Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Education Loans

 Education Loans : ఉన్నత విద్యా రుణం పొందాలంటే ఎలా ?

Education Loans

భారత్‌లో 25 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు మొత్తం జనాభాలో 54% కంటే ఎక్కువ మంది ఉన్నారు.

ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశం మనది. వీరిలో చాలా మంది ఉన్నత విద్యకు సిద్ధపడేవారు గణనీయ సంఖ్యలోనే ఉంటారు. ఇప్పుడు ఏ కుటుంబంలోనైనా పిల్లల విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఉన్నత విద్యకు ఫీజులు, ఖర్చులు లక్షలు అవుతున్నాయి. రూ.1 కోటి దాటుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. ఈ ఫీజులు మూలంగా అర్హత ఉన్న విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విద్యా రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వ సంకల్పంతో అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ముందుకు వస్తున్నాయి.

విద్యాలక్ష్మి పోర్టల్‌

ఈ విద్యా రుణాలను పొందడానికి ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి పోర్టల్‌ (www.vidyalakshmi.co.in)ని ఉపయోగించుకోవచ్చు. ఇది ఈ రుణాలకు సింగిల్‌ విండో ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) మార్గదర్శకత్వంలో ఈ పోర్టల్‌ను రూపొందించారు. దాదాపుగా అన్ని బ్యాంకులూ ఈ పోర్టల్‌కు అనుసంధానమై ఉంటాయి. ఈ పోర్టల్‌ను యాక్సెస్‌ చేయడం ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే విద్యా రుణాల కోసం బ్యాంకులకు దరఖాస్తు చేయవచ్చు. రుణ దరఖాస్తు పరిస్థితిని ఎప్పటికప్పడూ ట్రాక్‌ చేయొచ్చు.

వడ్డీ రేటు

విద్యా రుణాల కోసం ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంకునే తీసుకుంటే అన్ని రకాల విద్యా కోర్సుల స్వదేశీ, విదేశీ విద్య ఫీజుల నిమిత్తం.. రూ. 7.5 లక్షల నుంచి 1.5 కోట్ల వరకు కూడా రుణం మంజూరు చేస్తుంది. ఈ రుణానికి దాదాపుగా 10.55% ఫ్లోటింగ్‌ వడ్డీ రేటును వసూలు చేస్తుంది. రుణం తిరిగే తీర్చే కాలవ్యవధి 7-15 సంవత్సరాలు. అయితే అత్యంత ప్రతిష్టాత్మక దేశీయ విద్యా సంస్థల్లో అడ్మిషన్‌ పొందితే స్కాలర్‌ లోన్‌ కింద 8% నుంచి 9.5% వడ్డీ రేటుకు కూడా రుణాన్ని ఎస్‌బీఐ ఇస్తోంది. మహిళా విద్యార్థులకు అన్ని రకాల విద్యా రుణాల్లో 0.50% వడ్డీలో రాయితీ కూడా ఉంది. అయితే ఈ రుణాలకు వడ్డీ రేట్లు వ్యక్తుల ఆదాయం, రుణ పూచీకత్తు, క్రెడిట్‌ స్కోరులను బట్టి మారవచ్చు. వేర్వేరు బ్యాంకుల వడ్డీ రేట్లలో మార్పులుంటాయి. ప్రాసెసింగ్‌ ఫీజులు కూడా అదనంగా ఉంటాయి.

రుణ అర్హతలు

విద్యార్థులు 18-35 సంవత్సరాల మధ్య వయసున్న భారతీయులై ఉండాలి. విద్యాపరంగా మంచి ట్రాక్‌ రికార్డ్‌ని కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన దేశీయ/విదేశీ యూనివర్శిటీలు, విద్యాసంస్థల్లో అడ్మిషన్‌కు అనుమతుండాలి. తల్లిదండ్రులు/సంరక్షకులు స్థిరమైన మంచి ఆదాయాన్ని సంపాదించేవారై ఉండాలి. రుణ మొత్తం ఆదాయ మూలాన్ని బట్టి బ్యాంకులు నిర్ణయిస్తాయి.

విద్యా రుణం మంజూరు

ఈ విద్యా రుణాలు.. పూర్తి కాల, పార్ట్‌ టైమ్‌ కోర్సులకు, పనిచేసే నిపుణులకు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ రుణాలు 2 రకాలు. మొదటిది కొలేటరల్‌ (పూచీకత్తు) విద్యా రుణం. ఇందులో రుణగ్రహీత రుణం పొందేందుకు వివిధ రకాల ఆస్తులను బ్యాంకుకు తాకట్టు పెట్టొచ్చు. ఈ తాకట్టు అనేది ఇల్లు, వ్యవసాయేతర భూమి, ఫ్లాట్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బీమా పాలసీలు, మంచి రేటింగ్‌ ఉన్న కార్పొరేట్‌ బాండ్‌లు, ప్రభుత్వ సెక్యూరిటీలు / బాండ్‌లు మొదలైనవి ఉంటాయి. రెండోది నాన్‌-కొలేటరల్‌ లోన్‌.. అంటే రుణ గ్రహీత ఎటువంటి ఆస్తినీ తాకట్టు పెట్టనక్కర్లేదు. ఈ రుణం రూ. 4 లక్షల నుంచి రూ. 7.5 లక్షలు పరిధిలో మాత్రమే బ్యాంకులు మంజూరు చేస్తాయి. అయితే ఈ పూచీకత్తు లేని విద్యా రుణాలకి విద్యార్థి, సహ-దరఖాస్తుదారు (తల్లిదండ్రుల) ఆదాయం, సిబిల్‌ స్కోరు మొదలైనవి నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఇటువంటి రుణాలను పొందేందుకు దరఖాస్తుదారుని విద్యా సంబంధ ప్రొఫైల్‌ కూడా బ్యాంకులు చూస్తాయి. విద్యా రుణాన్ని తిరిగి చెల్లించే విషయానికొస్తే విద్యార్థి రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే, సహ-దరఖాస్తుదారు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

వడ్డీ చెల్లింపు

విద్యా రుణాన్ని తీసుకున్న వెంటనే రుణ చెల్లింపు ప్రారంభం కాదు. ఇది మారటోరియం వ్యవధి తర్వాత ప్రారంభమవుతుంది. ఇది కోర్సు పూర్తయిన 6 నుంచి 12 నెలల వరకు ఉంటుంది. ఈ వ్యవధి ముగిసే వరకు చెల్లింపు ప్రారంభం కానప్పటికీ, రుణం మొదట విడత పంపిణీ అయిన రోజు నుంచే వడ్డీ లెక్కింపు ప్రారంభమవుతుంది. అంటే వడ్డీ పెరుగుతూ ఉంటుంది. అందుచేత వడ్డీ పేరుకుపోకుండా ఉండడానికి విద్యార్థి చదువుతున్నప్పుడే చెల్లింపును ప్రారంభించడం చాలా మంచిది. తల్లిదండ్రులే కాకుండా, విద్యార్థి ఏదైనా పార్ట్‌-టైమ్‌ ఉద్యోగంలో నిమగ్నమై ఉంటే వడ్డీని చెల్లించడం ప్రారంభించొచ్చు.

ఈఎంఐ

15 ఏళ్ల వరకు రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం బ్యాంకులు ఇచ్చినప్పటికీ.. స్వల్పకాలాన్ని ఎంచుకోవడం మంచిది. తక్కువ కాల వ్యవధి వల్ల ఈఎంఐ మొత్తాన్ని ఎక్కువగా చెల్లిస్తున్నట్లు అనిపించినా.. చెల్లించే వడ్డీ మొత్తంలో చాలా ఆదా అవుతుంది. రుణ గ్రహీత తన ఆదాయం, జీవన వ్యయాలు మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుని రుణాన్ని చెల్లించే కాల వ్యవధిని నిర్ణయించుకోవాలి. సరైన సమయానికి ఈఎంఐ చెల్లించడానికి జీతం పడే బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్‌ను సెటప్‌ చేసుకోవడం మంచిది. సరైన రుణ చెల్లింపుతో మంచి క్రెడిట్‌ స్కోరు నిర్వహిస్తే.. భవిష్యత్‌ రుణాలకు సహాయకారిగా ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Education Loans "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0