Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Karthika Masam

శివకేశవుల మాసం కార్తీకమాసం..!

Karthika Masam

విష్ణుదేవుడితో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదని మహర్షులు చెపుతున్నారు.

కార్తీకమాసం శివకేశవులకు ఇష్టమైంది.

ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రం, మహిమాన్వితమైనది.

శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన కార్తీకం నెల రోజులూ ఎంతో పవిత్రమైనవి.

కార్తీకమాసంలో వచ్చే పాడ్యమి నుండి కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి వరకు ఎంతో పవిత్రంగా వ్రతాలను చేస్తుంటారు 

కార్తీకమాసంలో వచ్చే పాడ్యమి రోజున బలిపాడ్యమి, విదియనాడు వచ్చే భగనీహస్త భోజనం ఆధ్యాత్మిక సాధనకు అనువైన పండుగలు అని అంటారు.

కార్తీకమాసంలో చేసే దీప దానం చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది.

కార్తీకమాసంలో దానాలు, జపం, ఉపవాసం, వనభోజనం చాలా శుభప్రదం.

కార్తీకమాసంలోని మొదటి రోజు నుండీ సూర్యోదయానికి ముందే నదీస్నానం చేయడం శ్రేష్టమైనది.

కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీళ్ళతో స్నానం చేసిన తరువాత సూర్యాస్తమయం తరువాత సంధ్యాదీపం పెట్టడం, తులసి పూజ, గౌరీపూజ చేయడం ఈ మాసంలోని ప్రత్యేకతలు.

కార్తీకమాసంలో కార్తీక శుద్ధనవమిని అక్షయ నవమిగా, తరువాత వచ్చే ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని,

కార్తీక శుద్ధ ద్వాదశి రోజును క్షీరాబ్ధిద్వాదశి అని,

కార్తీక శుద్ధ త్రయోదశి రోజున స్వాయంభువ మన్వంతరం ప్రారంభమయిందని అంటారు.

కార్తీక శుద్ధ చతుర్థశిని మహాకార్తి అని కూడా అంటారు. అలాగే కార్తీకపౌర్ణమి రోజున గౌరీవ్రతం, కార్తికేయ దర్శనాలు చేసుకుంటారు.

కార్తీక బహుళ ఏకాదశి రోజున బోధనా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు.

కార్తీకమాసంలో ఎటువంటి మంచి పనిచేసినా 'కార్తికదామోదర ప్రీత్యర్థం' అని ఆచరించాలని శాస్త్రోక్తి. శరదృతువులో నదీప్రవాహంలో ఔషధాల సారం ఉంటుంది, అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైన శరదృతువులోని పవిత్ర జలాన్ని 'హంసోదకం' అని అంటారు.

కార్తీకమాసంలో మానసిక శారీరక రుగ్మతులను తొలగించి ఆయుష్షు, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం ప్రముఖమైనది,

పైత్య ప్రకోపాలను తగ్గించడానికే హంసోదక స్నానం. సూర్యోదయానికి ముందే నదిలో ఉదరభాగం మునిగేలా స్నానం ఆచరిస్తే ఉదర సంబంధమైన వ్యాధులు నయమవుతాయని పండితులు చెబుతున్నారు.

అలాగే కార్తీకమాసం సూర్యోదయానికి పూర్వమే విష్ణు సన్నిధిలో విష్ణు కీర్తనలు గానం చేస్తే వేలగోవుల దానఫలం, కీర్తనలకు వాయిద్యం వాయించేవానికి వాహపేయ యజ్ఞఫలం,

నాట్యం చేసేవానికి సర్వతీర్థ స్నానఫాలం,

అర్చనా ద్రవ్యాలను సమర్పించి వానికి అన్ని ఫలాలూ, దర్శనాదులు చేసేవారికి ఈ ఫలాలలో ఆరవవంతు ఫలం లభిస్తుంది. 

సూర్యోదయకాలంలో నిద్ర మేల్కొని విష్ణు, శివాలయాలలో భగవంతుణ్ణి ధ్యానం, స్తోత్రం, జపం చేయడం వల్ల వేల గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది.

విష్ణు, శివాలయాలు లేని ప్రదేశాలలో

ఇతర దేవాలయాలలో.. లేకపొతే రావిచెట్టు మొదట్లో గాని, తులసీవనంలో గాని ఉండి భగవత్ స్మరణ చేయాలి. ముఖ్యమైన సూచన ఏమిటంటే తడిబట్టలతో దీపారాధన చేయకూడదు అలాగే శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో స్త్రీలు తులసిచెట్టు ముందు ప్రతిరోజూ దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజ చేయాలి.

తులసిలో సర్వతీర్థాలు ఉన్నాయని అంటారు.

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా

యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్

అని శ్లోకం చదువుతూ భక్తితో తులసికి నమస్కరించాలి. కార్తీకమాసంలో కృత్తికలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి చంద్రని అనుగ్రహం పొందడానికి అభిషేక ప్రియుడు అయిన పరమేశ్వరుని ఆరాధించాలి.

కార్తీకమాస సోమవారాలు.

శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం.

అందులోనూ శివకేశవులకు యిష్టమైన కార్తీకమాసంలోని సోవారాలు స్నాన, జపాలు ఆచరించేవారు వెయ్యి అశ్వమేథాల ఫలాన్ని పొందుతారు.

కార్తీకమాస సోమవారాల్లో ఆరు రకాల వ్రత విధి ఉంది. అవి 

ఉపవాసం:

శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలంతా ఉపవాసంతో (అభోజనం) గడిపి, సాయంకాలం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తరువాత తులసితీర్థం మాత్రమే సేవించాలి.

ఏకభుక్తం

ఏకభుక్తం అంటే ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలన్నమాట.

ఉదయం స్నానం చేసి దాన, తపం, జపాలు చేసిన తరువాత మధ్యాహ్నం పూట భోజనం చేసి,

రాత్రి శైవతీర్థమో, తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి.

నక్తం

పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం కానీ, ఉపాహారం కానీ స్వీకరించాలి.

అయాచితం

భోజనం కోసం తాము ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం

స్నానం :

పైవాటికి వేటికీ శక్తిలేని వాళ్ళు సమంతరం స్నానం, జపాలు చేసినా చాలు.

తిలదానం

మంత్ర, జపవిధులు కూడా తెలియనివాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది.

పైన పేర్కొనబడిన వాటిల్లో ఏది చేసినా సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది అని పురాణాల ద్వారా తెలుస్తోంది. పరమశివుడి కుమారుడైన కుమారస్వామిని కృత్తికలు పెంచడం వల్ల వారి పేరుతొ ఉన్న కార్తీకమాసం అంటే పరమశివుడికి మహాప్రీతి.

గరళకంఠుడైన పరమశివుడు తమోగుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు

అందుకే ఈ నెలలో సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

కార్తీకమాసంలో పాడ్యమి నుంచి కార్తీక వ్రతం ప్రారంభించాలి.

దామోదరుడైన (పద్మనాభుడైన మహావిష్ణువు)ను ఉద్దేశించి దీన్ని చేయాలి

ఈ తులామాసంలో గోష్పాదమంత జలప్రదేశంలో కూడా అనంతశయనుడు అయిన శ్రీమహావిష్ణువు నివశించి ఉంటాడు

నదులు, చెరువులు, బావులు, గుంటలలో స్నానాలు చేసి దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు చేయాలి. త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమి రోజున ప్రారంభం అయినట్లు పంచాంగాల ద్వారా తెలుస్తోంది.

కార్తీకమాసంలో కృత్తికా నక్షత్రం, గురు గ్రహం, సోమవారం కలిసివస్తే దాన్ని పరమపవిత్రమైన రోజుగా గుర్తించాలి అని వేదం చెబుతుంది.

శ్రీ మహావిష్ణువును నక్షత్ర పురుషుడిగా ఆరాధించే సంప్రదాయం కూడా ఉంది.

ఈ నక్షత్ర పురుషుని వర్ణన, విశ్వాంతరాళపు నక్షత్రసీమలను పురుషాకారంగా వర్ణించిన తీరుకు రూపకల్పన అనిపిస్తుంది.

నక్షత్ర పురుషునికి.

కృత్తికలు కటి (నడుము) స్థానంగా,

మూలా నక్షత్రం పాదాలుగా,

రోహిణి నక్షత్రం తొడలుగా,

అశ్విని నక్షత్రం మోకాళ్ళుగా ఉన్నాయి.

కాగా పూర్వాషాఢ నక్షత్రం, పురుషాఢ నక్షత్రం,

ఫల్గునీ నక్షత్రాలు మర్మస్థానాలుగా,

భాద్రపద నక్షత్రాలు భుజాలుగా,

రేవతి నక్షత్రం కుక్షిగా,

అనూరాధ నక్షత్రం వక్షస్థలంగా,

విశాఖ నక్షత్రం ముంజేతులుగా,

హస్త చేతులుగా,

పునర్వసు నక్షత్రం వేళ్ళుగా,

జ్యేష్ఠ కంఠంగా,

పుష్యమి నక్షత్రం ముఖంగా,

భరణి నక్షత్రం శిరస్సుగా మారిపోయాయి.

కార్తీక స్నాన సంకల్పం.

సర్వపాప హారం పుణ్యం స్నానం కార్తిక సంభవం !

నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తు తే !!

అనుకుంటూ ఆచమనం చేసిన తరువాత  సంకల్పం

దేశాకాలౌ సంకీర్త్య గంగా వాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌన్దరీ కాశ్యమేధాది సమస్తక్రాటు ఫలా వాప్త్యార్థం, ఇహజన్మని జన్మాంతర రేచ బాల్య యౌవన కౌమార వార్థకేషు జాగృత్ స్వప్న సుషుప్త్యవస్థాసుజ్ఞానతో జ్ఞానతశ్చ, కామతో కామతః స్వతః ప్రేరణయా సంభావితానాం, సర్వేషాం పాపాన మపనోడ నార్థం, ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ద్యర్థం, క్షేమ స్థైర్య విజయాయురారోగ్యైశ్వర్యాదీనాం ఉత్తరోత్తరాభి వృద్ధ్యర్థం, శ్రీ శివకేశావానుగ్రహ సిద్ద్యర్థం వర్షే వర్షే ప్రయుక్త కార్తికమాసే ... వాసర (వారం పేరు), యుక్తానాం ..... తిథౌ (తిథి) శ్రీమాన్ (గోత్రనామం) గోత్రాభిజాతః --- (పేరు) నామదేయోహం - పవిత్ర కార్తిక ప్రాతఃస్నానం కరిష్యే

మంత్రం

తులా రాశింగతే సూర్యే, గంగా త్రైలోక్యపావనీ !

నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తు తే!!

మంత్రం చదువుతూ ప్రవాహానికి ఎదురుగా, వాలుగా, తీరానికి పరాజ్ముఖంగా స్నానం చేసి కుడిచేతి బొటనవేలితో నీళ్ళను తీసుకుని, మూడు దోసిళ్ళ నీళ్ళు తీరం వైపు చల్లి, తీరం చేరుకొని, కట్టుబట్టల కొనలను నీళ్ళు కారిపోయేలా పిండాలి. దీన్నే యక్షతర్పణం అని అంటారు.

ఆలయానికి వెళ్ళి, శివుడు లేదా విష్ణువుకు అర్చన చేసి ఆవునేతితో దీపారాధన చేయాలి.

తరువాత స్త్రీలు తులసి మొక్కని..దీపాన్ని,

పురుషులు కాయలు ఉన్న ఉసిరి కొమ్మను దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణతో దానం చేయాలి.

కార్తీక మాసంలో ముఖ్యమైన పండుగలు రెండు.

దానిలో  ఒకటి క్షీరాబ్ధిద్వాదశి,

రెండవది కార్తీకపౌర్ణమి.

కార్తీక పౌర్ణమి రోజున దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి. ఉసిరికాయల మీద వత్తులు పెట్టి దీపాలు పెడతారు, నదులలో దీపాలను వదలటంతో పాటు పండితులకు దీపదానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కార్తిక పౌర్ణమి రోజున కృత్తికా శివయోగం అనే పూజా విధానాన్ని కొన్ని ప్రాంతాలలో చేస్తారు.

మరికొన్ని ప్రాంతాలలో శివాలయాల దగ్గర జ్వాలాతోరణం నిర్వహించి శివారాధన చేసి పాడిపంటలను రక్షించమని కోరుకుంటారు.

జ్వాలాతోరణం అంటే కార్తికపౌర్ణమి రోజున గడ్డిని తోరణాలుగా చేసి శివాలయంలో మంట వేసి పార్వతీదేవి విగ్రహాన్ని మూడుసార్లు ఆ మంటకిందుగా తిప్పుతారు.

జ్వాలాతోరణం నిర్వహించడానికి కారణం ఈ విధంగా చెబుతారు.

దేవతలు రాక్షసులు సముద్రమథన చేసిన సమయంలో హాలాహలం వచ్చినప్పుడు పార్వతీదేవి పరమశివుణ్ణి ప్రార్థించి మింగవలసిందిగా ప్రార్థించిన సందర్భంలో ప్రజారక్షణ చేసినందుకు సంకేతంగా జ్వాలాతోరణం జరుపుతారట.

ఉదయం పూట శ్రీహరి పూజ, సంధ్య వేళ శివారాధన, దీపాల అలంకరణ, ఆకాశ దీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తున్నది.

దీపదాన మంత్రం

సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంప చ్చుభావహం !

దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమ !!

జ్ఞానం, సంపదలు, శుభాలనూ కలిగించేదైన, దీపదానాన్ని చేస్తున్నాను.  దీనివల్ల నాకు నిరంతరం శాంతి సుఖాలు ఏర్పడుగాక' అని చెపుతూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి..

కార్తీక మాసం 2022 తేదీలు కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత 

కార్తీక మాసం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి మరియు దామోదర మాసం , కార్తిగై , కార్తీక , కార్తీకం మొదలైన వివిధ పేర్లతో పిలువబడుతుంది ఈ మాసం విష్ణువు మరియు శివుని భక్తులకు శ్రేయస్కరం .

కార్తీక మాసం 2022 తేదీలు 

తెలంగాణ , మహారాష్ట్ర , గుజరాత్ , ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలకు - 2022 లో కార్తీక మాసం అక్టోబర్ 26 వ తేదీ బుధవారం ప్రారంభమై నవంబర్ 23 వ తేదీ బుధవారం ముగుస్తుంది . 

కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత 

చాంద్రమానం దక్షిణాయణం మరియు ఉత్తరాయణం అని రెండు భాగాలుగా విభజించబడింది . కార్తీక మాసం దక్షిణాయన పరిధిలోకి వస్తుంది . సాధన పరంగా , దక్షిణాయనం శుద్ధి కోసం , ఉత్తరాయణం జ్ఞానోదయం కోసం .

సాధన అంటే మోక్షాన్ని పొందే ప్రక్రియ . అన్ని మాసాలలో దక్షిణాయన కార్తీక మాసం సాధనకు అత్యంత అనుకూలమైనది . అందువల్ల కార్తీక మాసం చంద్రమాన క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి .

కార్తీక సోమవరం 

కార్తీక మాసంలో సోమవారాల్లో ప్రత్యేక ఆచారాలు మరియు ఉపవాసాలు పాటిస్తారు . సోమవారాలు సాధారణంగా శివుని ఆరాధనకు అంకితం చేస్తారు . ప్రత్యేకించి , శ్రావణ మాసం మరియు కార్తీక మాసంలోని సోమవారాలను శివభక్తులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు . సోమవరం ( సోమవారం ) అనే పేరు శివుని వెయ్యి పేర్లలో ఒకటైన సోమేశ్వరుడి నుండి వచ్చింది . శివుని తాళాల మీద నెలవంక ( సోమ ) ఉండటం వలన అతనికి సోమేశ్వరుడు అనే పేరు వచ్చింది .

దక్షుని శాపం నుండి మరియు శివుని నుండి ఆశీర్వాదం మరియు అతని తాళాలలో స్థానం పొందడానికి చంద్రుడు సోమవార వ్రతం ఆచరిస్తాడని నమ్ముతారు . తప్పించుకోవడానికి

కార్తీక సోమవారం తేదీలు 

కార్తీక మాసం 2023 లో నాలుగు సోమవారాలు ( కార్తీక సోమవారం ) ఉన్నాయి . 

1 ) నవంబర్ 20

2 ) నవంబర్ 27 

3 ) డిసెంబర్ 04 

4 ) డిసెంబర్ 11

కార్తీక మాసంలో ఆచారాలు 

దీపం వెలిగించడం కార్తీక మాసంలో దీపాలు వెలిగించి , తులసి మొక్క ముందు మరియు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు ఉంచుతారు కార్తీక స్నాన్ లేదా నదిలో స్నానం 

కార్తీక మాసంలో నదీస్నానం చేయడం మరో ముఖ్యమైన ఆచారం . శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంతో కూడిన వర్షాకాలంలో నదులకు మంచినీరు అందుతుంది . నదులు ఒడ్డున ప్రవహిస్తూ ఉగ్రరూపం దాల్చి నందున శ్రావణ , భాద్రపద

శివాలయాలను సందర్శిస్తారు 

  • శివాలయాలు మాసంలో ప్రత్యేక పూజలు మరియు ఆచారాలను పాటిస్తారు . 
  • శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం ఈ నెలలో 2 మిలియన్లకు పైగా భక్తులను ఆకర్షిస్తుంది . 
  • తెలంగాణలోని వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసం సందర్భంగా కోటి మందికి పైగా భక్తులను ఆకర్షిస్తుంది . 
  • శివ పంచారామాలు లేదా పంచారామ క్షేత్రాలలోని ఐదు ఆలయాలను సందర్శించడం కార్తీక మాసంలో జరుగుతుంది .
*🎻🌹🙏రేపటి నుండి కార్తీకమాసం ప్రారంభం కాబట్టి*

*కార్తీకమాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి? విధానాలు తెలుసుకుందా..!!*

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸దీపావళి మరుసటిరోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.

🌿న కార్తీక సమో మాసో
న శాస్త్రం నిగమాత్పరమ్ |
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః||

🌸అంటే కార్తీక మాసంలోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. 

🌷 ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం. 🌷

🌿కార్తీక శుద్ధ పాడ్యమి :
తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, గుడికి వెళ్లాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.

🌸విదియ :
సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.

🌿తదియ :
అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.

🌸చవితి :
నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.

🌿పంచమి :
దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.

🌸షష్ఠి :
ఈరోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుంది.

🌿సప్తమి :
ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.

🌸అష్టమి :
ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.

🌿నవమి :
నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.

🌸దశమి :
నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.

🌿ఏకాదశి :
దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.

🌸ద్వాదశి :
ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.

🌿త్రయోదశి :
సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.

🌸చతుర్దశి :
పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.

🌿కార్తీక పూర్ణిమ :
కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.

🌸కార్తీక బహుళ పాడ్యమి :
ఆకుకూర దానం చేస్తే మంచిది.

🌿విదియ :
వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.

🌸తదియ :
పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.

🌿చవితి :
రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.

🌸పంచమి :
చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.

🌿షష్ఠి :
గ్రామదేవతలకు పూజ చేయాలి.

🌸సప్తమి :
జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.

🌿అష్టమి :
కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.

🌸నవమి :
వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.

🌿దశమి :
అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.

🌸ఏకాదశి :
విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

🌿ద్వాదశి :
అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.

🌸త్రయోదశి :
ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.

🌿చతుర్దశి :
ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.

అమావాస్య :
పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి..స్వస్తి..

తేదీ ప్రాముఖ్యత 

  • కార్తీక మాసంలో ముఖ్యమైన పండుగలు..:2023 నవంబర్​ 14వ తేదీ మంగళవారం పాడ్యమి తిథితో కార్తీకమాసం ప్రారంభం అవుతుంది. అదే రోజుగోవర్ధన పూజకూడా చేస్తారు.
  • నవంబర్ 15 బుధవారం రోజున యమవిదియ- భగినీహస్త భోజనం.
  • నవంబర్​ 17 శుక్రవారం రోజున నాగుల చవితి.
  • నవంబర్​ 20న కార్తీక మాసం మొదటి సోమవారం, కార్తవీర్య జయంతి.
  • నవంబర్​ 22న యాజ్ఞవల్క జయంత్.
  • నవంబర్​ 23న మతత్రయ ఏకాదశి.
  • నవంబర్​ 24న శుక్రవారం క్షీరాబ్ధి ద్వాదశి.
  • నవంబర్​ 26న ఆదివారం జ్వలా తోరణం.
  • నవంబర్​ 27న సోమవారం కార్తీకమాసం రెండో సోమవారం, కార్తీక పూర్ణిమ.
  • డిసెంబర్​ 4న కార్తీక మాసం మూడవ సోమవారం.
  • డిసెంబర్​ 11న కార్తీక మాసం నాలుగవ సోమవారం.
  • డిసెంబర్​ 13న బుధవారం పోలి స్వర్గం.

ఓం నమః శివాయ...ఓం కార్తీక దామోదరాయ నమః..!

లోకా సమస్తా సుఖినోభవంతు..!!

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Karthika Masam"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0