Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Let's find out how many benefits of eating cloves.

 లవంగాలను తినడం వలన ఎన్ని ఉపయోగలో తెలుసుకుందాం.

Let's find out how many benefits of eating cloves.
Health Tips : స్వదేశం నుండి విదేశం వరకు ప్రతి ఇంట తమ వంటకాలలో లవంగాలను ఉపయోగిస్తూ ఉంటారు. లవంగం నుండి వచ్చే వాసన మరియు ఘాటు మన వండే వంటకాల్లో రుచులను కూడా మార్చేస్తుంది. లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇటువంటి లవంగాలు ఉపయోగించడం ద్వారా ఇంకా ఎటువంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం. 

లవంగాలని వంటకాలతో పాటు, కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడతారు. లవంగాలు మంచి సువాసనను ఇవ్వడమే కాకుండా, వైద్య విలువలు కూడా ఉన్నాయి. లవంగం నూనెని పంటి నొప్పికి మందుగా వాడతారు. లవంగం వల్ల పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. లవంగాల్ని పొడిగా చేసి దెబ్బ తిన్న పన్ను దగ్గర, పాడైన చిగుళ్లకి పెడితే అది మందులా పనిచేసి నొప్పిని తగ్గించేస్తుంది.

అందుకే టూత్‌ పేస్ట్ తయారీలో ఎక్కువగా లవంగాలను ఉపయోగిస్తారు. రోజుకు ఒక లవంగాను నవలడం ద్వారా నోటి దుర్వాసన సమస్యలు కూడా చెక్ పెట్టవచ్చు. 

ఇక లవంగాల వల్ల పురుషులకు చాలా మేలు జరుగుతుంది. అనేక లైంగిక సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుంది. లవంగాల్లో కాల్షియం, ఐరన్‌, మెగ్నిషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి మినరల్స్‌ ఉంటాయి. ఇవి పురుషుల్లో లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి. రోజూ ఉదయాన్నే పరగడుపునే 3 లవంగాలను అలాగే నమిలి తినాలి. దీంతో శృంగార జీవితం మెరుగు పడుతుంది. లవంగాలను తినడం వల్ల పురుషుల్లో వచ్చే అనేక సమస్యలు తగ్గుతాయి. లవంగాలను తింటే వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అయితే లవంగాలను రోజుకు మూడు కన్నా ఎక్కువ తినరాదు. తింటే టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌పై ప్రభావం పడుతుంది. 

లవంగాలను తినడం వలన కడుపులోని సమస్యలు తగ్గడమే కాకుండా. గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగంలో ఉన్న యూజీనాల్ ఒత్తిడి, సాధారణ కడుపు వ్యాధుల నుంచి ఉపశమనానికి సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా … విటమిన్ ఇ, విటమిన్ సి, ఫోలేట్, రిబోఫ్లేవిన్, విటమిన్ ఎ, థియామిన్, విటమిన్ డి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో పాటు ఇతర శోథ నిరోధక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది

అధిక బరువు, హార్మోన్ ఇన్ బ్యాలెన్స్, ఓవరీస్లో నీటి బుడగలు వంటి సమస్యలు బాధపడేవారు లవంగాలను తమ ఆహారంలో తీసుకోవడం ద్వారా మంచి ఉపశమనాన్ని పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు.

తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు లవంగా, దాల్చిన చెక్క మజ్జిగలో కలిపి తీసుకోవడం ద్వారా తలనొప్పి వంటి సమస్య నుండి ఉపశమనం పొందుతారు. లవంగాలలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారు రోజుకు ఒక లవంగాలు తీసుకోవడం ద్వారా మధుమేహ సమస్య నుండి ఉపశమనం పొందుతారు. క్యాన్సర్ తో బాధపడుతున్న వారు రోజుకు ఒక లవంగాలను ఉపయోగించడం మంచిదని ఆయుర్వేదం వైద్యులు తెలుపుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Let's find out how many benefits of eating cloves."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0