Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Dasara Holidays

 AP Dasara Holidays : ఏపీలో ' దసరా ' సెలవులు ఇవే ! తెలంగాణ కంటే తక్కువే !

AP Dasara Holidays

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది 11 రోజులపాటు దసరా సెలవులు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. అయితే క్రిస్టియన్‌ మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబరు 1 నుంచి 6 వరకు ఇవ్వనున్నారు.

అంటే కేవలం 6 రోజులు మాత్రమే సెలవులు ఇవ్వనున్నారు. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్(2022-23)లో దసరా హాలీడేస్ గురించి ముందుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం మొత్తంలో 220 రోజులు పాఠశాలలు పనిచేస్తాయని, 80 రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది.

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇవే.

  • ఈ ఏడాది విద్యార్థులకు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబరు 6 వరకు దసరా సెలవులు.
  • క్రిస్టియన్‌ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వ తేదీ వరకు ఇస్తారు.
  • క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ ఇస్తారు.
  • సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ప్రకటించింది.

తెలంగాణలో దసరా సెలవులు ఇలా.
తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలకు ఈ సారి 16 రోజులపాటు దసరా సెలవులు రానున్నాయి. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు మొత్తం 14 రోజులు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అలాగే ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి మొత్తం 16 రోజులు సెలవులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇవే

  • సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు దసరా సెలవులు (14రోజులు). బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి మొత్తం 16 రోజులు సెలవులు.
  • క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.
  • జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు
  • వేసవి సెలవులు ఏప్రిల్ 25, 2023 నుంచి జూన్‌ 11, 2023 వరకు.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆●●◆◆◆●◆◆

దసరా సెలవులు

ఈ నెల 26వ తేదీ (సోమవారం) నుండి అక్టోబర్ 6వ తేదీ (గురువారం) వరకు 11 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ముందురోజు కానీ (శనివారం) లేదా 7వ తేదీన (శుక్రవారం) కానీ CL / EL / HPL వాడుకొనుటకు అవకాశం లేదు.

RC No: 10324, Dated: 07-11-1969 ప్రకారం ప్రకటించబడిన సెలవులు 10 రోజుల కంటే తక్కువ మరియు 15 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉన్న యెడల అత్యవసర పరిస్థితులలో / అవసరమైన సందర్భంలో పాఠశాల మూసివేసే రోజు లేదా తెరిచే రోజు ఏదో ఒకరోజు హాజరైనా సరిపోతుంది.

కానీ,  ఈసారి ప్రకటించిన సెలవులు 11 రోజులు (25వ తేదీ ఆదివారంతో కలిపి 12 రోజులు) ఉన్నందున,  పాఠశాల మూసివేసే రోజు లేదా తెరిచే రోజు ఏదో ఒకరోజు సెలవు వాడుకొనుటకు అవకాశం లేదు.  రెండు రోజులూ పాఠశాలకు తప్పనివరక*

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Dasara Holidays"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0