Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Another 8 thousand schools are single teachers!

మరో 8 వేల పాఠశాలల్లో ఏకోపాధ్యాయులే!


  • రేషనలైజేషన్తో పొంచి ఉన్న ప్రమాదం
  • ఇప్పటికే 8 వేల సింగిల్ టీచర్ స్కూల్స్

రాష్ట్రంలో ప్రభుత్వ ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య మరింతగా పెరగనుంది. ఇప్పటికే సుమారు 8 వేల వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు మరో 8 వేల వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు కొత్తగా రానున్నాయి. దీంతో రాష్ట్రంలో సుమారు 16 వేల పాఠశాలలుగా సింగిల్‌ టీచర్‌గా మారనున్నాయి. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలో రేషనలైజేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియలో 8 వేల పాఠశాలలు సింగిల్‌ టీచర్‌కే పరిమితం కాబోతున్నాయని అధికారులు లెక్కలు తేల్చినట్లు తెలిసింది. రేషనలైజేషన్‌లో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 లోపు ఉంటే సింగిల్‌ టీచర్‌నే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిఓ 117ను కూడా విడుదల చేసింది. విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. 5 వేల పాఠశాలలను విద్యాశాఖ విలీనం చేసింది. ఈ పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలకు పంపడంతో మిగతా విద్యార్థుల సంఖ్య 20లోపు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ విలీనం వల్ల సుమారు 4 వేల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20లోపే ఉనుట్లు విద్యాశాఖ తేల్చింది. విలీనం కాని మరో 4 వేల పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య 20 మంది లోపే ఉన్నట్లు గుర్తించింది. దీంతో ఇవి ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్నాయి. ఇప్పటికే ఉన్న 8 వేల పాఠశాలలతో కలిపి మొత్తంగా 16 వేల పాఠశాలలు రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగలనున్నాయి. ఇప్పటికే సింగిల్‌ టీచర్‌ ఉన్న పాఠశాలల్లో బోధన సరిగ్గా సాగడం లేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడు అనారోగ్యం, ఇతర కారణాలతో సెలవులో ఉంటే ఆ పాఠశాలను మూసివేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పాఠశాల విద్యాశాఖ తీసుకొస్తున్న కొత్త కొత్త యాప్‌లలో సమాచారం నమోదు చేసేందుకు ఉపాధ్యాయులు నానా అవస్థలు పడుతూ బోధనపై దృష్టి సారించలేకపోతున్నారు.

ఎంటిఎస్‌ టీచర్లతో సర్దుబాటు

సింగిల్‌ టీచర్‌ పాఠశాలల్లో మినిమం టైమ్‌స్కేల్‌ (ఎంటిఎస్‌) ఉపాధ్యాయులను నియమించి ఏకోపాధ్యాయ పాఠశాలలను ఉంచబోమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. డిఎస్‌సి-1998, 2008లో అర్హత సాధించిన అభ్యర్థులను ఎంటిఎస్‌ విధానంలో విద్యాశాఖ తీసుకుంటోంది. 2008లో అర్హత సాధించిన అభ్యర్థులను ఎంటిఎస్‌ విధానంలో తీసుకుంది కేవలం 2,500 మంది లోపే. ప్రస్తుతం 1998 అభ్యర్థులను తీసుకునే ప్రక్రియ జరుగుతోంది. ఈ రెండింటితో కలిపి 6 వేల మంది కూడా వచ్చే అవకాశం ఉండదని అధికారులే చెబుతునాురు. అయితే వీరందరినీ ఈ పాఠశాలలకే కేటాయిస్తారా? మరోచోట కేటాయిస్తారా? అనే అంశం కూడా తేలాల్సి ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Another 8 thousand schools are single teachers!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0