Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A.P.J.ABDUL KALAM

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్

A.P.J.ABDUL KALAM


(అక్టోబర్ 15, 1931 - జులై 27, 2015 ), 

 రోజు భారత 11వ రాష్ట్రపతి అయిన ఎ.పి.జె. అబ్దుల్‌కలామ్‌ జయంతి. మరి ఆయన గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామా !

అబ్దుల్‌ కలాం 1931 అక్టోబరు 15 తమిళ నాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. అతని పూర్తిపేరు అవుల్‌ పకీర్‌ జైనులబ్దీన్‌ అబ్దుల్‌ కలామ్‌. తండ్రి జైనులబ్దీన్‌, పడవ యజమాని. తల్లి ఆషియమ్మ గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాల కోసం కలామ్‌ చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండటానికి వార్తా పత్రికలు పంపిణీ చేసేవారు. పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవాడు. ఎక్కువ సమయం కష్టపడేవాడు. రామనాథపురం స్క్వార్ట్జ్‌ మెట్రిక్యులేషన్‌ స్కూల్లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలామ్‌ తిరుచిరాపల్లి లోని సెయింట్‌ జోసెఫ్స్‌ కళాశాలలో చేరి, 1954లో భౌతికశాస్త్రంలో, మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్‌ ఇంజినీరింగులో పట్టా పొందారు. కలామ్‌ డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డిఆర్‌డివో) వారి ఏరోనాటికల్‌ డెవెలప్మెంట్‌ ఎస్టాబ్లిష్మెంట్‌ లో శాస్త్రవేత్తగా చేరాడు. కలామ్‌ భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్‌ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు. కానీ డిఆర్‌డివోలో ఉద్యోగం చేయడంతో అతను సంతృప్తి చెందలేదు. తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో (ఇస్రో) చేరి, ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం తయారీలో పనిచేశాడు. 1980 జులైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది. 1970, 1990 మధ్య కాలంలో, కలామ్‌ పిఎస్‌ఎల్‌వి, ఎస్‌ఎల్‌వి-××× ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. ఈ రెండు ప్రాజెక్టులు విజయవంతం అయ్యాయి. ఎస్‌ఎల్‌వి రాకెట్‌ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి. 1992 జులై నుంచి 1999 డిసెంబరు వరకు ప్రధానమంత్రి శాస్త్ర సలహాదారుగా, డిఆర్‌డివో ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్‌ అణు పరీక్షల్లో కలాం రాజకీయ, సాంకేతిక పాత్ర నిర్వహించారు. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి. కలామ్‌ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలోనూ కృషిచేశారు. 2002 నుంచి 2007 వరకు భారత రాష్ట్రపతిగా తన సేవలను అందించాడు. భారతరత్న పొందిన రాష్ట్రపతులలో కలామ్‌ 3వ వారు. ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 1981లో పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌తో సత్కరించింది. 2015 జూలై 27న ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ షిల్లాంగ్‌లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు కలామ్‌ (83) తీవ్ర గుండెపోటుతో కుప్పకూలి మరణించారు.

భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి.

తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. 

తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. 

చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.

భారత రాష్ట్రపతి పదవికి ముందు, 

  • డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) 
  • మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. 
  • భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 
  • 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. 
  • కలాం తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలుసూచించారు. 
  • భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన "భారత రత్న" సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్న మహానీయునికి జోహార్లు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A.P.J.ABDUL KALAM"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0