We will take up the process of promotions and transfers in another two or three days
మరో రెండు,మూడు రోజులలో ప్రమోషన్లు,బదిలీల ప్రక్రియ చేపడతాము:బొత్స సత్యనారాయణ
పదవ తరగతి అడ్వాన్స్ సప్లి ఫలితాలు విడుదల చేసిన ఆయన ఈ సందర్భంగా బదిలీల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా విలీన ప్రక్రియలో అవరోధాలు ఉన్న వాటిని 4 మెన్ కమిటీ ద్వారా పరిష్కారానికి కృషి చేస్తాము అన్నారు. ఇప్పటికే 8232 SGT పొష్టుల ప్రమోషన్ కొరకు ఆమోదం తెలిపామని, ప్రక్రియ మొదలపెట్టి వేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఏ పాఠశాల మూత పడదని,కొంత మంది చేస్తున్న అసత్య ప్రచారంలో నిజం లేదని సృష్టం చేసారు.
ఐచ్ఛిక సెలవులపై గందరగోళం
ఉపాధ్యాయుల ఐచ్ఛిక సెలవులపై ఎస్సీఈఆర్టీ మంగళవారం ఇచ్చిన ఉత్తర్వులను మారుస్తూ బుధవారం మరో ప్రకటన విడు దల చేసింది. 5 ఐచ్ఛిక సెలవులు కేవలం ఉపాధ్యాయులు మాత్రమే వాడుకోవాలని, విద్యార్ధులకు సెలవులు ఇవ్వకూడదని వాట్సాప్ ద్వారా ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా ఐచ్ఛిక సెలవులను స్కూల్ మొత్తానికి వాడుకోవచ్చని వాట్సాప్ ద్వారా సందేశం ఇచ్చారు. గందరగోళంగా ఒక నిర్ణయం తీసుకోవడం, ఉపాధ్యాయ సంఘాలు అడిగితే మళ్లీ నిర్ణయం మార్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధ | వారం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో ఆప్షనల్ హాలిడేస్ పై చాలామంది టీచర్స్, టీచర్స్ యూనియన్స్, ప్రజా ప్రతినిధులు రిక్వెస్ట్ చేయడం జరిగిందని, అన్నీ పరిశీలించిన మీదట ఆప్షనల్ హాలిడేని పాఠశాల మొత్తానికి వినియోగించుకోవడానికి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఏదేని అకడమిక్ క్యాలెండర్ లోని హాలిడేస్లలో మార్పులు చేర్పులు, ప్రభుత్వం ఇచ్చే అధికారపు సెలవులను పరిగణనలోకి తీసుకొని వినియోగించుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు.
0 Response to "We will take up the process of promotions and transfers in another two or three days"
Post a Comment