Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Confusion over employee benefits

ఉద్యోగుల భత్యాలపై గందరగోళం

Confusion over employee benefits

  • ఖజానాశాఖ ఉత్తర్వులతోఉద్యోగుల్లో ఆందోళన
  • ఉన్నతాధికారులను సంప్రదించిన నేతలు
  • జీతాలకు ఇబ్బంది లేకుండా చూస్తామన్న డైరెక్టర్ 

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగు లకు కొత్త వేతన స్కేళ్ల అమలు మొదలై నెలలు. దాటిపోతున్నా ఇప్పటికీ వారికి అదనపు భత్యాల పెంపు ఉత్తర్వులు రాలేదు. ఉద్యోగుల భత్యాలకు సంబంధించి జీవో 101 వెలువరించినా జీవోలో కొన్నింటి ప్రస్తావన లేదు. వివిధ ప్రభు త్వశాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు వేర్వేరు భత్యాలు ఉన్నాయి. వాటి గురించి 101 జీవోలో పేర్కొనకపోవడంతో వాటి చెల్లింపులపై గందరగోళం ఏర్పడింది. ఇలాంటివి దాదాపు 20 రకాల భత్యాలు ఉన్నాయని సమాచారం. వీటికి ఆయా ప్రభుత్వశాఖలు ఆర్థికశాఖ నుంచి అను మతి తీసుకోవాలని, అంతవరకూ వాటి చెల్లిం పులు చేయవద్దని తాజాగా ఖజానా శాఖ డైరెక్టర్ కిందిస్థాయి అధికారులకు మెమో జారీచేయడంతో కొంత గందరగోళం ఏర్పడింది. అలాంటి అద నపు భత్యాలతో సమర్పించిన జీతాల బిల్లులు ఆమోదించవద్దనీ అందులో సూచించారు. దీంతో కొందరికి సెప్టెంబరు జీతాలు చెల్లింపులకు ఇబ్బం దులు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తమయింది.

ఇంతవరకు 20 రకాల భత్యాలకు సంబంధించి 2022 పే స్కేళ్ల ప్రకారం, కొత్త పీఆర్సీ సిఫార్సుల ప్రకారం జీవోలు వెలువరించలేదని గుర్తించారు. అన్ని ప్రభుత్వశాఖల డ్రైవర్లకు రూ.500 చొప్పున భత్యం ఇస్తూ వచ్చారు. 2015 డిసెంబరు 11న ఇచ్చిన 171 జీవో ప్రకారం ఈ భత్యం ఇచ్చినా, తాజాగా 2022 పీఆర్సీ తర్వాత ఉత్తర్వులు రాలేదు. టైపిస్టులు, స్టెనోగ్రాఫర్లకూ ప్రత్యేక భత్యం ఉంది. పోస్టుమార్టం అటెండెంట్, స్వీప ర్లకు ప్రత్యేక భత్యం ఇచ్చేవారు. షరాఫ్, క్యాషి యర్, ఇతర మినిస్టీరియల్ సిబ్బంది (2008 పే స్కేళ్లలో 10,900 నుంచి 31550 వేతన స్కేలు ఉన్నవారు) నగదు నిర్వహణ చేస్తుంటే వారికి ప్రత్యేక భత్యం ఉండేది. ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రేడ్ 2 భాషా పండితులు ఉన్నత తరగతులకు పాఠాలు చెబుతున్నందున, ఏకోపాధ్యాయ పాఠశా లల్లో ప్రధానోపాధ్యాయులుగా ఉన్నవారికి, ఈఎస్ ఐలో వంద పడకల కన్నా తక్కువ ఉన్న అస్ప త్రుల సూపరింటెండెంట్లకు, వాణిజ్య పన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్లు, సర్వీసు విభాగం అసిస్టెంటు కమిషనర్లకు ప్రత్యేక భత్యాలు ఇచ్చే వారు. ఉప ఖజానా అధికారులు, ఖజానా కార్యాల యాల్లో అకౌంటెంట్లు, హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సు లకూ ఇలాంటి భత్యాలున్నాయి. వీటికి సంబం దించి 2022 పీఆర్సీ తర్వాత పెంచిన మొత్తాలతో ఉత్తర్వులు వెలువడలేదు.

అదనపు భత్యాల గురించి ఖజానా శాఖ డైరె క్టర్ ఇచ్చిన ఉత్తర్వులపై గందరగోళం ఏర్పడి ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఏపీ ఎన్జీవో సంఘం నేతలు రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతా ధికారులు ఎస్ఎస్ రావత్, చిరంజీవి చౌదరిలను కలిసి సమస్య తెలియజేశారు. దీంతో ఖజానా శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిపై ఖజానా శాఖ సంచాలకులు మోహన్రావును "ఈనాడు" ప్రశ్నించగా ఉద్యోగుల జీతాలు చెల్లింపు లకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నా మని చెప్పారు. ఇతర అలవెన్సులపై ఉత్తర్వులు రావాల్సి ఉందని, ఆ ప్రక్రియ కొనసాగుతోందనిచెప్పారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Confusion over employee benefits"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0