Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Our movement will not stop. OPS should be discussed

మా ఉద్యమం ఆగదు. ఓపీఎస్ పైనే చర్చలు జరపాలి.

Our movement will not stop.  OPS should be discussed
  • తప్పుడు కేసులు, నిర్బంధాలతో ఉద్యోగులను భయపెట్టడం సరికాదు
  • సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల ధ్వజం
  • జీపీఎస్ కు అంగీకరించేది లేదు

 ఉద్యోగులను నిర్బంధించి భయపెట్టాలనుకోవటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘాల నేతలు పేర్కొన్నారు. సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాల ఆవేదన, ఆందోళనలను చూసి తాత్కాలికంగా ఆందోళనలను వాయిదా వేశామని... అంత మాత్రాన భయపడిపోయినట్టు కాదని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా.. సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ సాధన కోసం ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. మంత్రులతో భేటీ అనంతరం సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ‘‘మా ఉద్యమం ప్రభుత్వంపై యుద్ధం కాదు. మా సమస్యను పరిష్కరిస్తారన్న ఆశతోనే ఆందోళనలు చేస్తున్నాం. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తామంటేనే మాట్లాడతామని గత సమావేశాల్లోనే చెప్పాం. ఓపీఎ్‌సను అమలు చేయాల్సిందే’’ అని తెలిపారు. మీడియాతో వారేమన్నారంటే....

ఓపీఎ్‌సకు మాత్రమే ‘ఎస్‌’

ఓపీఎస్‌ అమలుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలలో సీపీఎస్‌ రద్దు చేసినట్టుగానే ఇక్కడా తీర్మానం చేయాలి. ఉద్యమాన్ని భగ్నం చేసేందుకు వేలాదిమంది ఉద్యోగులపై క్రిమినల్‌ కేసులు పెట్టి భయాందోళనలకు గురి చేయడం దుర్మార్గం. మేము దొంగతనంగా చలో విజయవాడకు పిలుపు ఇవ్వలేదు. ప్రభుత్వానికి చెప్పాం. మంత్రులకు కూడా చెప్పాం. అయినప్పటికీ... తెలియక కేసులు పెట్టామనడం బాధాకరం. మేము సీఎం ఇంటి ముట్టడికి పిలుపు ఇవ్వకపోయినా.. ముట్టడి చేస్తున్నట్టుగా కేసులు పెట్టారు. ఇది పద్దతి కూడా కాదు! మీరు మాకు ఇచ్చిన హామీని అమలు చేయండి మహాప్రభో అని ర్యాలీ ద్వారా చెప్పాలనుకుంటే... మా ఉద్యోగులను అత్యంత దారుణంగా నిర్బంధించారు. ఉద్దేశపూర్వకంగా కేసులు పెడితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎన్ని చర్చలు జరిగినా... పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలన్నదే మా డిమాండ్‌. ఓపీఎస్‌ సాధన కోసం మా ఉద్యమాలు నిరంతరం సాగుతాయి 

కె.పార్థసారథి, ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

జీపీఎ్‌సపై చర్చలకు పిలవొద్దు

సీపీఎస్‌ మీద కాకుండా ఓపీఎస్‌, జీపీఎ్‌సల మీద చర్చిద్దామని మంత్రి బొత్స పిలిస్తేనే చర్చలకు వెళ్లాం. లోపలికి వెళ్లిన తర్వాత మళ్లీ జీపీఎస్‌ మీదే మాట్లాడుతున్నారు. జీపీఎస్‌ ట్రాక్‌లోకి వస్తే వెసులుబాట్లకు సిద్ధమని మంత్రులు చెప్పారు. మీరే ఓపీఎ్‌సలోకి వస్తే ఒకటి, రెండు సర్దుబాట్లకు సిద్ధమని మేం చెప్పాం. పాత పెన్షన్‌ విధానంలోకి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదన్నారు. డీఆర్‌, ఫిట్‌మెంట్‌ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈ మాత్రానికి ఎందుకు పిలవటం అని ప్రశ్నించాం. ఇప్పుడు జరుగుతున్న విధానంలోని అంశాలనే సరిగా అమలు చేయలేకపోతున్నారని, ఎన్‌ఎ్‌సడీఎల్‌లో గత ఏడేళ్లుగా చెల్లించాల్సిన సొమ్ము చెల్లించలేదని చెప్పారు. 2019 నుంచి ప్రభుత్వ షేర్‌ 10 నుంచి 14 శాతం పెంచామంటున్నా ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని గుర్తు చేశాం. కొత్తగా మరో విధానాన్ని తీసుకొచ్చి, దానిని చక్కగా అమలు చేస్తామనడం, అది బాగుంటుందని చెప్పడంలో అర్థం లేదన్నాం. జీపీఎ్‌సపై మళ్లీ చర్చలకు పిలవద్దని చెప్పాం. ఒకటి రెండు రోజులలో అధికారికంగా మీటింగ్‌ పెడతామని అంటున్నారు. సెప్టెంబరు 1న సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఆయన ఇంటి మీద దాడి చేయడానికి కాదు. మాపై అక్రమ కేసులను బనాయించారు. 

దాసు, ఏపీసీపీఎ్‌సయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

పై వాళ్లు చెబితేనే చేశామంటున్నారు

2016 నుంచి 2021 వరకు సీపీఎస్‌ రద్దు కోసం ఆందోళనలు చేస్తూనే ఉన్నాం. మధ్యలో 2019లో సీఎం హామీ ఇచ్చారు కాబట్టి  చేస్తారులే, ఒత్తిడి తీసుకురావటం బాగోదని వేచి చూశాం. తర్వాత కరో నా వల్ల ఇళ్ల దగ్గరే, జిల్లాల స్థాయిలో ఆందోళనలు చే శాం. సీపీఎస్‌ రద్దు కాకపోతే బలిపశువులమవుతామనే 3 నెలల ముందే ‘చలో విజయవాడ’ ప్రకటిం చాం. ఇదే సమయంలో మరో సంఘం ‘సీఎం ఇంటి ముట్టడి’కి పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో మా సంఘ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. కేసులు, బైండోవర్లు, నిర్బంధాలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడినైనా నాకే ‘సీఎం ఇంటి ముట్టడి’కి ప్రణాళిక రచిస్తున్నట్లు పోలీసులు నోటీసు ఇచ్చారు. దీని గురించి ప్రశ్నిస్తే... ‘మా చేతిలో ఏమీ లేదు సార్‌. మా పైవాళ్లు చేయమంటే చేశాం’ అన్నారు. సెప్టెంబరు 11న కూడా పోలీసులు అనుమతిస్తేనే.. కార్యక్రమం చేస్తాం. మాకు సంబంధం లేని కార్యక్రమంపై కేసులు పెట్టారని, వాటిని ఎత్తి వేయాలని మంత్రి బొత్సకు విజ్ఞప్తి చేశాం. 

ఆర్‌.అప్పల్రాజు, ఏపీసీపీఎ్‌సఈఏ అధ్యక్షుడు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Our movement will not stop. OPS should be discussed"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0