Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What is a temple?

 దేవాలయం అంటే ఏమిటి?

What is a temple?

దేవళం లేదా దేవాలయం (Temple) మత సంబంధమైన ప్రార్థనల వంటి కార్యక్రమాలకు వినియోగించే కట్టడం. దాదాపు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి.

అసలు దేవాలయం అంటే ఏమిటి?

హిందూధర్మంలో దేవాలయాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అసలు ఈ దేవాలయమంటె ఏమిటి? ఈ దేవలయాలు ఎందుకు? అన్న ప్రశ్నలు తలెత్తినప్పుడు, ‘దేవానాం దేవస్య వా ఆలయా అని సమధానమిచ్చారు మన ఋషిపుంగవులు. దేవాలయం ప్రార్థన కోసం, పూజ కోసం, దేవతావిగ్రహాలను, ఇతర ఆరాధ్య వస్తువులను ప్రతిష్టించి, వాటి రక్షణకోసం కట్టించిన కట్టడమే దేవాలయమని అన్నారు. అందుకే మనవాళ్ళూ దేవలయాన్ని సప్తసంతానాలలో ఒకటిగా పేర్కొన్నారు. కొడుకు లేక కూతురు, తటాకం, కావ్యం, విధానం, ఆలయం, వనం, భూదేవస్థాపనం అనేవి సప్తసంతానాలుగా చెప్పబడ్డాయి. దేవాలయన్ని దేవగృహం, దేవగార, దేవాయతనం, దేవకులం, మందిరం, భవనం, స్థానం, దేవస్థానం, వెష్మం, కీర్తనం, హర్మ్యం, విహారం అని, విమానం, ప్రాసాదం అని పిలవడం జరుగుతోంది.

హిందూధర్మంలో దేవాలయాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అసలు ఈ దేవాలయమంటె ఏమిటి? ఈ దేవలయాలు ఎందుకు? అన్న ప్రశ్నలు తలెత్తినప్పుడు, ‘దేవానాం దేవస్య వా ఆలయా అని సమధానమిచ్చారు మన ఋషిపుంగవులు. దేవాలయం ప్రార్థన కోసం, పూజ కోసం, దేవతావిగ్రహాలను, ఇతర ఆరాధ్య వస్తువులను ప్రతిష్టించి, వాటి రక్షణకోసం కట్టించిన కట్టడమే దేవాలయమని అన్నారు. అందుకే మనవాళ్ళూ దేవలయాన్ని సప్తసంతానాలలో ఒకటిగా పేర్కొన్నారు. కొడుకు లేక కూతురు, తటాకం, కావ్యం, విధానం, ఆలయం, వనం, భూదేవస్థాపనం అనేవి సప్తసంతానాలుగా చెప్పబడ్డాయి. దేవాలయన్ని దేవగృహం, దేవగార, దేవాయతనం, దేవకులం, మందిరం, భవనం, స్థానం, దేవస్థానం, వెష్మం, కీర్తనం, హర్మ్యం, విహారం అని, విమానం, ప్రాసాదం అని పిలవడం జరుగుతోంది.

మన సంస్కృతి, కళలు, శిల్పం, వాస్తు, వేదాంతం పురాణం మొదలైన వాటి సంగమ స్థానం హిందు దేవాలయం.

పరిపూర్ణమైన, సుందరమైన ఆలయమంటె మానవశరీరం. ఇక్కడ “తత్” (ఆత్మ) ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవిషయాలు అంతరంగ వృత్తులు (అంత: కరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు) తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది.

దేహమే దేవాలయం. దేహంలో ఉన్న జీవమే పరమత్మ. జీవాత్మ పరమాత్మకంటె వేరన్న అజ్ఞానమే నిర్మాల్యం; నేనే అతనని పూజించలి అని అగమాలు ఘోషిస్తాయి. దేవాలయం ఒక దేహం లాంటిది. శిఖరం శిరస్సు; గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం; ప్రాకారపు గోడలు కాళ్ళూ; గోపురం పాదాలు; ధ్వజ స్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నము. అక్కడే మనం విశ్వసిస్తున్నాము.

దేవాలయ ప్రాచీనత

భగవంతుడు లేకుండా మానవుడు జీవించలేడననీ, శివుని అజ్ఞ లేనిదే చీమైనాకుట్టందనీ, అందుకనే భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము. భగవత్సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు. ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం. అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం (ఫిజికల్ బాడీ) మానసిక శరీరం (సైకిక్ బాడీ), తైజసిక శరీరాలను (సూపర్ కాన్ షియస్ బాడీ) ప్రతిబింబిచే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక కొక్కీ (లింక్) అని విజ్ఞుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ ఆరంభింపబడిందో చెప్పడం కష్టం. వేదకాలాల్లో దేవాలయాలు లేవనీ, విగ్రహారాధనా పద్ధతి, దేవాలయాల నిర్మాణం వెదకాలపు చివరిదశలో, రామాయణ, మహాభారత కాలల్లో ఆరంభమైందనీ, వేదకాలపు యాగశాలలే కాలక్రంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం.     దేవాలయ వాస్తు

దేవాలయాలను మనం రెండువర్గాలుగా విభజించుకోవచ్చు.

  • 1.గ్రామదేవతాలయలు 
  • 2.శిష్టదేవతాలయాలు. 

మొదటివర్గం గ్రామరక్షణ కోసం తరతరాలుగా గ్రామసంస్కృతిలో నిలద్రొక్కుకున్న ఎల్లమ్మ, మారమ్మ, పోచమ్మ, మైసమ్మ మొదలైన దేవతల చిన్న చిన్న గుడులు. గ్రామదేవతలలో అధికం స్త్రిలే . ఒక విధంగా వీరు శక్తిదేవతలు. ఈ దేవలయాల్లో చెప్పుకోదగ్గ వాస్తుశిల్పం కనపడదు. ఆలయాలు సాధారనంగా ఉంటాయి. ఇక రెండవవర్గం బ్రహ్మ, విష్ణు, శివ, విఘ్నేశ్వర మొదలైన శిష్టదేవతలు లేక నాగరీక దేవతల ఆలయాలు, ఈ దేవతలను పూజించేవాళ్ళు సామన్యంగా బ్రహ్మణులు. అగమాలలో చెప్పిన రీతిగా ఈ దేవతలకు షోడశోపచారాలు, చతుష్పష్టి ఉపచారాలు జరుగుతాయి.

శిష్టదేవాలయాలు వాస్తు శాస్త్రానుగుణంగా నిర్మించబడ్డాయి. గృహ, గ్రామ, నగర, దేవాయతన, ప్రాసాద, దుర్గ, ఆరామ, తటాక, సేతుబంధ ఇత్యాది నిర్మాణ లక్షణాలను తెలిపే శిల్పశాస్త్రమే వాస్తుశాస్త్రం. ఈ వాస్తు సంప్రదాయం ఆగమాల మీద ఆధార పడింది, ఆగమాలలో దేవాలయ నిర్మాణం, ఉత్సవాలు పేర్కొనబడ్డాయి, కామిక, కారణ ఆగమాలలో నియమ నిబంధనలు చెప్పబడ్డాయి. వాస్తుశాస్త్రం త్రిమూర్తుల నుండి ఇంద్ర, బృహస్పతి, నారదులకు అనుగ్రహింపబడిందనీ, వాళ్ళ ద్వారా అనేక ఋషులకు సంక్రమించిదని అంటారు. పురాతన పట్టణాలు, కట్టడాలు వాస్తు శాస్త్రానుగుణంగా నిర్మింప బడుతుండేవి.        దేవాలయ నిర్మాణం

దేవాలయ నిర్మాణంలో మొట్టమొదటి అంశం ఆలయ నిర్మాణానికి భూమిని ఎన్నుకోవడం ఉంది. పవిత్రములైన దేవాలయాలు సాధారణంగా నదీతీరాల్లోకాని, నీటి బుగ్గలు ఉన్న పర్వతాగ్రాల మీద కానీ కట్టబడి వుండడాన్ని మనం గమనించవచ్చు. పుణ్యక్షేత్ర సమీపంలోను, నదీ తీరంలోను సముద్రతీరంలోను, నదీసంగమస్థానంలోను, పర్వతాగ్రంలోను, పర్వతపార్శ్వంలోను, వనంలోను, ఉపవనంలోను, ఉద్యానవనంలోను, సిధ్ధదుల ఆశ్రమంలోను, గొప్ప గ్రామంలోను, పురంలోను, పట్టణంలోను, రమ్య ప్రదేశాలలోను, దేవాలయాలను కట్టాడానుకి సంకల్పించాలట. ఈ ప్రదేశాలన్నీ ప్రకృతి పరిసరాలు, దేవాలయ నిర్మాణానికి అనువైన ప్రదేశాలు. అందు వల్లనే బృహత్సంహీత ఇలా చెప్తుంది.దేవాలయ ప్రధాన భగాలు

దేవాలయంలో ప్రధాన భాగం చతురస్రాకారంలో ఉన్న “గర్భ గృహం” లేదా “గర్భగుడి” ఇది దేవాలయానికి హృదయంలాంటిది. మనుష్య శరీరంలో ఆత్మ దాగి ఉన్నట్టుగాదేవాలయంలో భగవంతుదు కూడ మానవుడికి అత్యంత సులభంగా దృగ్గోచరం కాకుండేతట్టుగా “గర్భగృహం” లో ఆవాసస్థానం పొంది ఉన్నాడు. ఇదే “మూలవిగ్రహం” లేదా “మూలబేరం” అనబడుతోంది. గర్భగృహంలో ప్రవేశద్వారం తప్పితే మరి ఎలాంటి కిటికీలు కానీ ఉండవు. సాధారాణంగా చీకటి అలుముకొని ఉంటుంది. ఈ చీకటి భక్తుణ్ణి విగ్రహం మీదికి దృష్టిని కేంద్రికరింపచేస్తుంది. ఈ లోకాన్ని మరచి తన్మయత్వాన్ని పొందుతాడు భక్తుడు. తనకు తెలీయనటువంటి అనుభూతిని పొందుతాడు. భక్తుడికి భగవదాకర్హణ, సంపర్కం, ఆశీస్సులు ఇక్కడే లభిస్తాయి. భక్తుడు తనలో దైవాన్ని, సత్యాన్ని చూస్తాడు.

గర్భగృహం పైభాగంలో గోపురం ఉంటుంది. దీన్నే విమానం అంటారు.. ఇదే దేవాలయ వైభవానికి నిదర్శనం. ఇది సాధారణంగా పోతపోసిన విగ్రహాలతో అలంకరించబడి ఉంటుంది. విమానంమీద శిఖరం ఉంటుంది. శిఖ వున్నది శిఖరం. దాని మీద కలశం వుంటుంది. గర్భగృహంచుట్టు భక్తులు గుడి తిరగడానికి “ప్రదక్షిణాపథం” ఉంటుంది. వేసర పద్ధతిలో నిర్మించబడ్డ ఆలయాల్లో ఇది సాధారణంగా ఉండదని అంటారు.

గర్భగృహం ముందు భాగంలో “ముఖమంటపం” వుంటుంది. దీన్నే “అర్ధమంటపం” అని “శుకనాసి” అనీ అంటారు. ఇది చతుస్రాకారంలో కానీ, దీర్ఘ చతుస్రాకారంలో కానీ ఉండి ప్రక్కలలో గోపురం కానీ, శిఖరం కానీ కలిగి ఉంటుంది. గర్భగృహం ముఖమంటపాలను మహామంటపానికి (హాలు) కలిపే చిన్నమార్గాన్ని “అంతరాలం” అంటారు. కొన్ని ఆలయాల్లో ముఖమంటంపమే అంతరాళంగా ఉంతుంది. మహామంటపాన్ని “నృత్తమంటపం” లేదా “నవరంగ” అని కూడ అంటారు. అర్థ మంటపం ప్రవేశ ద్వారాల్లో ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. గర్భగృహం లేదా అంతరాళం లేదా మంటపం ముందుభాగంలో ద్వజస్తంభం ఉంటుంది. దానిమీద వున్న లాంఛనం మూలదేవత వాహనం.

ద్వజస్తంభం సమీపంలో దేవుడి పాదచిహ్నం లేదా పద్మం వున్నబలిపీఠం ఉంటుంది. బలిపీఠమ్మీద పరివార దేవతలకు బలి అన్నం పెడతారు. బలిపీఠానికి ఎదురుగా దీపస్తంభం వుంటుంది.సాధారణంగా, దేవాలయం ప్రాకారపు గోడలతో చుట్టబడి ఉంటుంది. దీనికి ప్రధానద్వారం, తక్కిన మూడు ద్వారాలు ఉంటాయి. ఈ ద్వరాలమీద ఆకాశాననంటే గోపురాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రాకారం మహద్వారం మీదన్న గోపురాలు అనేక అంతస్తులను కలిగి కళాత్మకంగా ఉంటాయి. కొన్ని దేవాలాయలో 2, 3, ప్రాకారాలు కూడా ఉంటాయి. ప్రాకారం లోపల ప్రధానాలయంతో పాటు మరికొన్ని చిన్న చిన్న మందిరాలు కూడ ఉంటాయి. కళ్యాణమంటపం, యోగశాల, పాకశాల, స్వామిపుష్కరిణి, ఉత్సవమూర్తుల నుంచే గది ఇత్యాదులు సర్వసాధారణంగా ఉంటాయి.

సాధారణంగా శివాలయం పట్టణానికి ఈశాన్య దిశలోను, విష్ణ్యాలయం పశ్చిమదిశలోను, సూర్యదేవాలయం తూర్పు దిక్కులోను, దుర్గ ఆలయాలు ఉత్తరదిశలోను, బ్రహ్మాలయం పట్టణ మధ్యభాగంలోను ఉండాలట.

సామాన్యంగా శివాలయాల్లో లింగమే మూలబేరంగా ఉంటుది. లింగం ఎత్తునుబట్టి శివాలయాలు ఉత్తమోత్తమ, ఉత్తమ, మధ్యమ మున్నగు విధాలుగా వర్గీకరించబడతాయి. గర్భగుడిలో లింగంతోపాటు ఇచ్చ, మరియు క్రియా అనే శక్తులు ఉంటాయి. ప్రవేశా ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. వినాయకుడు, దక్షిణామూర్తి, విష్ణువు లేదా ఆర్థనారీశ్వరుడు, లింగోద్భవ, బ్రహ్మ, దుర్గ మరియు చండీశ్వరాలయాలు సాధారణంగా ప్రధాన ఆలయం చుట్టూ ఉంటాయి. రెండవ ప్రాకరంలో సూర్య, వినాయక, సుబ్రహ్మణ్య, గజలక్ష్మి మరియు భారతదేశం అంతటా ఇదంతా ఒకే లాగ ఉండదు. శైవాలయాల్లో గర్భగుడికి ముందు నంది విగ్రహం ఉంటుంది వైష్ణవాలయల్లో గర్భ గుడికి ముందు బలిపీఠం, ధ్వజస్థంభాలు కలిగిన గరుడ విగ్రహం ఉంటుంది. తక్కిన చిన్నచిన్న దేవుళ్ళ విగ్రహాలు, ఆలయాలు కూడా ఆలయప్రాంగణంలో ఉంటాయి. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. భక్తులు స్నానం చేయడానికి “తీర్థం” లేదా “పుష్కరిణి” ఆలయ సమీపంలో ఉంటుంది. ప్రసిధ్ధ పుణ్యక్షేత్రాలు, దేవాలయాల చెంత “పుణ్యతీర్థాలు” ఉంటాయి. దైవానికి కాక జలానికి ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను సాధారంగా “పుణ్యతీర్థా” అంటారు.

ప్రాచీన కాలంనుంచీ ఆంధ్రదేశం శిల్పకళకు, చిత్రకళకు, వాస్తుకళకు, పుణ్యక్షేత్రాలకు, ఇలా మన ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి నేడు మనకు ఉన్న పుణ్యక్షేత్రాలు – దేవస్థానాలు కూడ ఒక సాధనంగా ఉపకరిస్తున్నాయి. శిధిలప్రాయమయిన దేవలయాల్లో కూడ నేటికి పుజా పునస్కారాలు జరుగుతునే ఉన్నాయి. భగవంతుడి మీద ఉన్న భక్తి విశ్వాసాలు దీనికి ప్రత్యక్ష కారణాలైతే, నాటి విగ్రహ శిల్పసౌందర్యాన్నీ, దేవాలయ నిర్మాణాన్ని మట్టిపాలు చేసుకోలేక, నాటి ఆంద్రమహా వైభవాన్ని గుర్తుచేసుకొని వాటిని పునరుద్ధరించాలనే మహదాకాంక్ష ప్రరోక్ష కారాణంగా కనిపిస్తుంది.

ఎన్నో దేవాలయాలు పరమత ద్వేషం వల్ల మట్టిపాలయ్యాయి. పోయినవి పోగా ఉన్న వాటినైనా నిలుపుకొని వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. అది మనందరి కర్తవ్యం.

నేడున్న దేవాలయాలను దర్శంచి మనంతా గర్వపడాలి. వీటి సందర్శనం పూర్వ జన్మ సుకృతమనే చెప్పాలి. అదొక మహాభాగ్యం అట్టి మహాద్భాగ్యం కోసమే మనం “తీర్థయాత్రలు” చేయాలి. ఇది ప్రతియొక్కరి ధర్మమని హిందువుల విశ్వాసం.

తీర్థ యాత్రలవల్ల ఆయాప్రాంతాల, అయా ప్రాంతాల జనుల పరిచయం ఏర్పడుతుంది. తద్వారా భావసమైక్యత, దేశ సమైక్యత ఏర్పడుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What is a temple?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0