Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do not give xerox copies of Aadhaar to anyone

ఆధార్ జిరాక్స్ కాపీలు ఎవ్వరికీ ఇవ్వొద్దు

Do not give xerox copies of Aadhaar to anyone

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

కొత్త సిమ్ కార్డ్ కావాలంటే ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి. బ్యాంక్ ఖాతా తెరవాలన్నా ఆధార్ జిరాక్స్ ఇవ్వాల్సిందే. పింఛను కావాలన్నా.. రేషన్ బియ్యం రావాలన్నా.. ఒక్కటేమిటి ప్రతి పనీ ఆధార్ తో లింక్ అయ్యే ఉంది. అయితే, ఎవ్వరికి పడితే వారికి ఆధార్ జిరాక్స్ కాపీలను ఇవ్వవద్దని కేంద్రం హెచ్చరిస్తోంది. అవును, ఏ వ్యక్తులకుగానీ, సంస్థలకుగానీ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వకూడదని, ఇస్తే దానిని దుర్వినయోగం చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సూచించింది. ఈ నెల 27న దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేసింది.

ఆధార్ ను జారీ చేసే యూఐడీఏఐ లైసెన్స్ ఉన్న సంస్థలు మాత్రమే వివిధ వ్యక్తుల సమాచారం పొందేందుకు వాడుకోవచ్చని స్పష్టం చేసింది. లైసెన్స్ లేని హోటళ్లు, సినిమా హాళ్లు, ఇతర ప్రైవేటు సంస్థలు వ్యక్తుల ఆధార్ కార్డుల జిరాక్స్ ను తీసుకునేందుకు వీలు లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ కాదని తీసుకుంటే ఆధార్ చట్టం 2016 ప్రకారం అది నేరమని వ్యాఖ్యానించింది. ఏ సంస్థ అయినా ఆధార్ కోసం డిమాండ్ చేస్తే సదరు సంస్థకు యూఐడీఏఐ నుంచి లైసెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించింది. అంతగా కావాలని పట్టుబడితే యూఐడీఏఐ వెబ్ సైట్ నుంచి చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే ‘మాస్క్ డ్ ఆధార్ కార్డ్’ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.

ఇంటర్నెట్ కేఫెలు, కియోస్క్ లలో ఈ–ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోకూడదని, ఒకవేళ చేసుకున్నా వెంటనే ఆ సిస్టమ్ ను వాటిని పర్మనెంట్ గా (షిఫ్ట్ డిలీట్) చేసేయాలని సలహా ఇచ్చింది.

ఏంటీ మాస్క్డ్ (Masked Aadhaar) ఆధార్?

మామూలుగా 12 అంకెల యూనిక్ ఐడీతో ఆధార్ కార్డును ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఈ Masked Aadhaar లో చివరి నాలుగు అంకెలను మాత్రమే చూపిస్తారు.

https://myaadhaar.uidai.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్లి.. ఈ ఆధార్ డౌన్ లోడ్ సెక్షన్ పైన క్లిక్ చేయాలి. అక్కడ మన ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి. ‘మాస్క్డ్ ఆధార్ కావాలా?’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత డౌన్ లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్డ్ ఆధార్ ను పొందవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do not give xerox copies of Aadhaar to anyone"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0