Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Bank Working Hours

 Bank Working Hours : మారుతున్న బ్యాంకు పని వేళలు . ఇక నుంచి 30 నిమిషాలు ముందుగానే బ్యాంకులు ఓపెన్ . వివరాలు.

Bank Working Hours

 Bank Working Hours: నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్(Bank Account) ఉంటుంది. ఏదో ఒక సమయంలో బ్యాంకులో పని పడటం, వారు బ్యాంకు బ్రాంచుకి వెళ్లడం జరుగుతూనే ఉంటుంది. బ్యాంకులకు వెళ్లే కస్టమర్లకు శుభవార్త. బ్యాంకింగ్‌ పని గంటల పెరగబోతున్నాయి. 5 రోజుల పని విధానం కోసం బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు పని గంటలు పెంచాలని ప్రతిపాదించాయి. ఇండియన్ బ్యాంకు అసోసియేషన్‌(IBA)కు రాసిన లేఖలో.. ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్(AIBEA) పలు ప్రతిపాదనలు చేసింది. దీనిలో రోజులో బ్యాంకింగ్ గంటలు 30 నిమిషాల పాటు పెంచాలని ఈ బ్యాంకింగ్ యూనియన్ ప్రతిపాదించింది. ప్రస్తుతం ప్రారంభమవుతున్న బ్యాంకింగ్ సమయాలను 30 నిమిషాలు ముందుకు జరపాలని పేర్కొంది. అలాగే కస్టమర్ సర్వీసు అవర్స్‌ను కూడా 30 నిమిషాల పాటు పెంచాలని ప్రతిపాదించింది.

ఈ బ్యాంకు ఎంప్లాయీస్ బాడీ పంపిన లేఖలో.. బ్యాంకు పని వేళల(Bank Working Hours)ను ఉదయం 9.15 నుంచి సాయంత్రం 4.45కి మార్చాలని పేర్కొంది. ప్రస్తుతం ఈ పని వేళలు ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల మధ్యలో ఉన్నాయి. అలాగే నగదు లావాదేవీల(Cash Transactions) అవర్స్‌ను కూడా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30కి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల మధ్యలోకి మార్చాలని పేర్కొన్నాయి.

అలాగే నగదు రహిత లావాదేవీల(Non cash Transaction) అవర్స్‌ను మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.45కి మార్చాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. బ్యాంకులలో ఐదు రోజుల పని వారాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ.. తాము ఈ ప్రతిపాదలను పంపినట్టు ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచాలం చెప్పారు. ఈ వర్కింగ్ వీక్‌ను గత ఏడాది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం తమకు కూడా ఈ విధానం కావాలని కోరుతున్నారు.

తాము 30 నిమిషాల పాటు వర్కింగ్ అవర్స్‌(Working Hours)ను పెంచుతూ 5 రోజుల పని విధానాన్ని కోరడంపై ఐబీఏ, కేంద్రం, ఆర్‌బీఐ ఒప్పుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి సమయం నుంచే బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఈ ఐదు రోజుల పని విధానాన్ని డిమాండ్ చేయడం ప్రారంభించాయి. ఆ సమయంలో ఐబీఏ ఆ ప్రతిపాదనను కొట్టివేసింది. కానీ బ్యాంకు ఉద్యోగులకు 19 శాతం వేతన పెంపును చేపట్టింది. ప్రస్తుతం బ్యాంకులు ఆదివారాలతో పాటు రెండో, నాలుగో శనివారాలు సెలవును పాటిస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకు సంఘాలు చేసిన ఈ ప్రతిపాదనలకు కేంద్రం, ఆర్‌బీఐ, ఐబీఏ ఓకే చెబితే.. ఇక నుంచి అన్ని ఆదివారాలు, శనివారాలు బ్యాంకులు మూతపడతాయి. కానీ పని వేళలు పెరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం 9.15కే బ్యాంకులు తెరుచుకుంటాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Bank Working Hours"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0