Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Courts cannot interfere in government decisions

ప్రభుత్వ నిర్ణయాల్లోన్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు

Courts cannot interfere in government decisions

  • మేము ఉన్నది ప్రభుత్వాన్ని నడపడానికి కాదు: హైకోర్టు
  • పాఠశాలల విలీనంపై కౌంటర్లు వేయాలని ఆదేశం

 ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థా నాలు సహజంగా జోక్యం చేసుకోలేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభు త్వాన్ని తాము నడపడం లేదని, ఇక్కడ ఉన్నది సర్కారును నడపడానికి కాదని పేర్కొంది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర మానవవన రుల అభివృద్ధిశాఖ కార్యదర్శి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి పాఠ శాల విద్య కమిషనర్, డైరెక్టర్, రాష్ట్ర విద్యా మండలి డైరెక్టర్ తదితరులకు నోటీసులు జారీచేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదే శాలు జారీ చేసింది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాలు చేస్తూ ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ బి, రమేశ్చంద్ర సింహగిరి పట్నాయక్ తాజాగా హైకోర్టులో "పిల్ దాఖలు చేశారు. ఇదే వ్యవహారంపై డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్, వైయస్ఆర్, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ కేసులు హైకోర్టులో విచారణకు వచ్చాయి. సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్ర సాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఆంగ్లమాధ్య మంలో విద్యా బోధనకు ప్రభుత్వం పావులు కదుపుతోందన్నారు. సాధ్యమై నంత త్వరగా విచారణ జరపాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారంతో ముడి పడి ఉన్న వ్యాజ్యాలన్నింటినీ కలిపి విచారణ చేయాలని కోరారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Courts cannot interfere in government decisions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0