Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

హైస్కూల్ ప్లస్ లలో PGT నియామక అర్హతలు, ఇతర వివరాలు క్లుప్తంగా.

        

 అక్కడ మీకు అర్హతలుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. ప్రొఫెషనల్ అర్హతలుగా సంబంధించిన సబ్జెక్టులో బిఈడి వుండాలి.

ఖాళీగా ఉన్న ఎస్జీటీ పోస్టులను పీజీటీలుగా అప్ గ్రేడ్ చేసే ప్రక్రియ పూర్తయిన తర్వాత సదరు పోస్టులను వీటికి కేటాయింపు చేస్తారు.

అర్హతలు ఉన్న స్కూల్ అసిస్టెంట్ల నుండి పీజీటీగా పనిచేయటానికి విల్లింగ్  రీతీసుకుంటారు. తదుపరి మాత్రమే వర్క్ ఆర్డర్ ఇస్తారు.

అప్గ్రేడెడ్ స్కూల్లో ఉన్న అర్హత గల స్కూల్ అసిస్టెంట్లు పిజిటిగా కనుక పనిచేస్తే వారు వారికి ఉన్న తరగతులతో పాటు 11వ తరగతి కూడా కేటాయిస్తారు.

సదరు పాఠశాలలో అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ లభించకపోతే సంబంధిత అధికారి దగ్గరలో ఉన్న మండలంలోని లేదా డివిజన్లోని పాఠశాలల నుండి నియమించవచ్చు.

సదరు పాఠశాలను ఒకే సబ్జెక్టుకి సంబంధించి ఇరువురు ఉపాధ్యాయులు కనుక ఉంటే సంబంధిత హెచ్ఎం వారికి పని విభజన చేయవలసి ఉంటుంది.

ఎస్జీటీలను పిజిటిలుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందిన తరువాత ప్రస్తుత వేతనం స్కేలులో ఒక ఇంక్రిమెంట్ అదనంగా చెల్లించబడుతుంది. 

ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియలో మహిళా ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది వారు లభించని పక్షంలోనే పురుషోపాధ్యాయులకు వర్క్ ఆర్డర్ ఇస్తారు. 

తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అప్గ్రేడ్ అయిన స్కూలుకి ప్రస్తుతం ఉన్న హెచ్ఎం గారే ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తారు. ఎప్పటికీ అక్కడ ప్రిన్సిపల్ పోస్ట్ ఉంటే ప్రస్తుత ప్రిన్సిపల్  కొనసాగుతారు.

 అకడమిక్ సంవత్సరానికి ఇంటర్మీడియట్ బోధనకు మరియు పరీక్షల నిర్వహణకు అనుమతి తీసుకొనవలసి ఉంటుంది.

డీఈఓ లందరూ వారి జిల్లాలో ఉన్న ఉపయోగించని వెకెంట్ ఎస్జీటీ పోస్టులను అప్గ్రేడ్ చేసే నిమిత్తం మేనేజ్మెంట్ వారిగా 10 రోజులలోపు  సి.ఎస్.ఈ. వారికి తెలియపరచవలెను.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0