Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Has anyone sent a message on WhatsApp and deleted it immediately? Find out what that message is

 వాట్సాప్‌లో ఎవరైనా మెసేజ్ పంపి వెంటనే డిలీట్ చేశారా? ఆ మెసేజ్ ఏంటో ఇలా తెలుసుకోగలరు.

Has anyone sent a message on WhatsApp and deleted it immediately?  Find out what that message is

వాట్సాప్‌లో ఎవరైనా మీకు మెసేజ్ పంపి వెంటనే డిలీట్ చేశారా? ఆ మెసేజ్‌లను చదవాలను కుంటున్నారా? ఈ కింది విధంగా ఫాలో అయితే డిలీట్ అయిన ఆ మెసేజ్‌లను సులభంగా తెలుసుకోవచ్చు.

వాట్సాప్ లో ఇప్పటికే మెసేజ్ డిలీటెడ్ ఫీచర్ ఉంది. యాప్‌లోని ఏదైనా మెసేజ్ పంపిన రెండు రోజుల తర్వాత కూడా డిలీట్ చేసేందుకు ప్లాట్‌ఫారమ్ యూజర్లను అనుమతిస్తుంది. మెసేజ్ డిలీట్ చేసినట్టుగా రిసీవర్‌కు తెలిసేలా యాప్ చాట్‌లో ” డిలీటెడ్ ” అనే మెసేజ్ కూడా కనిపిస్తుంది. ఇంతకీ వాట్సాప్‌లో ఏ మెసేజ్ పంపారు? ఎందుకు డిలీట్ చేశారు అనేది తెలియకపోవచ్చు. ఆ మెసేజ్ ఏమై ఉంటుంది అనేది ప్రతిఒక్కరికి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.

తప్పిదాన్ని గుర్తించిన తర్వాత మళ్లీ మెసేజ్

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఈ "Delete Message" ఫీచర్‌ను అందిస్తున్నాయి. యాప్ డిలీట్ చేసిన మెసేజ్ గురించి రిసీవర్‌ని ఎప్పటికీ అలర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది? పంపిన మెసేజ్ ఏమిటి? ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? అనేది వివరించాల్సిన అవసరం లేదని వాట్సాప్ అభిప్రాయం. యూజర్లు పంపిన మెసేజ్ తప్పిదాన్ని గుర్తించిన తర్వాత మళ్లీ మెసేజ్ పంపడానికి WhatsApp ఈ ఫీచర్‌ను అందించింది.

ఆ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి

మీరు ఈ వాట్సాప్ ఫీచర్‌ విషయంలో అసంతృప్తిగా ఉన్నారా? మీకు ఇతరులు పంపి డిలీట్ చేసిన అన్ని మెసేజ్‌లను చదవాలనుకుంటున్నారా? ఈ కింది విధంగా ఫాలో అయితే డిలీట్ చేసిన మెసేజ్‌లను సులభంగా తెలుసుకోవచ్చు. అందుకోసం మీరు Google Play Store ద్వారా థర్డ్ పార్టీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ అదేలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

డిలీట్ మెసేజ్‌లను ఇలా చూడొచ్చు

  • Google Play Store నుంచి "Get Deleted Messages" యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
  • మీరు ఇప్పుడు యాప్‌కి కొన్ని Allow పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
  • WhatsAppలో మెసేజ్ డిలీట్ చేసినప్పుడల్లా మీరు ఈ యాప్ ద్వారా ఆ మెసేజ్ ఏంటో చూడవచ్చు.
  • థర్డ్ పార్టీ యాప్ మీ ఫోన్ నోటిఫికేషన్‌ల ప్యానెల్ నుంచి ఏదైనా పంపినవారి మెసేజ్‌లను ట్రాక్ చేస్తుంది. ఆపై మీకు ఆ మెసేజ్ కూడా చూపిస్తుందని గుర్తించుకోండి.
  • మీరు నోటిఫికేషన్‌లకు Allow ఇవ్వవలసి ఉంటుంది. మీరు ఒక యూజర్ WhatsApp చాట్‌ని ఓపెన్ చేసినప్పుడు అందులో ఏదైనా మెసేజ్ డిలీట్ అయితే మీరు చదవలేరని గుర్తించుకోండి.
  • ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ యాప్ మీ WhatsAppలో ఉన్న వెంటనే నోటిఫికేషన్ నుంచి మెసేజ్‌లను డిస్‌ప్లే చేస్తుంది. మెసేజ్‌లు డిలీట్ అయిన తర్వాత అవి WhatsAppలో కనిపించవు.
  • కానీ, మీరు వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను "Get Deleted Messages" యాప్‌లో మాత్రం చూడవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Has anyone sent a message on WhatsApp and deleted it immediately? Find out what that message is"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0