతం క్రీ.శ 5 శతాబ్దంలో ప్రవేశించింది. మూడువందల సంవత్సరాల అనంతరం  ఈ దేశానికి బౌద్దం విస్తరించింది. చిత్రమేమిటంటే, హిందూ బౌద్ద రాజ్యాలు పక్కనే సహజీవనం చేశాయి. 15వ శతాబ్దంలో ఇస్లాం బలపడింది. అయితే,  ఈ ఇస్లాం ఈరెండు మతాల ప్రభావం ఇముడ్చుకుని ఒక విశేష ఇస్లాంగా తయారయింది. అందుకు ఆ పూర్వకాలంలో కట్టిన మసీదులు తూర్పు ముఖంగా ఉంటాయి.

తర్వాత 2013లో బంగుతపన్ జిల్లాలోని బాటురెండో గ్రామంలో జరిగిన తవ్వకాలలో మరొక వినాయకుడి విగ్రహం కనిపించింది (పై ఫోటో). ఇది దాదాపు  140 సెంటిమీటర్ల ఎత్తు, 90 సెం.మీ వెడల్పుతో ఉంది. ఇది పూర్వం వెయ్యేళ్ల కిందట ఇక్కడి వర్ధిల్లిన హిందూ మాతారం (Mataram) రాజ్య కాలంనాటిదని పురాతత్వ వేత్తలు చెబుతున్నారు. తొందర్లోనే దీని కాలం సరిగ్గా అంచనా వేస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "This Ganesha idol is unique in the world."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0