Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Extension of Oruta Medical Reimbursement deadline for employees

ఉద్యోగులకు ఊరట. మెడికల్ రీయింబర్స్మెంట్ గడువు పొడిగింపు

Extension of Oruta Medical Reimbursement deadline for employees

  • సీఎం జగన్ఆమోదముద్ర 
  • త్వరలో ఉత్తర్వులు

ఉద్యోగులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. మెడికల్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం గడువును వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైల్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదముద్ర వేశారు. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ ఫీజురీయింబర్స్మెంట్ గడువు ఈఏడాది జూలై 31వ తేదీతో ముగిసింది. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) ను పటిష్టంగా అమలు పరచడంతో పాటు ఉద్యోగుల సౌకర్యార్థం మెడికల్ రీయింబర్స్ మెంట్ సౌకర్యాన్ని కూడా కొనసాగించవలసిందిగా రాష్ట్ర సచివాలయ సంఘం, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పలుమార్లు ప్రభుత్వంతో సంప్రతింపులు జరిపింది. పరిశీలన అనంతరం ప్రభుత్వం మెడికల్ రీ యింబర్స్ మెంట్ సౌకర్యాన్ని మార్చి 31 వరకు కొనసాగింపునకు అంగీకరించింది. తాజా గా ముఖ్యమంత్రి ఇందుకు ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఉద్యోగు ల మెడికల్ రియింబర్స్మెంట్ సౌకర్యం కొనసాగింపునకు అంగీకరించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్కు ఆంధ్రప్రదేశ్ గవ ర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాగా ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) అమల్లో ప్రతిబంధకాలు ఎదరువుతున్నాయని ఉద్యోగ నేతలు దృష్టికి తెచ్చారు. నెట్వర్క్ ఆస్పత్రులు వైద్య సేవలకు నిరాకరిస్తున్న సందర్భాలనేకం ఉన్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీని కూడా సీఎం జగన్ గతంలో ఏర్పాటు చేశారు. రీయింబర్స్మెంట్ గడువు పొడిగింపుతో పాటు ఈహెచ్ఎస్ ను పటిష్టంగా అమలు చేయాలని మరోసారి అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సమస్యలపై సత్వరమే ముఖ్యమంత్రి స్పందించటం పట్ల వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రీ యింబర్స్మెంట్ కింద ప్రతినెలా ఉద్యోగుల వేతనాల నుంచి రూ. 200 వరకు, గజెటెడ్ అధికారులు రూ. 300 వరకు జమ చేస్తున్నారు. ఇందుకు గాను రూ. 2లక్షల వరకు ప్రభుత్వం మెడికల్ రీ యింబర్స్మెంట్ కింద రూ. 2లక్షల వరకు చెల్లింపులు జరుపుతోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Extension of Oruta Medical Reimbursement deadline for employees"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0