-Description of what to do if you want to act in Jabardasth on TV entertainment channel
E-TV ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో జబర్దస్త్ లో నటించాలని ఉందా ఏంచేయాలో వివరణ.
ఈటీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో జబర్దస్త్ కార్యక్రమం ఎంత ప్రజాదరణ పొందిందో మీకు తెలిసిందే. వినోద ఛానెల్స్‌లో నిరంతరం కొత్త షోస్, ఈవెంట్స్‌తో ఈటీవీ ఇంటింటి టీవీగా మారింది. ఈటీవీ 27 వసంతాల ప్రస్థానంలో మీ అందరి సహకారం మరువలేనిది. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించటంలో ఈటీవీ పెట్టింది పేరు. వందలమంది సింగర్స్‌ను, ఆర్టిస్టులను ఈటీవీ పరిచయం చేసిన విషయం విదితమే. కొత్తవారికి ఈటీవీ వేదికపై అవకాశం కల్పించేందుకు మరోమారు మీ అందరి సహకారం కోరుతున్నాము.
![]() |
నా స్టూడెంట్ హైపర్ ఆది |
మీరు చేయాల్సిందల్లా...
ఈటీవీ జబర్దస్త్ గురించి, అందులో ఆర్టిస్టులు, వారి స్కిట్స్, నవ్వులు పూయించే పంచ్‌లు, బాడీ లాంగ్వేజ్, డైలాగుల్లో టైమింగ్, రైమింగ్ వంటివి ఆ షోకు ప్రత్యేకతను తీసుకుని వచ్చాయి. ఆ షోలో నటించటానికి తగిన అర్హతలు ఉన్నవారు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ఉన్నారు. అలాంటి వారికి మనం అవకాశం కల్పిద్దాం. మీమీ ప్రాంతాల్లో అటువంటి వారు ఎవరు ఉన్నారో గుర్తించండి. స్థానికంగా స్కూల్ డే, కాలేజ్ డే ఫంక్షన్స్‌లో, బర్త్ డే ఈవెంట్స్ వంటి వాటిల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు చాలామంది ఉంటారు. సహజ సిద్ధంగా మాటల్లోనే నవ్వులు పండించేంత హ్యూమర్ ఉన్న వారికి కొదవలేదు. మీరు స్థానికంగా అలాంటి వారిని గుర్తించండి. వారు ఏదైనా జోక్ చెప్పటం, పంచ్‌లు వేయటం, చిన్న స్కిట్ చేయటం వంటివి రికార్డు చేసి ఈటీవీ - రామోజీ ఫిలింసిటీకి దిగువ తెలిపిన వాట్సప్ నెంబర్‌కు పంపాలి.
ఆ వర్థమాన ఆర్టిస్టులు గతంలో చేసిన వీడియోలు ఉన్నా ఫర్వాలేదు. వారే రికార్డు చేసి పంపినా, మీరు రికార్డు చేసినా సరే. వాట్సప్ ద్వారా ఆ వీడియోలను మాకు షేర్ చేయండి. అందులో వారి ఫోన్ నెంబర్, పేరు, ఊరు, అడ్రస్ వంటివి తప్పనిసరిగా పేర్కొనాలి. ఎవరైనా ఎంపికైతే వారిని సంప్రదించటానికి ఆ వివరాలు ఉండాలి. గతంలో చేసిన వీడియోలు ఉంటే వాటితో పాటు వారి వివరాలు టైప్ చేసి పంపాలి. కొత్తగా షూట్ చేస్తుంటే ముందుగా తమ వివరాలు చెప్పి ఆపై వీడియో రికార్డు చేయాలి.
20-9-2022 లోపు వీడియోలు పంపాల్సిన వాట్సప్ నెంబర్ 91000-75308
0 Response to "-Description of what to do if you want to act in Jabardasth on TV entertainment channel"
Post a Comment