Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration

Success Story : ఒకప్పుడు గాజులమ్మాడు , ఇప్పుడు IAS ఆఫీసర్ అయ్యాడు. మహారాష్ట్ర యువకుడి సక్సెస్ స్టోరీ.

Inspiration

 క్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటు ఆ లక్ష్యం కోసం పట్టుదలతో కృషి చేస్తే సక్సెస్ సొంతమవుతుందని నిరూపించాడు మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన ఒక వ్యక్తి.

టార్గెట్‌కు సరైన రోడ్‌మ్యాప్ ఉంటే.. ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్యాన్ని ఛేదించవచ్చని చెబుతున్నాడు రమేశ్ ఘొలప్ (Ramesh Gholap). ఒకనాడు కుటుంబం కోసం గాజులు అమ్మిన(Bangle seller)ఆ వ్యక్తి.. ఇప్పుడు ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్‌(IAS-Office)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎంతో మంది సివిల్స్ ఆస్పిరెంట్స్‌కు, యూత్‌కు ఆదర్శంగా నిలుస్తున్న రమేశ్ సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం.

టాలెంట్ ఎవరి సొత్తు కాదు.

మహరాష్ట్రలోని పుణేకు చెందిన రమేశ్ ఘొలప్ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి గాజులమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. తండ్రి అనారోగ్యంతో మరణించగా, ఆయన అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని నిరుపేద కుటుంబం వీరిది. ఈ క్రమంలో కుటుంబ భారం తల్లిపైన పడింది. చిన్నప్పుడు రమేశ్ సైతం తల్లితో కలిసి గాజులమ్మాడు. అయితే పోలియో కారణంగా అతడి ఎడమ కాలు పని చేయకుండా పోయింది. అలా దివ్యాంగుడిగా మారినా, రమేశ్ గాజులమ్మి తన కుటుంబం కోసం శ్రమించాడు. తల్లితో కలిసి పని చేస్తూనే తన చదువులపై శ్రద్ధ వహించాడు.

పడి లేచిన కెరటంలా 

తన తల్లి, అన్న కూడా గాజులు అమ్ముతూ కుటుంబ బాధ్యతలు చూసుకునేవారు. దీంతో రమేశ్ ఉన్నత చదువుపై శ్రద్ధ వహించాడు. తన మామయ్య ఊరు బర్సికి వెళ్లి అక్కడ చదువుకున్నాడు. ఇంటర్‌లో 88 శాతం మార్కులు సంపాదించిన రమేశ్.. ఆ తర్వాత టీచింగ్‌లో డిప్లొమా చేసి సొంత ఊర్లోని స్కూల్‌లోనే టీచర్‌గా మారాడు. ఇక ఆ తర్వాత రమేశ్ తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నాడు. టీచింగ్ చేస్తూనే బీఏ డిగ్రీ పూర్తి చేసిన రమేశ్.. యూవీఎస్సీలో బెస్ట్ ర్యాంక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

దివ్యాంగుల కోటాలో

ఇలా ఆరు నెలల పాటు ప్రిపేర్ అయి 2010లో యూపీఎస్‌సీ (UPSC) ఎగ్జామ్ అటెమ్ట్ చేశాడు రమేశ్. ఎలాంటి కోచింగ్ లేకుండా పరీక్ష రాయగా, క్వాలిఫై కాలేకపోయాడు. అప్పుడు రమేశ్ తల్లి ఊరిలో కొంత డబ్బు అప్పు చేసి మరీ రమేశ్‌ను కోచింగ్‌కు పంపించింది. ఇలా సబ్జెక్ట్స్‌పై పట్టు సాధించి, 2012లో 287వ ర్యాంక్ సాధించి యూపీఎస్‌సీ క్లియర్ చేశాడు. దివ్యాంగుల కోటాలో ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం సంపాదించాడు.

ఒడిదుడుకుల్ని తట్టుకొని

ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదల, అంకిత భావంతో కష్టపడి చదువు తను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాడు రమేశ్. ఇతడి స్ఫూర్తితో సివిల్ ఆస్పిరెంట్స్, యువత ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలని రమేశ్ తల్లి, అతడి ఊరివాళ్లు చెప్తున్నారు. ఒకనాడు గాజులమ్మిన వ్యక్తి ఇప్పుడు ఒక జిల్లాకు బాస్ కావడం గర్వంగా ఉందని రమేశ్ తల్లి, అన్న అంటున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా వాటిని రమేశ్ అధిగమించాడని అతడి తల్లి చెప్తోంది. రమేశ్ కష్టం వృథా కాలేదని, అతడు పడ్డ శ్రమకు ఫలితం దక్కిందని ఆమె హర్షం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు తనలాంటి ఎంతోమందికి మోటివేషనల్ క్లాసులు చెబుతూ, వారికి సివిల్స్‌ గైడెన్స్ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు రమేశ్.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inspiration"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0